Padala Pawan Kalyan: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష విజేతగా సోల్జర్ కళ్యాణ్.. ఫస్ట్ కామనర్‌గా హిస్టరీ
బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా తొలిసారి సామాన్యుడికి అవకాశం దక్కింది. అతనే పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్. ప్రజల ఓటింగ్ ఆధారంగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కళ్యాణ్ విజేతగా నిలిచాడు. అతనిని కింగ్ అక్కినేని నాగార్జున వేదిక మీదకు అతనిని ఆహ్వానించాడు. హౌస్‌లోకి ఎంటర్ అయిన వెంటనే ఫ్లోరా షైనీ, తనూజాలను పరిచయం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అతనికి ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున.

పవన్ కళ్యాణ్, ఫ్లోరా షైనీలను తీసుకుని హౌస్‌లోని బాత్‌రూంలను చూపించమని తనూజకు చెప్పారు కింగ్ నాగార్జున. ఆ వెంటనే వారిద్దరిలో బాత్‌రూంను క్లీన్ చేసే బాధ్యతను ఎవరికీ అప్పగిస్తావని పవన్ కళ్యాణ్‌ను నాగార్జన అడిగారు. ఆ మాట వినగానే నాకు మాత్రం ఆ డ్యూటీ వేయొద్దని ఆశా షైనీ ప్రాధేయపడింది. కానీ కళ్యాణ్ మాత్రం మరో మాట లేకుండా ఆశా షైనీకే బాత్‌రూంను క్లీన్ చేసే బాధ్యత అప్పగించాడు. దాంతో కోప్పడ్డ ఆశా షైనీ.. నాకు కూడా టైం వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
జవాన్‌గా ఉంటూ బిగ్‌బాస్‌లోకి
బిగ్‌బాస్ తెలుగు 9 అగ్నిపరీక్షలో టఫ్ ఫైట్‌తో అందరినీ ఆకట్టుకున్నారు సోల్జర్ కళ్యాణ్. ఇతని వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. అతని పూర్తి పేరు పవన్ కళ్యాణ్ పడాల. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఇతను భారత సైన్యంలో సైనికుడిగా సేవలందిస్తున్నాడు. మూడేళ్లుగా సోల్జర్‌గా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కామనర్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న ఇతను టఫ్ పోరులో గెలిచాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ సత్తా చాటి టాప్ 15లో ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఆర్మీ ఉద్యోగానని వదిలేస్తారా?
ప్రస్తుతం ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తుండటంతో పడాల కళ్యాణ్‌కి బిగ్‌బాస్‌లో అవకాశం వస్తే ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల ఆన్సర్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే జాబ్‌ని క్విట్ చేయాల్సిన అవసరం లేదని అతను క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ జరిగేది 3 నెలలే కాబట్టి.. పెయిడ్ లీవ్ పెట్టుకుని బిగ్‌బాస్‌కి అటెండ్ అవుతానని కళ్యాణ్ చెప్పాడు. ఒకవేళ సినిమాలలో అవకాశం వచ్చి బాగా బిజీ అయితే ఖచ్చితంగా ఆర్మీ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తానని కళ్యాణ్ తేల్చేశారు.


Click it and Unblock the Notifications











