భరణితో మాధురికి లింక్ పెట్టి... మా వెంట్రుక పీకలేరంటూ దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు 9 చప్పగా సాగుతున్న దశలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపారు నిర్వాహకులు. వీరిలో ఎక్కువ ఆసక్తిని కలిగించిన పేర్లు ఆయేషా జీనత్, దివ్వెల మాధురి, పికెల్ పాప రమ్య మోక్ష. ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ముగ్గురు ఆశ్చర్యకరంగా రెండు వారాల్లోపే హౌస్‌ను వీడారు. అనారోగ్యంతో ఆయేషా మధ్యలోనే వాలంటరీ ఎలిమినేట్ కాగా.. లీస్ట్ ఓటింగ్‌తో రమ్య మోక్ష, దివ్వెల మాధురిలు హౌస్‌ను వీడారు.
3 వారాలకే మాధురి ఎలిమినేట్
దివ్వెల మాధురి ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటారని అంతా అనుకోగా.. ఆమె కూడా త్వరగానే బయటికి వచ్చేయడంతో బిగ్‌బాస్ లవర్స్ నిరుత్సాహాపడ్డారు. మూడు వారాలు మాత్రమే హౌస్‌లో ఉన్నప్పటికీ దివ్వెల మాధురి తన ముద్ర వేశారు. తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ.. ఎవరికీ సపోర్ట్ చేయకుండా అందరినీ బాదిపడేశారు. బిగ్‌బాస్ రూల్స్ కాదని.. తన రూల్స్ అమలు చేసి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. బిగ్‌బాస్ తెలుగు 9లో ఎనిమిదవ వారం ఎలిమినేట్ కావడంతో మాధురి ప్రయాణం మూడు వారాలకే ముగిసింది. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మాధురి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ ప్రయాణంతో పాటు తనపై వస్తోన్న ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

భరణి - దివ్వెల మాధురిపై ట్రోలింగ్
మీరు, భరణి కలిసి డ్యాన్స్ చేస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైపోతారోనని మీమ్స్ వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా.. మాధురి ఘాటుగా బదులిచ్చారు. బుద్ధిలేని వాళ్లు, గడ్డితినే వెధవలు మీమ్స్ వేయొచ్చు కానీ మీరు వేయకూడదు. మీరు ఎపిసోడ్ చూస్తే డ్యాన్స్ ఎవరు చేయమన్నారు? మేం చేతులు పట్టుకుని చేశామా? హగ్గులు చేసుకుంటూ చేశామా? మీకు అశ్లీలత కనిపించిందా? మేమిద్దరం పక్కపక్కన కూర్చోవడం చూశారా? అని మాధురి మండిపడ్డారు.
భరణి - తనూజల బాండింగ్‌పై వ్యాఖ్యలు
ఇక భరణి - తనూజల బాండింగ్ పై ఆమె మాట్లాడుతూ.. నచ్చినది నచ్చింది అని చెప్పాలి.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అంతేకానీ నోరుమూసుకుని కూర్చొనే రకం కాదు. ప్రపంచంలో ఎవరినైనా అమ్మ అని పిలవొచ్చు కానీ... నాన్న అనేవాడు ఒక్కడే ఉంటాడు అని భరణితో చెప్పానని మాధురి తెలిపారు. నాగార్జున గారు చెప్పాక.. డ్యాన్స్ చేయను అని తప్పించుకోవడం కుదరదు. అశ్లీలత ఉంటే రిజెక్ట్ చేస్తా, మీరిద్దరూ చేతులు పట్టుకోండి అంటే రిజెక్ట్ చేస్తా, మీరిద్దరూ హగ్ చేసుకోండి అంటే రిజెక్ట్ చేస్తా.. నేనొక చోట, భరణి గారు మరో చోట నిలబడి డ్యాన్స్ చేశాం. ఎవడైతే భరణితో నన్ను ట్రోల్ చేస్తున్నాడో వాడు అమ్మకు పుట్టలేదు.. అంత నీచాతి నీచంగా చేసినవాడు నా దృష్టిలో మనిషే కాదని మాధురి మండిపడ్డారు.
మా వెంట్రుక కూడా పీకలేరు
ట్రోల్స్ గురించి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో మాధురికి తెలుసు. మీ జర్నలిస్టులలో ఒకడు ఈరోజు ఏదో మాట్లాడుతున్నాడు. మీరంతా డబ్బులు తీసుకుని నాకు ప్రచారం చేస్తున్నారట, మరి వాడికెంత డబ్బులు కావాలో? కోట్ల రూపాయలు మీడియా వాళ్లకు ఇచ్చానట. దమ్ముంటే నేను రూపాయి ఇచ్చినట్లు ఆధారం ఉంటే నా దగ్గరికి తీసుకురా. ఆ జర్నలిస్ట్ నుంచి కింద వరకు ఎవడైతే ట్రోలర్స్ ఉన్నారో మా వెంట్రుకతో సమానం... మేం ఖాతరు చేయం . ట్రోలింగ్ మీకు సరదాగా ఉండొచ్చు, వ్యూయర్‌షిప్ వస్తుంటే చూసుకుంటారు. నేను ధర్మాన ప్రసాదరావు, ఎర్రం నాయుడు వంటి వాళ్లనే నేను ఖాతరు చేయలేదు, పెద్దపెద్ద వాళ్లతో ఫైట్స్ చేసుకుంటూ వచ్చానని దువ్వాడ శ్రీనివాస్ తేల్చేశారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











