Bigg Boss 9: శ్రష్టి వర్మ ఎలిమినేషన్ వెనుక ఆ పొలిటికల్ పార్టీ? పుష్ప కొరియోగ్రాఫర్ అందుకే ఔట్
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారం అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం శ్రస్టి వర్మ ఎలిమినేషన్. ఆ వారంలో నామినేషన్స్‌లో నిలిచిన వారిలో ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ప్రేక్షకుల ఓటింగ్‌లో శ్రష్టి కంటే తక్కువగా ఓటింగ్ వచ్చిన వారు ఉన్నారు. కానీ ఆమెనే ఎలిమినేట్ చేయడంపై బిగ్‌బాస్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. అయితే శ్రష్టి వర్మ ఎలిమినేషన్ వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
తొలి వారానికే శ్రష్టి వర్మ ఎలిమినేట్
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తర్వాత కొరియోగ్రాఫర్‌గా తన పని తాను చూసుకుంటూ వచ్చిన శ్రష్టి వర్మ.. బిగ్‌బాస్‌లోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ ఆమె పేరు వినిపించలేదు. కానీ అనూహ్యంగా కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. బిగ్‌బాస్ లాంచింగ్ రోజున త్వరగా బయటికి వచ్చేస్తే.. మనిద్దరం కలిసి సాంగ్ చేద్దామని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. దీనికి టెంప్ట్ అయ్యిందో? ఏమో కానీ వారానికే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. హౌస్‌లో జోష్‌గా, చురుకుదనంతో టాస్క్‌లలో పాల్గొంది శ్రష్టి వర్మ. అయితే నామినేషన్స్‌లో ఆమెకు అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ దక్కలేదు.

డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు
తొలివారం తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, ఆశా షైనీ, డిమోన్ పవన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, శ్రష్టి వర్మ, సంజన గల్రానీలు నామినేషన్స్‌లో నిలిచారు. ఓటింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఏ దశలోనూ శ్రష్టి హవా చూపించలేకపోయింది. ఎప్పుడు చూసినా చివరి నుంచి మూడు స్థానాలు దాటి పైకి చేరుకోలేదు. డేంజర్ జోన్‌లో ఆశా షైనీ, శ్రష్టి వర్మలు నిలవగా.. ఖచ్చితంగా ఆశా షైనీయే తొలి వారం హౌస్‌ను వీడుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఫ్లోరా షైనీ సేవ్ అవ్వగా.. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు.
శ్రష్టికి వ్యతిరేకంగా నెగిటివ్ క్యాంపెయిన్
శ్రష్టి వర్మ ఎలిమినేషన్ వెనుక పలు కారణాలు ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ముందు రేగిన కొన్ని వివాదాలు, శ్రష్టి వర్మ చేసిన కొన్ని కామెంట్స్ ఆమెకు వ్యతిరేకంగా మారినట్లుగా చెబుతున్నారు. దీంతో శ్రష్టికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిందని ఇవన్నీ ఆమె బిగ్‌బాస్ నుంచి వారానికే ఎలిమినేట్ కావడానికి దోహదం చేశాయని అంటున్నారు.
ఆ ఇద్దరు నేతలపై శ్రష్టి వివాదాస్పద వ్యాఖ్యలు
అయితే శ్రష్టి వర్మ ఎలిమినేషన్ వెనుక ఓ పొలిటికల్ పార్టీ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రష్టి వర్మ కొద్దిరోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో జాతిపిత మహాత్మాగాంధీ, భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. వారు దేశాన్ని నాశనం చేశారని.. రాబోయే తరం వీరి గురించి కాకుండా నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల గురించి నేర్చుకోవాలని రాసుకొచ్చింది. దేశంలో పిల్లలు చదువకునే పాఠ్య పుస్తకాల నుంచి వారి జీవిత చరిత్రలను తొలగించాలని శ్రష్టి వర్మ డిమాండ్ చేసింది.
బిగ్‌బాస్‌ను ముట్టడిస్తామని వార్నింగ్
దీంతో శ్రష్టి వర్మపై కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ (ఎన్ఎస్‌యూఐ) భగ్గుమంది. ఏపీ, తెలంగాణలలోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయులను హేళన చేస్తూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రష్టి వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. ఇక.. ఆమె బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విషయం తెలుసుకున్న ఎన్ఎస్‌యూఐ నేతలు.. శ్రష్మి వర్మను బిగ్‌బాస్ నుంచి బయటికి పంపించాలని లేదంటే అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించి, బిగ్‌బాస్ హౌస్‌ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన బిగ్‌బాస్ నిర్వాహకులు.. కొన్నివారాల పాటు హౌస్‌లో ఉండాల్సిన శ్రష్టి వర్మను తొలి వారమే ఎలిమినేట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే శ్రష్టి వర్మ స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











