బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్.. సెలబ్రెటీలు ఎంత మంది? కామనర్స్ ఎంత మంది ఉన్నారంటే?
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 9వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చివరి సీజన్ 8లో బిగ్ బాస్ టైటిల్ ను నిఖిల్ మాలియక్కల్ దక్కించుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆ టైటిల్ ను సాధించేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ ఎంపికను ఫైన్ చేశారు. త్వరలో అధికారికంగా పూర్తి లిస్ట్ రానుంది.
ఇక టెలివిజన్ రంగంలోని ప్రముఖులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ జాబితా పూర్తైంది. వారి వివరాలు కూడా ఇలా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్ల కంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఆ విధంగా 9వ సీజన్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జారుతుందని తెలుపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫైనల్ లిస్ట్ లో ఉన్నవారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా హౌజ్ లోకి వచ్చే వారి పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈసారి 2 హౌజ్ లు ఉంటాయని ఇప్పటికే హోస్ట్ అక్కినేని నాగార్జున తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో ఒక హౌజ్ లో సెలబ్రెటీలను, మరొక హౌజ్ లో కామనర్స్ ను ఉంచబోతున్నారు. వీరిద్ధరి మధ్య సాగే పోరు ఉత్కంఠభరితంగా ఉంటుందని ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. ఇంతకీ సెలబ్రెటీ కంటెస్టెంట్స్ ఎవరు? కామనర్స్ లో ఎంత మంది హౌజ్ లోకి వెళ్తున్నారు? వారెవరనే జాబితా అందింది.
సెలబ్రెటీల లిస్ట్ లో.. భరణి కుమార్, ఆశా సైనీ, సంజన గల్రానీ, తనూజ గౌడ పుట్టంశెట్టి, రాము రాథోడ్, షష్టి వర్మ, హర్షిత్ రెడ్డి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, అలేక్య చిట్టి ఊరగాయ ఉన్నారని తెలుస్తోంది. వీరంతా టీవీ సిరీస్ లు, సినిమాలు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లుగా తమ సొంతంగా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇక కామనర్స్ లిస్ట్‌లో శ్రీజ, పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, పవన్ రాక్షసుడు, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్, మనీష్ ఉన్నారని తెలుస్తోంది. ఇంకా తుది జాబితా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతానికి వీరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కామనర్స్ ఎంపికను బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు టోటల్ గా 14 వేల అప్లికేషన్లు అందాయిని, అందులో నుంచి 7 గురుని హౌజ్ లోకి తీసుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ అగ్నిపరీక్ష కార్యక్రమానికి జడ్జీలుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హీరో నవదీప్, అభిజీత్, నటి బిందు మాధవిలు వ్యవహరించారు. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించింది. ఇక సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











