బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 5 గురు విజేతలు వీరేనా? లీక్ చేసిన కంటెస్టెంట్

Photo Courtesy: Instagram/maryada.manish

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈసారి బీబీ హౌస్‌లోకి కామన్‌మెన్‌ను పంపుతామని నిర్వాహకులు ప్రకటించారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులను వడపోసి చివరికి 40 మందిని తుది జాబితా చేసి వారితో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరిలో నుంచి ఓ 15 మందిని ఫైనల్ కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసి రోజూ టాస్క్‌లు, గేమ్స్, డిస్కషన్స్ నిర్వహిస్తూ విజేతలను ఎంపిక చేసే బాధ్యతను నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లకు అప్పగించారు.

ఉత్కంఠగా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష
వీరు ముగ్గురితో పాటు ఆగస్ట్ 22 నుంచి కంటెస్టెంట్స్‌కు రకరకాల పరీక్షలు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. మరి వీరిలో నుంచి బిగ్‌బాస్‌లో ఎవరు అవకాశం దక్కించుకోనున్నారు? అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో కామన్‌మెన్‌గా ఛాన్స్ కోసం ప్రయత్నించిన మర్యాద మనీష్ .. కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ కామన్‌మెన్ ప్రోగ్రామ్ కోసం తాను ఎలా తయారైంది, బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఎలా జరుగుతోంది? బిగ్‌బాస్‌లో ఎవరు అడుగుపెట్టనున్నారు? అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 9 Manish Maryada Reveals Bigg Boss Agnipariksha winners

Photo Courtesy: Instagram/maryada.manish

3 రోజులే డెడ్‌లైన్
మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమం ముగియనుంది. ఆలోగా హౌస్‌లో అడుగుపెట్టే కామనర్స్‌ ఎవరన్నది తేల్చాల్సి ఉంది. 12వ ఎపిసోడ్ నుంచి అసలు సిసలు అగ్నిపరీక్ష ప్రారంభించాడు బిగ్‌బాస్. ఎల్లో కార్డ్, గ్రీన్ కార్డ్, రెడ్ కార్డ్ కాన్సెప్ట్‌తో ఆ 15 మందిలో నుంచి పలువురిని బయటకు పంపే కసరత్తు మొదలైంది. దీనికి తోడు ఆడియన్స్ ఓపీనియన్ ఆధారంగా కంటెస్టెంట్స్‌ని ఫైనల్‌గా ఎంపిక చేయనున్నారు. ఈ 15 మంది టఫ్ ఫైట్ చేస్తూ ఎక్కడా తగ్గకుండా ఆడుతుండటంతో తుది జాబితాను ఖరారు చేయడం కత్తిమీద సాములా మారింది.

మర్యాద మనీష్ షాకింగ్ కామెంట్స్
శ్రీజ దమ్ము ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారని, తర్వాత సోల్జర్ కళ్యాణ్ సెలెక్ట్ అవ్వొచ్చు. మూడో స్థానంలో నేను, శ్రీజకు ఫిల్టర్స్ లేవు, ఫిల్టర్స్ ఉంటే బిగ్‌‌బాస్ హౌస్‌లో చాలా కష్టం అవుతుంది. స్టేజ్ మీద షర్ట్ తీయాలంటే నాకే భయం, కానీ శ్రీజకు అలాంటివి లేవు.. స్టేజ్ మీద నిలబెట్టి తల మీద టాటూ వేస్తానన్నా రెడీ అంటుంది. బిగ్‌బాస్ లాంటి గేమ్స్ ఆడాలంటే కొన్నిసార్లు ఫిల్టర్స్ తీసేయాలి.. ఫస్ట్ టూ ఎపిసోడ్స్ తన చాలా డౌన్ అయినా నిలబడింది, శ్రీజ కొన్ని మార్చుకోవాలి. నాకు శ్రీజనే పెద్ద కాంపిటీటర్ అని చెప్పారు మనీష్. ఇక సోల్జర్ కళ్యాణ్ గురించి చెబుతూ.. తన మంచి నటుడు. నా దృష్టిలో ఫోర్త్ ప్లేస్‌ టైగా మారుతుంది. ప్రియా శెట్టి, దివ్య నిఖితలు నాలుగో స్థానం కోసం పోటీ పడొచ్చు లేదంటే 4, 5 స్థానాలలో వీరే ఉండొచ్చు.

Take a Poll

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష విన్నర్స్ ఎవరంటే?
వాళ్లిద్దరూ స్ట్రాంగ్ ఉమెన్.. వారు గేమ్‌ని అర్ధం చేసుకున్నారు. వీరు కాకుండా ఓ ఇద్దరికి కూడా బిగ్‌బాస్‌లో అవకాశం దక్కే అవకాశం ఉందని మనీష్ చెప్పారు. మాస్టర్ మైండ్ హరీష్ గారు.. ఈయన డేరింగ్ అండ్ డాషింగ్. ఫుల్ గుండు ఎవరైనా చేయించుకుంటారు, కానీ టాస్క్ ఇచ్చినప్పుడు మేమంత ఆలోచించే లోగా హరీష్ గారు వెంటనే అరగుండు చేయించుకుని షాకిచ్చారు, ఆయనలో ఓ మంచి మాటకారి కూడా ఉన్నాడు. నెక్ట్స్ డిమోన్ పవన్‌కి కూడా అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. ఆయన మంచి ఎంటర్‌టైనర్ అని మర్యాద మనీష్ చెప్పాడు. మొత్తంగా దమ్ము శ్రీజ, సోల్జర్ కళ్యాణ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, దివ్య నిఖితలు హౌస్‌లో అడుగుపెడతారని అతను అభిప్రాయపడ్డాడు.

దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మర్యాద మనీష్ చెప్పినవాళ్లే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడతారా? అనే చర్చ మొదలైంది. మరి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే కామన్‌మెన్ ఎవరనేది మూడు రోజుల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X