Who is Sanjana Galrani? సంజన గల్రానీ గురించి తెలుసా? వివాదాలకు కేరాఫ్.. లిమ్కా రికార్డ్స్‌తో సంచలనం..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 అట్టహాసంగా ప్రారంభమైంది. 9వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు అడుగు పెట్టబోతున్నారా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెడుతున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ సంజన గల్రానీ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంజన ఎవరు? ఎలా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు? ఆమె బయోగ్రఫి ఒకసారి పరిశీలిస్తే..

10 అక్టోబర్ 1989న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. ఈమె చెల్లెలు నిక్కీ గల్రానీ కూడా నటి కావడం విశేషం. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన సంజన.. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంతో కలిసి చేసిన ఫాస్ట్ ట్రాక్ కమర్షియల్ యాడ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమాయకమైన ముఖం, చెరగని చిరునవ్వుతో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డారు సంజన. నటిగా తొలి ఛాన్స్ ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమే ఇచ్చింది.

Bigg Boss Telugu 9 Sanjana Galrani Movies list Profile personal Details

2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు సంజన గల్రానీ. ఆ తర్వాత తమిళ్‌లో ఒరు కధల్ సేవిర్‌లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీకి బ్రేక్ దక్కింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహో యమ, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో నటించారు. కానీ ఇవేవీ ఆమెకు స్టార్ తీసుకురాలేకపోగా.. సెకండ్ హీరోయిన్‌గా మిగిలిపోయారు . తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు గడుస్తోంది.

శాండిల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజన పేరు తైరపైకి రావడంతో పాటు ఆమె అరెస్ట్ కావడం పరిశ్రమను కుదిపేసింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో అజీజ్ పాషా అనే ఓ డాక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది సంజన. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమ్ సంపాదించుకున్నారు ఈ ముద్దుగుమ్మ. గతంలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు సంజన. తనను కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో తీవ్రంగా వేధించాడని ఆరోపించింది.

గతంలో మాదిరిగా సంజనకు అంతగా అవకాశాలు దక్కడం లేదు. వయసు పెరిగిపోవడంతో పాటు కొత్త అమ్మాయిలు దూసుకొస్తూ ఉండటంతో సంజనను పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుతం పొద ముండం అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా ఆమె యాక్టీవ్‌గా ఉంటారు. గతంలో బిగ్‌‌బాస్ కన్నడ, మలయాళంలో స్మార్ట్ షో, తెలుగు, కన్నడలలో సిక్స్త్ సెన్స్, హిందీలో ముఝే షాదీ కరోగి అనే షోలో పాల్గొన్నారు సంజన. ఇదేకాదు.. 2015లో ఏకధాటిగా 104 గంటల పాటు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో సంజన స్థానం సంపాదించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు ఈ కన్నడ కస్తూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X