Bigg Boss Telugu: అందుకే బిగ్ బాస్ కు వద్దన్నాం.. చెప్పినా వినలేదంటున్న ప్రియాశెట్టి పేరెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా కొనసాగుతోంది. ఎవరూ ఊహించిన ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, గొడవలు, అలకలు, లవ్ ట్రాక్స్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి సీజన్‌ను ప్రత్యేక కాన్సెప్ట్‌తో డిజైన్ చేసినట్టే.. ఈ సీజన్ ను సెలబ్రెటీలు వర్సెస్ కామనర్స్ థీమ్ తో షోను డిజైన్ చేశారు. ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ ఈ గేమ్ షోను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశారు. ఇలా కామనర్ కేటగిరీలో హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాశెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె గొంతుపై నెటిజన్లు విపరీతంగా విమర్శలు గుప్పించడం, ట్రోల్స్‌పై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇటీవల ఒక ఛానల్‌ ఇంటర్యూలో ప్రియాశెట్టి తల్లిదండ్రులు మాట్లాడారు. "మేము బిగ్ బాస్ షోలోకి వెళ్లొద్దని చెప్పినా ప్రియా వినలేదు. బాగా ఆడతానంటూ హౌస్‌లోకి వెళ్లింది. 'అగ్నిపరీక్ష' ప్రోగ్రామ్‌లో ప్రేక్షకులు ఆమెకు బాగా సపోర్ట్ చేశారు. అప్పట్లోనే చాలామంది ఆమె గొంతు చాలా మధురంగా ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకో అదే గొంతుపై ఇలా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది చాలా చాలా బాధాకరం. దేవుడు ఇచ్చిన గొంతు, పుట్టుకతోనే అది అంతే. దానిపై ఎవరూ మార్చలేరు కాదా.. ఆటను చూసి తీర్పు చెప్పండి గానీ, గొంతు గురించి అనడం కరెక్ట్ కాదు" అని అన్నారు.

Bigg Boss Telugu 9 Priya Shetty Faces Trolls Parents Defend Her with Emotional Reply

అలాగే బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం వల్ల ప్రియాశెట్టి పెళ్లికి ఇబ్బందులు వస్తాయంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా వారు స్పందించారు. "మాకు అలాంటి భయం లేదు. మా అమ్మాయిని అర్థం చేసుకునే వ్యక్తితోనే పెళ్లి చేస్తాం. బిగ్ బాస్ షోలో ప్రియా బాగానే ఆడుతోంది. అందరితో కలిసిమెలిసి కనిపిస్తోంది. దయచేసి ఆమె గొంతుపై విమర్శలు చేయకుండా ఆటను మాత్రమే గమనించండి" అని ఆమె తల్లిదండ్రులు కోరుకున్నారు. హౌస్‌లో ప్రియాశెట్టి కాస్త చలాకీగా, ఉత్సాహంగా ఉండే కంటెస్టెంట్లలో ఒకరు. అన్ని విషయాల్లో తలదూరుస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అయితే ఇదే సమయంలో ప్రేక్షకులలో కొంతమంది విమర్శలు చేస్తుండటంతో ఆమెపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండే.. మూడో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నిలిచారు. అయితే హీరోయిన్ ఫ్లోరా సైని ఇమ్యూనిటీ సాధించడంతో ఎలిమినేషన్ జాబితాలో నుంచి తప్పుకుంది. ఫైనల్‌గా రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల ఐదుగురు కంటెస్టెంట్లు మిగిలారు. అయితే.. వీరిలో వీరిలో ప్రియా శెట్టి అతి తక్కువ ఓట్లు పొందినట్టు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరగగా, కల్యాణ్ సేఫ్ అయ్యాడు. ఫలితంగా మూడో వారం బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ప్రియా ఎలిమినేట్ అయిందని బిగ్ బాస్ ప్రకటించబోతున్నారు.

ప్రియా శెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్. తల్లిదండ్రుల కోరిక మేరకు వైద్య విద్యను చదివి, తర్వాత రియాలిటీ షోల్లో అవకాశాలు వెతుక్కుంది. 'అగ్నిపరీక్ష' ప్రోగ్రామ్‌లో తన ప్రతిభ చూపి బిగ్ బాస్‌లోకి ఎంపికైంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి కామనర్‌గా అడుగుపెట్టిన ప్రియా, మొదటి నుంచే ఓవరాక్షన్ చేస్తూ ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపడం, రియాక్ట్ అవడం వల్ల ఆమెపై నెటిజన్ల ట్రోల్స్ పెరిగిపోయాయి. గత వారం హోస్ట్ నాగార్జున ఇచ్చిన సూచనలతో కొంత మార్పు వచ్చిన , ఆమె గేమ్‌పై పడిన నెగెటివ్ ప్రభావం తొలగలేదు. ఓవరాక్షన్, డ్రామాటిక్ రియాక్షన్స్ ఆమె కొంపముంచాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss priya nagarjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X