Bigg Boss Telugu: లాత్కోర్ హరీష్.. నాగార్జున ఫైర్
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ మూడు వారాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, నాలుగో వారంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ సీజన్ లో ఎన్నాడు చూడని ఎత్తులు వాటికి పై ఎత్తులు వేస్తున్నాడు బిగ్ బాస్. చదరంగం కాదు.. రణరంగం అనే టైటిల్ తగ్గట్టుగా గేమ్ కొనసాగుతోంది. ఇక వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి కింగ్ నాగ్ అడుగుపెట్టారు. కంటెస్టెంట్ల తీరును పరిశీలిస్తూ.. తన స్టైల్ లో క్లాస్ పీకారు. మెయిన్ మాస్క్ మాన్ హరీష్ ను కార్నర్ చేశారు. ఇంతకీ కింగ్ నాగ్ ఏమన్నారు? ఎవరికి షాక్ ఇచ్చారు?
బిగ్ బాస్ సీజన్ 9 లో వీకెండ్ హంగామా షూరు అయింది. తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ అక్కినేని నాగార్జున వాయింపును స్టార్ట్ చేశారు. సీజన్ ప్రారంభం నుండి 'టెనెంట్స్ Vs ఓనర్స్' అనే కాన్సెప్ట్‌ను చూపిస్తారేమో అనుకున్నారు ప్రేక్షకులు, కానీ వాస్తవానికి ఆ వ్యత్యాసం కనిపించలేదంటూ కంటెస్టెంట్లకు క్లాస్ పీకారు. ఆ కామెంట్స్ పై డిమాన్ పవన్ స్పందిస్తూ "ఓనర్స్ అందరం కలిపి కలెక్టివ్ డిసిషన్ తీసుకున్నాం సార్"అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో కింగ్ నాగ్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ఆ కలెక్టివ్ డిసిషన్లే ప్రేక్షకులను నచ్చడం లేదని, తప్పని చెబుతున్నారని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు.

అనంతరం శ్రీజా రెస్పాండ్ అయ్యింది. "సంచాలక్‌గా ఏం చేశావు?" అని నాగ్ సార్ ప్రశ్నించగా..'కరెక్ట్‌గా చేశాను సార్'అని బదులిచ్చింది. ఆ సమాధానంతో ఆగ్రహానికి లోనైన కింగ్ నాగార్జున "కరెక్ట్‌గా చేశానని నువ్వు అనుకుంటే సరిపోద్దా?" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి శ్రీజా "బిగ్ బాస్ చెప్పినట్టే చేశాను సార్"అని వాదించే ప్రయత్నం చేసింది. దీంతో కింగ్ "నువ్వు చేసిన పని వల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యింది" అని నాగార్జున శ్రీజ గాలి తీశారు. తదుపరి బిగ్ బాస్ రాధిక రీతూ చౌదరిని టార్గెట్ చేశారు కింగ్. "నాకు లక్ లేదూ, లక్ లేదూ అంటూ తలబాదుకుంటున్నావ్, నీ ఆటను నువ్వే నాశనం చేసుకుంటున్నావ్" అంటూ క్లాస్ పీకారు.
ఆ తరువాత మాస్క్ మ్యాన్ హరీష్ చేసిన 'లత్కోర్ పంచాయితీ'పై నాగార్జున ఘాటుగా స్పందించారు. "లత్కోర్ హరీష్" అనడంతో ఒక్కసారిగా హరీష్ షాక్ అయ్యాడు. లత్కోర్ అనే పదం ఇబ్బందికరంగా అనిపించిందని, హౌస్‌లో ప్రతి ఒక్కరూ నిన్ను లత్కోర్ హరీష్ అని పిలిస్తే ఓకేనా అని అడిగారు. హరీష్ రియాక్ట్ అవుతూ.. "నేను ఎవర్నీ ఉద్దేశించి అనలేదు" అని చెప్పాడు. వెంటనే బ్యూటీ ప్రియ రియాక్ట్ అవుతూ.. ఆ పదాన్ని వాడటం రాంగ్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
హరీష్ "సార్.. నేను ఎవర్ని లత్కోర్ అనలేదు, అలాంటి పనులు చేయను" అని సమాధానమిచ్చాడు. కానీ, నాగార్జున అతని సమాధానాన్ని సరిపడని విధంగా భావించి, "హరీష్, నేను నీలాంటి లత్కోర్ మాటలు మాట్లాడను అని అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు అనొద్దు.. మీరు అనాలని అడుగుతున్నప్పుడు, లత్కోర్ పని కరెక్ట్ కాదు" అంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు కింగ్ నాగార్జున. ఈ ప్రోమో బట్టి చూస్తే.. హౌస్‌లో హరీష్ మాత్రమే టార్గెట్ కాలేదని అర్థం అవుతుంది. హౌస్‌లో పవన్, రీతూ, డీమాన్‌లు కూడా లత్కోర్ పనులు చేస్తున్నప్పటికీ, ప్రతి సీజన్‌లో ఒక ప్రత్యేక టార్గెటెడ్ కంటెస్టెంట్ ఉండే విధంగా, ఈ సీజన్‌లో హరీష్ ప్రత్యేకంగా టార్గెట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











