Bigg Boss Telugu: భరణి కాళ్లపై రామ్.. రెయిన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన లక్స్ పాప!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్‌లు ప్రేక్షకులకు వినోదం, ఉత్కంఠతో నిండిన అనుభూతిని అందించాయి. డే ప్రారంభం పవర్ కార్డు టాస్క్‌తో అయ్యింది. హౌస్ సభ్యులు ఎల్లో, రెడ్, బ్లూ టీంలుగా విడిపోయి పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో ప్రధాన లక్ష్యం ఆరెంజ్ బాల్‌ను గార్డెన్‌లో ఉన్న హిప్పోకు సురక్షితంగా తేవడం. అయితే, ఇతర టీమ్స్ వారు ఆ ప్రతిదాని అడ్డుకోవాల్సి ఉండడంతో టాస్క్ ఫిజికల్, ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో ఇమాన్యుయల్ తన ఆటతీరుతో హైలైట్ అయ్యాడు. ఎంత మంది అడ్డుకున్నా, విక్రమార్కుడిలా ముందుకు సాగాడు. గేమ్ ప్రమాదకర స్థాయికి చేరడంతో, సంచాలకుడు భరణి టాస్క్‌ను పాస్ చేయాల్సి వచ్చింది. చివరికి రెడ్ టీం ఇమాన్యుయల్ - కళ్యాణ్ విజయం సాధించి పవర్ కార్డు పొందారు. వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా అర్హత పొందారు.
కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్‌లో బిగ్ బాస్ వీరిని మూడు జంటల ఎంపికకు ఆహ్వానించాడు. ఎంపిక చేసిన వారిలో సుమన్ - తనూజ, సంజన - రాము, రీతూ చౌదరి - ఫ్లోరా షైనీ. మొదటి రౌండ్‌లో సుమన్ - తనూజ పోటీలో పాల్గొన్నారు. అయితే, వారు టాస్క్ రూల్స్‌ను ఉల్లంఘించడంతో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వారిని డిస్‌క్వాలిఫై చేశారు. ఈ పరిణామంపై తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనై, వాష్‌రూమ్‌లో వెక్కి వెక్కి ఏడ్చింది. రీతూ చౌదరి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. తర్వాతి రౌండ్స్‌లో రాము- సంజన జంటలో రాము, రీతూ - ఫ్లోరా పోటీలో రీతూ విజయం సాధించారు. ఫలితంగా ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రాము, రీతూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. వీరిలో ఫైనల్ గా రామ్ రాథోడ్ బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా అవతరిస్తారు. టాస్క్‌లో జరిగిన భావోద్వేగాలు, మెలోడ్రామా, శారీరక శ్రమ అన్ని ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశాయి. అయితే, ఇమాన్యుయల్ తన కామెడీతో అన్ని క్షణాల్లో నవ్వు పంచాడు. "ఎవరో నా నడుము గిల్లారు.. అది ఎవరో చెప్పాలంటున్నా" అనే కామెంట్స్‌తో సంచాలకుడు భరణి, తనూజ, రీతూ చౌదరి అందరూ నవ్వుకున్నారు.

ఇక బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షోలోని తాజా ప్రోమోలో ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ రైడ్ లోకి తీసుకెళ్లింది. దసరా పండుగ ప్రత్యేక ఎపిసోడ్ లో రాము రాథోడ్ తన హార్ట్ టచ్చింగ్ మాటలతో ప్రేక్షకులను కదిలించారు. రాము మాట్లాడుతూ, "ప్రతి దసరా పండుగకు నేను మా అమ్మా-నాన్నతో ఉండేవాడిని. వారికి జమ్మిపెట్టి కాళ్లను మొక్కేవాడిని. ఇప్పుడు ఇక్కడ నా డాడీ-మమ్మీ ఇద్దరూ ఉన్నారు" అంటూ భరణి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో భరణి రియాక్ట్ అయి రాముని హగ్ చేసి, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమనే చెప్పాలి.
తదుపరి సీన్ లో ఇమాన్యువల్ తన లవ్ స్టోరీని షేర్ చేసాడు. "ప్రతి దసరా పండుగ గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండేవాడిని. కానీ ఈ దసరా నాకు చాలా మిస్ అవుతోంది" అంటూ రాము రాథోడ్ని హగ్ చేసుకుని ఎమోషన్ అవుతున్న క్షణం ప్రోమోలో ప్రేక్షకులను దొరక చేసింది. ఈ ఎమోషనల్ సన్నివేశం తర్వాత కంటెస్టెంట్లు మొత్తం పండుగ వాతావరణంలో రైన్ డ్యాన్స్ లో పాల్గొని దసరాను ఉల్లాసంగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోమోలో మరొక హైలైట్ సీన్ సుమన్ శెట్టి-లక్స్ పాప ఆశా షైనీ జంట డ్యాన్స్.
వానలో తడిసి ముద్దవుతూ.. వారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. సుమన్ షెట్టిలో ఇంత టాలెంటెండ్ డ్యాన్సర్ ఉన్నాడని ప్రేక్షకులు ఆశ్చర్యపోవాల్సిందే. అదేవిధంగా ఇమాన్యువల్-సంజన కలసి ఇచ్చిన డ్యాన్స్ మోమెంట్ కూడా హైలైట్ గా నిలిచింది. మొత్తం ఎపిసోడ్ ఎమోషనల్ గేమ్ తో మొదలై, నవ్వు-ఆనందం కలిగించే హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. రాము-భరణి మధ్య ప్రేమ, అనుబంధం, ఇమాన్యువల్-సంజన, సుమన్-ఆశా డ్యాన్స్ స్పెషల్ హైలెట్ గా మారింది. ఇలా దసరా పండుగ ప్రత్యేకం, ఎమోషన్, డ్యాన్స్, హ్యాపీనెస్ హైలెట్.


Click it and Unblock the Notifications











