Bigg Boss: మారిపోయిన బిగ్‌బాస్ వాయిస్.. క్రాస్ బ్రీడ్ గొంతంటూ దారుణంగా ట్రోలింగ్
ఇండియాలో బిగ్‌బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మెగా రియాలిటీ షో గురించి తలచుకోగానే.. గ్రాండ్ సెట్టింగ్స్, మైండ్ గేమ్, డిస్కషన్స్, టాస్కులు, గేమ్‌లు, వివాదాలు, నానా రచ్చ గుర్తొస్తాయి. అయితే బిగ్‌బాస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బేస్ వాయిస్సే. తెలుగులో బిగ్‌బాస్ వాయిస్‌కు బాగా పాపులారిటీ ఉంది. దీనిపై ఎన్నో స్పూఫ్స్, మీమ్స్, వీడియోలు వచ్చాయి. ఏదీ ఏమైనా జనాన్ని ఈ షో విషయంలో బాగా ఆకట్టుకునే అంశాల్లో బిగ్‌బాస్ వాయిస్ ఖచ్చితంగా ముందుంటుంది.
బిగ్‌బాస్ వాయిస్‌కి జనంలో క్రేజ్
తెలుగులో 8 సీజన్లు విజయవంతంగా నడవటం వెనుక ఈ వాయిస్ కూడా కీలకపాత్ర పోషించింది. హోస్ట్ లేనప్పుడు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు టాస్క్‌లు ఇవ్వడం, ఆదేశాలు జారీ చేయడం, బిగ్‌బాస్ నియమ నిబంధనలు తెలియజేయడం వంటి వాటిని ఈ వాయిస్‌తో ఇప్పిస్తారు. అయితే ఆ వాయిస్ ఎవరిది అన్నదానిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ .. బిగ్‌బాస్‌కు వాయిస్ అందిస్తున్నట్లుగా కొన్ని వెబ్‌సైట్స్, వార్తాసంస్థలు తేల్చాయి. ఎన్నో సినిమాలు, సీరియల్స్, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతును సెలక్ట్ చేయడానికి 100 మందితో పోటీ పెట్టారట నిర్వాహకులు. చివరికి బిగ్‌బాస్ షోకి రాధాకృష్ణ గొంతు సరిగ్గా సరిపోవడంతో దానిని ఎంపిక చేయడం ఇన్నేళ్లుగా కంటిన్యూ చేయడం జరుగుతోంది.

బిగ్‌బాస్ కంటే ముందు అగ్నిపరీక్ష
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ త్వరలో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే కింగ్ అక్కినేని నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బిగ్‌బాస్ తెలుగు 9కి సంబంధించి వరుస ప్రోమోలతో నాగార్జున దుమ్మురేపుతున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఈసారి సామాన్యులకు కూడా హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. దీనికి విపరీతంగా రెస్పాన్స్ రాగా.. సామాన్యులను సెలక్ట్ చేసే ప్రోగ్రామ్‌ను బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో డిజైన్ చేశారు. బిగ్‌బాస్ రేంజ్‌లోనే టాస్క్‌లు, గేమ్‌లతో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి బిగ్‌బాస్ మాజీ విన్నర్స్ అభిజిత్, బిందు మాధవిలతో పాటు సినీనటుడు నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
జడ్జిగా అభిజిత్
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. అభిజిత్ మాట్లాడుతూ.. గతంలో ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారని చెబుతాడు. ఆగస్ట్ 22 నుంచి నా జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో సహా అందరికీ చూపిస్తానని అంటాడు అభిజిత్. ఆ వెంటనే బిగ్‌బాస్ వాయిస్ వస్తుంది. అయితే గతంలో మాదిరిగా బేస్ వాయిస్‌లా కాకుండా, డల్‌గా వినిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఈ వాయిస్‌పై దారుణంగా ట్రోలింగ్‌కు దిగారు.
బిగ్‌బాస్ వాయిస్‌పై దారుణంగా ట్రోలింగ్
బాత్రూమ్‌కి వెళ్లి వచ్చాక మాట్లాడాల్సిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కాకి, కుక్కకి క్రాస్ బ్రీడ్ వాయిస్ లాగా ఉంది, వీడు బిగ్‌బాస్ ఏందిరా అని మరో యూజర్ పోస్ట్ చేశాడు. బిగ్‌బాస్‌కి ఆ ఓల్డ్ వాయిసే బాగుందని మరికొందరు పోస్టులు పెట్టారు. ఈ ట్రోటింగ్ దెబ్బకు బిగ్‌బాస్ నిర్వాహకులు దిగొచ్చారు. ఈ వాయిస్‌ను కేవలం ప్రమోషనల్ కార్యక్రమాల కోసమే వినియోగించామని.. బిగ్‌బాస్ షోలో పాత వాయిసే వినిపిస్తుందని క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











