Bigg Boss 9 Telugu: మిడ్ వీక్ ఎలిమినేషన్ షాక్.. పాపం సంజన.. అందరూ పగబట్టారుగా..
Bigg Boss Telugu 9 Mid Week Eviction:బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన గేమ్ షో బిగ్ బాస్. ఈ గేమ్ షో ప్రతిసారి ఏదోక కొత్త కాన్పెప్ట్ తో ముందుకు వస్తుంది. అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి "చదరంగం కాదు, రణరంగం" కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రతి రోజు హౌస్‌లో కొత్త ట్విస్టులు, షాకింగ్ సర్‌ప్రైజ్‌లు, అంచనాలకు మించిన టాస్కులను కంటెస్టెంట్స్ కు ఇస్తూ.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఇటీవల విడుదలైన మిడ్ వీక్ ఎవిక్షన్ ప్రోమో బిగ్ బాస్ లవర్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ ఉండే.. ఆ ట్విస్ట్ కు పోతారన్నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎవరు ఊహించని విధంగా మిడ్ విక్ ఎలిమినేషన్ పెట్టి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఎలిమినేషన్ హైలైట్ ఈ సీజన్‌లో రెడ్ సీడ్ సిస్టమ్ ద్వారా కంటెస్టెంట్లకు ఇచ్చిన అధికారం ద్వారా జరిగింది.
మిడ్ వీక్ ఎలిమినేషన్
ఇప్పటి వరకు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు తన మైండ్ గేమ్ తో బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. హౌస్ లో కావాల్సిన కంటెంట్ ను ఇస్తున్నారు. తాజాగా ఇమ్మాన్యూయేల్ కెప్టెన్ గా కొనసాగిస్తున్నారు. ఈ వారంలో ఇమ్మాన్యూయేల్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, బిగ్ బాస్ రెండు ఎలిమినేషన్లు ఉంటాయనే హైప్ క్రియేట్ చేశారు. తాజాగా హౌస్‌లో రెడ్ సీడ్ పొందిన కంటెస్టెంట్లు ఒక వ్యక్తిని హౌస్ నుండి బయటకు పంపే అధికారం ఇచ్చినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇందులో భాగంగా మాస్క్ మ్యాన్ హరీశ్, రాము రాథోడ్, డిమోన్ పవన్, కళ్యాణ్ కలిసి చర్చించారు.

సంజనకు బిగ్ షాక్
ఈ కన్నింగ్ డిస్కషన్ లో సంజనను బలి చేశారు. అందరూ ఆమెపై పగ పట్టినట్టు వ్యవహరించారు. సంజనను బయటకు పంపించాలని భావిస్తున్నట్టు కంటెస్టెంట్స్ తెలిపారు. సంజన హౌస్‌లో తన ప్రత్యేక ముద్రను వేసింది. ప్రారంభంలోనే ఆమె గేమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇతర కంటెస్టెంట్ల మధ్య గొడవలను పెంచడం, హౌస్‌లో మూడ్‌ను ఇరిటేట్ చేయడం వంటి చేష్టాలు చేసింది. కంటెస్టెంట్ల మధ్య ఆమెకు నెగివిటీ ఉండొచ్చుగాని, ప్రేక్షకుల్లో మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎలిమినేషన్లలో ఉన్న ప్రతిసారి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఓటింగ్ వేసేవారు. ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆమెను టార్గెట్ చేయడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఎలిమినేషన్ ? సీక్రెట్ రూమ్ ?
లేటెస్ట్ ప్రోమో ప్రకారం.. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సంజన షాక్‌కి లోనట్లు తెలిసింది. ఈ సమయంలో సంజన మాట్లాడుతూ.. "అందరు కలిసి నన్ను టార్గెట్ చేశారు" అని ఎమోషనల్ అయింది. తరువాత, హౌస్ సభ్యులు సంజనను మెయిన్ గేట్ నుండి బయటకు పంపడం చూస్తూ, కంటెస్టెంట్లు కూడా భావోద్వేగానికి లోనవుతారు. ఇమ్మాన్యూయేల్ కంటతడి పెట్టగా, తనూజ కూడా ఫీల్ అవుతున్నట్లు ప్రోమోలో చూపించారు. అయితే, ప్రోమోలో ఇచ్చిన హింట్ ప్రకారం, సంజనను సీక్రెట్ రూమ్‌కి పంపినట్లుగా వినిపిస్తోంది. ఆమెను ఎలిమినేషన్ చేశారా? లేదా సీక్రెట్ రూమ్ కి పంపించారా? అనేది ఎపిసోడ్ ప్రసారం అయ్యేంత వరకు వేచి చూడాలి.
దిమ్మతిరిగే ట్విస్ట్
తాజాగా జరిగిన ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక్కసారిగా షో పై హైప్ ను క్రియేట్ చేసింది. ఈ ట్విస్ట్ తో ఉత్కంఠ పెరిగింది. డ్రామా, భావోద్వేగాలను మరింత పెంచింది. రెడ్ సీడ్ ద్వారా ఇచ్చిన అధికారం, కంటెస్టెంట్ల వ్యూహాలు, సంజన నుంచి బయటకు వెళ్లడం వంటి పరిణామాలు, బిగ్ బాస్ 9 సీజన్ 9ను ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మార్చాయి.


Click it and Unblock the Notifications











