Bigg Boss Telugu 9 List: బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ వీళ్లే? ఇంట్లోకి ఎవరెవరంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుస ప్రోమోలతో నిర్వాహకులు హైప్ తీసుకొస్తున్నారు. దీనికి తోడు సీజన్ 9 లాంచ్‌కి నెల ముందే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో కామన్‌మెన్‌ను సెలెక్ట్ చేసే కార్యక్రమంతో రెండు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ ఫీవర్‌ను తీసుకొచ్చారు. ప్రతిసారి బిగ్‌బాస్ సీజన్ ప్రారంభానికి ముందే ఆ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై రకరకాల వార్తలు వచ్చేవి. కానీ ఈసారి నిర్వాహకులు అత్యంత గోప్యంగా వాటిని ఉంచుతున్నారు.
బిగ్‌బాస్ సిలబస్ మార్చేశారా?
బిగ్‌బాస్‌లో కాన్సెప్ట్, నిర్ణయాలు, నిబంధనలు కూడా మొత్తం మార్చేసినట్లుగా నాగార్జున హింట్ ఇచ్చారు. ఈ సీజన్ ప్రోమో మొదలైన నాటి నుంచి ఆయన అదే పాట పాడుతున్నారు. బిగ్‌బాస్ తెలుగు 8కి అంతంత మాత్రంగా టీఆర్పీగా రావడంత పాటు జనాలకు తెలియని ముఖాలను కంటెస్టెంట్స్‌గా తీసుకురావడంతో ప్రజలకు ఎక్కలేదు. ఈసారి అలాంటి ఛాన్స్ లేకుండా బాగా పాపులర్ అయిన వారినే హౌస్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. సాధారణంగా గత సీజన్‌లలో పాల్గొన్న వారికి తదుపరి సీజన్‌లలో అవకాశం ఇచ్చే సాంప్రదాయం తక్కువ. గత సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాత కంటెస్టెంట్స్‌నే లోపలికి పంపారు. ఇది చాలా వరకు ప్లస్ అయ్యింది. ముక్కు అవినాష్, రోహిణి జోడీ బాగా ఎంటర్‌టైన్ చేయగా.. వైల్డ్ కార్డ్ ద్వారానే వచ్చిన గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు.

పాత కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ
ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని.. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా కాకుండా నేరుగా లాంచ్ రోజునే హౌస్‌లోకి పంపాలని నిర్ణయించారు. పాత కంటెస్టెంట్స్, రన్నరప్‌గా నిలిచినవారు, టాప్ కంటెస్టెంట్స్‌గా ఉన్న వారికి బిగ్‌బాస్ తెలుగు 9లో అవకాశం కల్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిలో సినీనటులు, బుల్లితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కంటెస్టెంట్స్‌గా ఛాన్స్ ఇచ్చినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరు కాకుండా ఈసారి సామాన్యులను కూడా హౌస్‌లోకి పంపేందుకు డోర్స్ ఓపెన్ చేశాడు బిగ్‌బాస్. ప్రస్తుతం వీరి ఎంపిక ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది.
బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ సామాజిక మాధ్యమాల్లో పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీరిలో నుంచి కొంతమంది ఎలిమినేట్ అయ్యాక నాలుగు నుంచి 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే.. నటుడు సుధాకర్, కొరియోగ్రాఫర్ శ్రేష్టీ వర్మ, నటుడు భరణి, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, బుల్లితెర నటి దేబ్‌జనీ మోదక్, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, కమెడియన్ బంచిక్ బబ్లూ, సీరియల్ నటుడు శివకుమార్, బుల్లితెర నటుడు అమర్‌దీప్ చౌదరి సతీమణి, నటి తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజుల పేర్లు చాలా వరకు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది.
కామనర్స్‌లో వీరికి చోటు?
ఇక కామనర్స్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో 15 మందిని సెలెక్ట్ చేశారు. వీరిలో ఎవరు హౌస్‌లో అడుగుపెడతారన్న దానిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిలో దమ్ము శ్రీజ, అనూష, మరొకరికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. చాలా వరకు వీరంతా ఫైనల్ అయ్యారని, చివరి నిమిషంలో రెండు, మూడు పేర్లు మారొచ్చని గాసిప్స్ వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్ ఉంటుందా? బిగ్‌బాస్ తన కంటెస్టెంట్స్ విషయంలో ట్విస్ట్ ఇస్తారా? అనేది సెప్టెంబర్ 7న తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











