Bigg Boss Telugu 9 Nominations: బిగ్‌బాస్ 9 తెలుగు 2వ వారం నామినేషన్స్.. ఎవరెవరు నామినేట్ అంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో తొలి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండో వారం ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారు? సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఎంత మంది ఉన్నారు? అనే దానిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 9లో 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. తనూజా పుట్టస్వామి, సంజన గల్రానీ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, శ్రష్టీ వర్మ సెలబ్రెటీ కేటగిరీలో హౌస్‌లో దిగారు. ఇక బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో పలు టాస్క్‌లు, వడపోతలు దాటుకుని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా హరిత హరీష్, మర్యాద మనీష్, డిమోన్ పవన్, పడాల పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజలు కామనర్స్‌గా బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకున్నారు.

ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ ఎలిమినేట్
తొలివారం నామినేషన్స్‌లో తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఆశా షైనీ, రీతూ చౌదరి, శ్రష్టి వర్మ, సుమన్ శెట్టి, డిమన్ పవన్ , రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్‌లు నిలిచారు. వీరిలో సంజన కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుంచి ఆటోమేటిగ్గా సేవ్ అయ్యారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో తనూజను నాగార్జున సేవ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆదివారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఈ ఏడుగురిలో నుంచి నాగ్ ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి శ్రష్టి వర్మ, డిమన్ పవన్‌లు నిలవడంతో వారిని యాక్టివిటీ ఏరియాకు పిలిచారు నాగ్. ఆ వెంటనే కొందరు డ్యాన్సర్లు వచ్చి డ్యాన్స్ వేసి శ్రష్టి వర్మను బయటకు తీసుకొచ్చేశారు. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్లుగా ప్రేక్షకులకు అర్ధమైంది.
అందరి టార్గెట్ హరిత హరీష్
శ్రష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో బిగ్‌బాస్ హౌస్‌లో 14 మంది మిగిలారు. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో నిలిచారు? ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు? అనే దానిపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని బట్టి హరిత హరీష్‌ను ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. గత వారం హరీష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనూజతో మొదలుపెట్టి హౌస్‌లో అందరినీ కెలికాడు. రెడ్ ఫ్లవర్, ఆడింగోళ్లు అన్న మాటలతో ఇమ్మాన్యుయేల్, భరణిలపై హరీష్ నోరు పారేసుకున్నాడు. సెకండ్ వీక్ వీరంతా హరీష్‌ను ఓ ఆట ఆడుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
రివెంజ్ తీర్చుకున్న సెలబ్రెటీస్
అలాగే గత వారం తమను నామినేట్ చేసిన కామనర్స్‌ను ఈ వారం సెలబ్రెటీలు నామినేట్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. దీంతో నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. మొత్తం మీద రెండో వారంలో మర్యాద మనీష్, హరిత హరీష్, సంజన గల్రానీ, డీమాన్ పవన్, ప్రియా శెట్టి, సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా షైనీ నామినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ఆసక్తి పెరిగింది.


Click it and Unblock the Notifications











