బిగ్‌బాస్ బజ్‌కు హోస్ట్‌గా కాంట్రవర్సియల్ హీరో.. ఈసారి ఎగ్జిట్ ఇంటర్వ్యూలోనూ రణరంగమే!
బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమై అప్పుడే వారం కావొస్తోంది. మరికొద్దిగంటల్లో ఓ కంటెస్టెంట్ హౌస్‌ను వీడనున్నారు. ఈ వారం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. ఓటింగ్ టఫ్‌గా జరుగుతోంది. కంటెస్టెంట్స్ అందరు ఎక్కడా తగ్గకుండా ఆడుతుండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఈసారి బిగ్‌బాస్‌ని అన్ని రకాలుగా మార్చేశామని నాగార్జున ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్, చదరంగం కాదు.. రణరంగం అంటూ డైలాగ్స్ పేల్చుతున్నారు నాగార్జున.
ఉత్కంఠగా ఫస్ట్ వీక్
చెప్పినట్లుగానే కామనర్స్‌కి హౌస్‌లో స్థానం కల్పించిన బిగ్‌బాస్.. రెండు హౌస్‌లను ఏర్పాటు చేసి సెలబ్రెటీలు టెనెంట్స్‌గా, కామనర్స్ ఓనర్స్‌గా ఉంటారని తెలిపారు. మెయిన్ హౌస్‌లో కామనర్స్, ఔట్ హౌస్‌లో సెలబ్రెటీలు ఉంటారని చెప్పారు. అందుకు తగినట్లుగానే టాస్క్‌లను కూడా మార్చేసి మంచి మజాను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. తొలి వారమే హౌస్ మొత్తం హీటెక్కిపోయింది. నామినేషన్స్‌తో మొదలై కెప్టెన్సీ టాస్క్ వరకు మొత్తం గొడవలే చోటు చేసుకున్నాయి.

నామినేషన్స్‌లో 9 మంది
ఈ వారం సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 9 తొలి కెప్టెన్‌గా సంజనా గల్రానీ గెలవడంతో ఆమె నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయినట్లే. దీంతో మిగిలిన 8 మందిలో ఎవరు ఈ వారం హౌస్‌ను వీడతారన్నది ఉత్కంఠగా మారింది. బిగ్‌బాస్ సిలబస్‌ను పూర్తిగా మార్చేశామని నాగార్జున చెప్పిన నేపథ్యంలో ఎలిమినేషన్‌లోనూ ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలకు క్రేజ్
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ నుంచి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్‌బాస్ బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ పేరుతో వారి అభిప్రాయాలను, హౌస్‌లోని సంగతులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. బిగ్‌బాస్‌లో గతంలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్సే చాలా వరకు బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అరియానా గ్లోరీ, గీతూ రాయల్, అర్జున్ అంబటి తదితరులు బిగ్‌బాస్ బజ్‌కు హోస్ట్‌లుగా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. ఈ నేపథ్యలో ఈసారి బిగ్‌బాస్ హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. దీనికి స్టార్ మా చెక్ పెడుతూ బిగ్‌బాస్ బజ్ ప్రోమోను రిలీజ్ చేసింది.
బిగ్‌బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ తెలుసా?
సీనియర్ హీరో, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీ .. ఈ బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్‌బాస్ 7లో శివాజీ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ ఆటను చదివేసిన ఆయన.. తన ఎత్తులు, వ్యూహాలతో చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లకు అండగా నిలిచాడు. అప్పట్లో వీరిని స్పై బ్యాచ్‌గా బిగ్‌బాస్ ప్రేక్షకులు పిలుచుకునేవారు. బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలుస్తారని అనుకున్నప్పటికీ తృటిలో చేజారింది. అలాంటి శివాజీ.. బిగ్‌బాస్ తెలుగు 9లో బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ పేరుతో ఈసారి బిగ్‌బాస్ బజ్ ప్రసారం కానుంది.
బిగ్‌బాస్ హోస్ట్‌గా కాంట్రవర్సియల్ క్యారెక్టర్
నేచర్‌లో ఎక్కడో జరిగే మూవ్‌మెంట్.. ఇంకెక్కడో జరిగే మూవ్‌మెంట్‌ని డిసైడ్ చేస్తుంది. దీనినే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బిగ్‌బాస్‌లో హౌస్ మేట్స్ తీసుకునే నిర్ణయాలు, వాళ్లు చేసే పనుల వల్ల ఆడియన్స్‌లో వారి ఇమేజ్ మారుతుంటుంది. ఇదే బిగ్‌బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్. సామాన్యులకు, సెలబ్రెటీలకు మధ్య జరిగే పోరులో గెలుపు ఎవరిదో మీరు డిసైడ్ చేయండి.. వాళ్లు బయటికొచ్చాక ఏది రైట్? ఏది రాంగ్ అనేది మనం తేలుద్దామని శివాజీ చెప్పాడు. అలాగే ఈసారి కొత్తగా ఎలిమినేట్ అయిన వెంటనే బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎలిమినేషన్ ముగిసిన తర్వాత ప్రతి ఆదివారం రాత్రి 10.30 గంటలకు బిగ్‌బాస్ బజ్ కార్యక్రమం ప్రసారం కానుంది. అసలే కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచే శివాజీ.. ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











