Shrasti Verma's Remuneration: బిగ్‌బాస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్.. వారం రోజుల్లో ఎంత సంపాదించిందంటే?
ఎన్నో అంచనాలు, ఆశలు మధ్య బిగ్‌బాస్ తెలుగు 9 తొలి వారం కంప్లీట్ చేసుకుంది. గుడ్డుతో మొదలెట్టి, రెడ్ ప్లవర్, ఆడాళ్లు, ఫ్రీ బర్డ్ వంటి కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందిస్తోంది. ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ బిగ్‌బాస్‌ను జనం ఆదరించారు. వీకెండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎలిమినేషన్ గురించే.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు సేవ్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 9లో 9 మంది సెలబ్రెటీలు, 6గురు కామనర్స్ కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. తనూజా పుట్టస్వామి, సంజన గల్రానీ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, శ్రష్టీ వర్మ సెలబ్రెటీ కేటగిరీలో హౌస్‌లో దిగారు. ఇక బిగ్‌బాస్ అగ్నిపరీక్షలు పలు అవరోధాలను, ఆటంకాలను దాటుకుని హరిత హరీష్, మర్యాద మనీష్, డిమోన్ పవన్, పడాల పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజలు కామనర్స్‌గా అవకాశం దక్కించుకున్నారు.

నామినేషన్స్‌లో 9 మంది
ఇకపోతే.. ఈ వారం సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. అయితే శుక్రవారం నాడు నిర్వహించిన టాస్క్‌లో గెలిచి బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ తొలి కెప్టెన్‌గా సంజనా గల్రానీ నిలవడంతో ఆమె నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయినట్లే. దీంతో మిగిలిన 8 మందిలో ఎవరు ఈ వారం హౌస్‌ను వీడుతారన్నది ఉత్కంఠగా మారింది.
సంజన, తనూజ సేఫ్
సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో సుమన్ శెట్టి, తనూజలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడగా.. ఆ తర్వాత జబర్దస్త్ ఇమ్యాన్యుయేట్, డిమోన్ పవన్, రాము రాథోడ్, రీతూ చౌదరి, ఆశా షైనీ, శ్రష్టి శర్మలు నిలిచారు. వీరిలో ఆశ, శ్రష్టీ వర్మలు ఓటింగ్‌లో డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. శనివారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్ చివరిలో నామినేషన్లలో ఉన్న వారిలో తనూజ ఒక్కరికే గ్రీన్ కలర్ రావడంతో ఆమె సేవ్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు.
బిగ్‌బాస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్
నామినేషన్‌లలో ఉన్న సంజన, తనూజలను తప్పిస్తే మిగిలిన ఏడుగురిలోనే ఒకరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కానున్నారు. అయితే సోషల్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. స్టార్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బిగ్‌బాస్ తెలుగు 9లో ఎలిమినేట్ కానున్న తొలి కంటెస్టెంట్‌గా నిలిచినట్లుగా తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా.. చివరికి ఆశా, శ్రష్టి వర్మలు మిగలగా.. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా శ్రష్టి వర్మ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించినట్లుగా నెటిజన్లు చెబుతున్నారు. ఎన్నో ఆశలు, అంచనాలతో బరిలోకి దిగిన శ్రష్టి వర్మ హౌస్‌ను వీడటం ఆమె అభిమానులను నిరుత్సాహానికి గురిచేసేది.
శ్రష్టి వర్మ రెమ్యునరేషన్ ఎంత?
ఇకపోతే.. స్టార్ కొరియోగ్రాఫర్‌గా, బిజీగా ఉన్న శ్రష్టి వర్మ వారం రోజుల పాటు తన సినిమాలు, షూటింగ్స్ అన్ని పక్కనపెట్టి హౌస్‌లోకి వచ్చారు. మరి ఈ వారం రోజులకు గాను ఆమె ఎంత సంపాదించారు. శ్రష్టి వర్మ రెమ్యునరేషన్ ఎంత అనేది పరిశీలిస్తే.. బిగ్‌బాస్‌లో ఆమెకు రోజుకు 28,571 వేల రూపాయలను పారితోషికంగా అందజేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ లెక్కన వారం రోజులకు గాను 2 లక్షల రూపాయలను శ్రష్టి వర్మ పారితోషికంగా అందుకున్నట్లుగా సోషల్ మీడియా టాక్. అదే నిజమైతే ఆమె సెలబ్రెటీ స్టేటస్, రేంజ్‌ను బట్టి ఇది తక్కువేనని చెప్పాలి.


Click it and Unblock the Notifications











