Who is Haritha Harish: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా హరిత హరీష్.. మాస్క్ వేసుకుంటే అంతు చూస్తాడట

బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా మరో సామాన్యుడికి అవకాశం దక్కింది. అతనే హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్. ప్రజల ఓటింగ్‌‌ ఆధారంగా బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో హరిత హరీష్ విజేతగా నిలిచాడు. అతనిని కింగ్ అక్కినేని నాగార్జున వేదిక మీదకు అతనిని ఆహ్వానించాడు. తనకు మాస్క్ వేసుకున్న మనుషులంటే అసహ్యమని అలాంటి వారు కనుక కనిపిస్తే ఖచ్చితంగా వారి మాస్క్ తీసేలా చేస్తానని నాగార్జునతో చెప్పాడు హరిత హరీష్.

హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అందరినీ పరిచయం చేసుకున్న అనంతరం శ్రేష్టి వర్మ, ఇమ్మాన్యుయేల్ ఇద్దరిలో హౌస్ క్లీనింగ్‌ డ్యూటీ ఎవరికి వేస్తావని హరిత హరీష్‌కు నాగార్జున టాస్క్ ఇచ్చారు. ఆ మాట వినగానే శ్రేష్టి తాను రెడీ అని చెప్పగా.. ఇమ్మాన్యుయేల్ మాత్రం వద్దు అన్నట్లుగా సైగలు చేశాడు. దీంతో ఇమ్మాన్యుయేల్‌కు హౌస్ క్లీనింగ్ బాధ్యతలు అప్పగించాడు. ఇక తనూజను పరిచయం చేసుకుంటూ.. తనకు తనూజా పేరుతో చాలా మెమొరీలు ఉన్నాయని, ఆ పేరంటే తనకు క్రష్ అని చెప్పాడు హరీష్.

Bigg Boss Telugu 9 Haritha Harish entered as bigg boss contestant

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ప్రారంభం కాగానే తన డేరింగ్ డాషింగ్ తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు హరిత హరీష్. విషయం ఏదైనా ముఖం మీద చెప్పేస్తూ విసుగు తెప్పించినా నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నాడు. చాలా రఫ్‌గా మాట్లాడుతున్నారంటూ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జిల చేత అనిపించుకున్నాడు. ఇక అరగుండు చేయించుకోవడానికి సిద్ధమా అని శ్రీముఖి డేర్ ఇవ్వగా.. క్షణం కూడా ఆలోచించకుండా ట్రిమ్మర్ తీసుకుని అరగుండు చేసేసుకుని షాకిచ్చాడు.

బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో అందరికీ టఫ్ ఫైట్ ఇచ్చిన హరిత హరీష్ మంచి మాటకారిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. హౌస్‌లోకి అడుగుపెడుతూ నాగార్జున వద్ద ఓవరాక్షన్ చేశాడు. నా భార్య లేకుండా నేను లేనని, ఆమె నాలో సగమని ఓవర్ చేశాడు. నాగ్ ఏం మాట్లాడకుండా నవ్వుతూ అతనిని లోపలికి పంపించాడు. మనోడి బేస్ వాయిస్‌తో లోపల ఉన్న సెలబ్రెటీలు ఇతర కంటెస్టెంట్స్ కూడా షాక్ అవుతున్నారు. మరి ముందు ముందు హరిత హరీష్ హౌస్‌‌లో ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X