బిగ్‌బాస్‌లో మళ్లీ గుండు అంకుల్ vs రెడ్ ఫ్లవర్ గొడవ.. ఇమ్మాన్యుయేల్‌కు హరీశ్ ఘాటు వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు 9 హాట్ హాట్‌గా సాగుతోంది. తొలివారం నుంచే ఇంట్లో గొడవలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరిత హరీశ్ తన బిహేవియర్‌తో హౌస్‌ను హీటెక్కిస్తున్నాడు. తొలి వారం బిగ్‌బాస్ మొత్తం అతని చుట్టూనే తిరిగింది. ప్రతి దాంట్లో దూరిపోతూ గొడవలు పెట్టేస్తున్నాడు. నోటిదూలతో తనూజ, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి అక్కినేని నాగార్జున చేత చీవాట్లు తిన్నాడు. ఒకదశలో నాగ్ కోపం చూస్తే హరిత హరీశ్ హౌస్‌ను వీడుతాడా అన్న అనుమానం కలిగింది.
హరీశ్‌ను టార్గెట్ చేసిన సెలబ్రెటీలు
బిగ్‌బాస్‌లో రెండో వారం మొదటి రోజు నామినేషన్ సందర్భంగా మరోసారి హరిత హరీశ్ అందరికీ టార్గెట్ అయ్యాడు. గత వారం తమను ఇబ్బంది పెట్టినందుకు గాను సెలబ్రెటీలంతా హరీశ్‌పై విరుచుకుపడ్డారు. తొలిరోజే అతనిని నామినేట్ చేసిన తనూజ పుట్టస్వామి తన కోపాన్ని వెళ్లగక్కింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా సెలబ్రెటీలు హరీశ్‌కు ఎరుపు రంగు పూస్తూ నామినేట్ చేసుకుంటూ వెళ్లారు. మరి అతను చేత మగాళ్లు కాదు, ఆడోళ్లు అనిపించుకున్న భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌లు వదులుతారా.

హరీశ్‌ను టీజ్ చేసిన భరణి
ఇప్పటికే భరణి శంకర్ నామినేషన్స్‌లో హరీశ్ కుట్రలు, పెద్ద మనిషి ముసుగులో అతని జిమ్మిక్కులని చెబుతూ బుర్రకథలా ఓ పాట పాడాడు. ఇప్పుడు తాజాగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది అతను కూడా హరీశ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నామినేషన్ సమయంలో మరోసారి రెడ్ ఫ్లవర్, గుండు అంకుల్ టాపిక్స్ బయటికొచ్చి హౌస్‌లో వాతావరణం హీటెక్కింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇమ్మాన్యుయేల్ - హరీశ్ మధ్య పెద్ద గొడవ జరిగింది.
హరీశ్ - ఇమ్మూ గొడవ
నాగ్ సార్ ముందు ఒప్పుకునేది ఏదో ఆరోజు ఒప్పుకుంటే నాకు కొంచెమైనా న్యాయం జరిగేదనేది నా ఫీలింగ్ అని ఇమ్ము పాయింట్ రైజ్ చేశాడు. గుండు అంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటీ అని నిలదీశాడు. దానికి హరిత హరీష్ స్పందిస్తూ.. నేను మిమ్మల్ని ఎక్కడా రెడ్ ఫ్లవర్ అని అనలేదని మరోసారి దబాయించాడు. దాంతో ఇమ్మాన్యుయేల్ ఓ చిన్న నవ్వు .. అన్నా అందరూ చూశారని అన్నాడు. అయినప్పటికీ హరీశ్.. నేను మిమ్మల్ని అనలేదని అనగా, నేను కూడా గుండు అని మిమ్మల్ని అనలేదు.. నన్ను నేను అనుకున్నానని ఇమ్మాన్యుయేల్ కూడా తగ్గలేదు.
ప్రూఫ్ ఉందన్న ఇమ్మాన్యుయేల్
అయినప్పటికీ హరీశ్ రెచ్చిపోవడంతో మీరు నన్ను అన్నారు అనడానికి ప్రూఫ్ ఉందని రంకెలు వేశాడు ఇమ్మాన్యుయేల్. దాంతో తిక్కరేగిన హరీశ్.. బ్రదర్ మీరు లిమిట్స్‌లో ఉండాలి, లిమిట్స్ దాటొద్దని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నా ఇష్టం సార్ అంటూ ఇమ్మాన్యుయేల్ అనగా.. హరీశ్ పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఇమ్మూ మీదకి దూసుకెళ్లాడు. చివరిలో మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ ఇమ్యాన్యుయేల్ ఏదో సెటైర్ వేశాడు. వీరిద్దరి మధ్య ఆర్గ్యూమెంట్‌తో ఇంటి సభ్యులంతా చూస్తుండి పోయారు. మరి ఇమ్యాన్యుయేల్ - హరీశ్ మధ్య గొడవ ఎటు దారి తీసింది? చివరికి ఎవరిది తప్పని తేల్చారు? అనేది తెలియాలంటే బిగ్‌బాస్ ఫుల్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











