బిగ్ బాస్ 9 రాము రాథోడ్ రెమ్యునరేషన్.. ఒక్క పాటకు ఎన్ని లక్షలో తెలుసా?
తెలుగు ఫోక్ సాంగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా తన క్రేజ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ రాము రాథోడ్. జానపద పాటలను ఈ తరం ఆడియెన్స్ కు నచ్చేలా ఆధునీకరించి పాటలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో రాము రాథోడ్ తనదైన ముద్రను వేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా ఆయన రచించి పాడటమే కాకుండా ఆడిన రానూ ముంబైకి రాను సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రీసెంట్ దుబాయ్ లో నిర్వహించిన గామా అవార్డ్స్ ఈవెంట్ లోనూ ఆయన పాట మోగింది. విదేశాల్లోనూ వినిపిస్తూ ఉంది.
ఫోక్ సింగర్ గా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాము రాథోడ్ తన కెరీర్ లో మరో ముందడుగు వేశారు. పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ గా ఎంపికవ్వడం విశేషం. సెలబ్రెటీ కంటెస్టెంట్ గా రాము రాథోడ్ బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టారు. ప్రస్తుతం హౌజ్ లో తనదైన శైలిలో బిగ్ బాస్ ఆడించే టాస్క్ ల్లో పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. ఇక రాము రాథోడ్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సెలబ్రెటీ స్థాయిని చేరుకున్నారు.

అయితే ఫోక్స్ సాంగ్స్ నే కెరీర్ గా ఎంచుకున్న ఆయన ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ విషయంపై రాము రాథోడ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్పందించారు. రాను ముంబైకి రానూ సాంగ్ బ్లాక్ బాస్టర్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆ సాంగ్ క్రియేట్ చేయడానికి దగ్గర దగ్గర రూ.5 లక్షలు పెట్టుబడి అయ్యిందని చెప్పారు. రెండు రోజులు షూటింగ్ చేసినందుకు రూ.3.5 లక్షలు, సాంగ్ రాసి, పాడించినందుకు మరో 1.5 లక్షల రూపాయలు ఖర్చైందని చెప్పారు.
ఇక సాంగ్ యూట్యూబ్ లో హిట్ అవ్వడంతో రూ.20 లక్షల వరకు రెవెన్యూ వచ్చిందని రాము రాథోడ్ చెప్పారు. మరోవైపు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా తన పాట 516 మిలియన్ల వరకు చేరుకుందని చెప్పారు. ఆ లెక్కన యూట్యూబ్ నుంచి కోట్లల్లో వచ్చి ఉంటుందని అంటున్నారు. మరోవైపు రాము రాథోడ్ మాత్రం సాంగ్ కు రూ.50 వేల వరకు ఛార్జ్ చేస్తారని, కొన్నాళ్లు తానే స్వయంగా పాటలను విడుదల చేస్తుండటంతో ఇక ఒక్కో పాటకు లక్షల్లోనే సంపాదిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిపై స్పష్టత లేదు.
రాము రాథోడ్ ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా ఎన్ని వారాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాము రాథోడ్ మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం గోపాలపూర్ ఖుర్ద్ గ్రామంలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే జానపద గాయకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. భూత్పూర్, మహాబూబ్ నగర్ జిల్లాలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











