ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు.. దివ్వెల మాధురికి పికిల్ పాప రమ్య ఫిర్యాదు
బిగ్‌బాస్ తెలుగు 9లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగిపోయాయి. 5వ వారం ఎండింగ్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చారు. వారు దివ్వెల మాధురి, రమ్య మోక్ష కంచర్ల, ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తాలు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా వచ్చారు. వీరు రావడంతో బిగ్‌బాస్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? పాత కంటెస్టెంట్స్‌ను వీరు ఎలా ఎదుర్కొంటున్నారు? అనేదానిపై ప్రేక్షకుల ఉత్కంఠ నెలకొంది.
నామినేషన్స్ నుంచి వాళ్లకి మినహాయింపు
కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్‌లో ఫైర్ బ్రాండ్స్ చాలా మందే ఉన్నారు. రమ్య మోక్ష, దివ్వెల మాధురి, ఆయేషాల ధాటికి తట్టుకుని నిలబడటం అంత తేలికకాదు. అందుకు తగినట్లుగానే హౌస్‌లో వాతావరణం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు పరిచయ కార్యక్రమాలే తప్పించి పూర్తి స్థాయిలో ఆటను వీల్లు మొదలు పెట్టలేదు. అయితే వచ్చి ఒక్కరోజు కూడా కాకపోవడంతో తొలివారం వీరికి నామినేషన్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ నామినేట్ చేసే అధికారం వీరికే కట్టబెట్టారు బిగ్‌బాస్.

కళ్యాణ్‌తో మాధురి గొడవ
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో దివ్వెల మాధురి, రమ్యలు మాత్రం హడావుడి మొదలు పెట్టేశారు. అసలు బిగ్‌బాస్‌లో గొడవలు మొదలయ్యేదే కిచెన్‌లో... దానికి తగినట్లుగానే కళ్యాణ్‌ను అక్కడ టార్గెట్ చేశారు మాధురి, రమ్య. సోమవారం నాటి ఎపిసోడ్‌లో బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం కావడంతో.. ఫుడ్ సెక్షన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దివ్య నిఖిత.. వెంటనే కెప్టెన్ కళ్యాణ్‌కు చెప్పింది. ఫుడ్ వండే బాధ్యతను మాధురి తీసుకోవడంతో ఆమెను పిలిచి మాట్లాడాలని అంతా అనుకున్నారు. మాధురిని కూర్చోమని కళ్యాణ్ చెప్పగా... నేను వెళ్లాలి, వెళ్లాలి? అని మాధురి గొడవకు బీజాలు వేసింది.
మాధురికి కళ్యాణ్ సారీ
కూర్చోమని మాధురిని పలుమార్లు అడగటంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. నువ్వు కెప్టెన్ అయితే నువ్వు చెప్పినట్లు వినాలా? అని మండిపడింది. మధ్యలో జోక్యం చేసుకున్న దివ్యకి కూడా క్లాస్ పీకింది మాధురి. ఆ తర్వాత గొడవ ఎలాగోలా సద్దుమణగగా.. కళ్యాణ్ వచ్చి మాధురికి సారీ చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికి రమ్య, నిఖిల్‌లు ముచ్చట్లు పెట్టుకోగా... మాధురి, ఆయేషా జీనత్‌లు అక్కడికి వచ్చారు. పాత కంటెస్టెంట్స్ మనతో మాట్లాడటం లేదని.. మనల్ని దూరం పెట్టారని, మనమంతా యూనిటీగా ఉండాలని రమ్య చెప్పింది.
అమ్మాయిల పిచ్చి
కళ్యాణ్ అబ్బాయిల పిచ్చోడని, శ్రీజ ఎలిమినేషన్ సమయంలో తన బెలూన్ కట్ చేశానని నా వైపు వేరేలా ఉంది. కళ్యాణ్ నాతో మాట్లాడటం లేదు, ఎదురుపడితే ముఖం తిప్పుకుంటున్నాడు. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదని చెప్పింది రమ్య. ఇక్కడ మనం గేమ్ ఆడటానికి వచ్చాం, ఎవరితో మాట్లాడటానికి కాదని మాధురి తెలిపింది. అతనికి అమ్మాయిల పిచ్చి ఫస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. అతని ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయాడని మాధురి చెప్పింది.
కిందేసి తొక్కుతా
చాలా ఇరిటేటింగ్‌గా ఉంది.. ఫస్ట్ రోజు వచ్చి కూర్చొంటుంటే ఆ అమ్మాయిని చేతులు ఇలా ఇలా వేసి.. అమ్మాయినే నాకే ఏదోలా ఉంది. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా అంతే, కిందేసి తొక్కేస్తా. అంతే అలాగే ఉండాలి.. ఆ అమ్మాయి తనూజ ఎందుకంత చనువు ఇస్తుంది. డైరెక్ట్‌గా చూపియడం లేదు, ఇన్‌డైరెక్ట్‌గా ఇస్తున్నట్లు అనిపించింది నాకు. తిట్టేయొచ్చు, మనం ఒక్క మాటతో ఇప్పించేయొచ్చు ఆ బిహేవియర్‌ని, హే హే అని అంటుంది తప్పించి కంట్రోల్ చేయడం లేదు. ఒకళ్లు అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా? అందుకే ఆ బిహేవియర్ వచ్చేదని రమ్య మోక్ష కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మాధురి- రమ్యల సంభాషణల తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











