Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 కంటెస్టెంట్ అవుట్!
Bigg Boss 9 Elimination: బిగ్ బాస్ సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సీజన్‌లో ప్రతీ వారం అనూహ్య ట్విస్టులు, ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఫీల్ అయ్యే కంటెస్టెంట్లు కూడా ఎలిమినేట్ అవడం విశేషం. అలా గత వారం శ్రీజ దమ్ము షాకింగ్ ఎలిమినేషన్ కాగా.. ఇలాంటి సీనే.. ఈ వారం ఎలిమినేషన్ లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వారం మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా టాప్ 5 ఉంటారని భావించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇంతకీ టాప్ కంటెస్టెంట్ ఎవరు? అసలేం జరిగింది?
రసవత్తరంగా సాగుతోన్న బిగ్‌బాస్ తెలుగు 6వ వారపు ఎలిమినేషన్ దశకు చేరుకుంది. గత వారం ఫైర్‌స్టామ్ పేరుతో 6 మంది కంటెస్టెంట్లు వైల్డ్‌కార్డ్ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, హౌస్‌లో వాతావరణం పూర్తిగా మారింది. కంటెస్టెంట్ల ఆట తీరు ఊహించని విధంగా మారడంతో నామినేషన్ల ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వారపు నామినేషన్లలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నిలిచారు. వీరిలో తనుజా పుట్టస్వామి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్ ఉన్నారు.

సోషల్ మీడియా పోల్స్ అంచనా ప్రకారం ఈ వారం టాప్ ఫ్లేస్ లో తనుజా 32 శాతం ఓట్లతో ముందుంది. సుమన్ శెట్టి 25 శాతంతో రెండో స్థానంలో ఉండగా, డీమాన్ పవన్ 15 శాతం, దివ్య నిఖిత 11 శాతం ఓట్లను సంపాదించారు. చివరి రెండు స్థానాల్లో భరణి శంకర్, రాము రాథోడ్ 10 శాతం ఓట్లు పొందారు. ఈ ఓటింగ్ సరళి చూస్తే.. భరణి శంకర్, రాము రాథోడ్ లు ఇద్దరూ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. అయితే, ఎదైనా పెద్ద ట్విస్టు జరిగితే వీరిలో ఒక్కరు మాత్రమే సేవ్ అవ్వడం సాధ్యమని భావించారు. ఇలా సమానమైన ఓటింగ్ రావడంతో ఈ వారపు ఏదైనా ఓ అద్బుతం జరిగితే.. తప్ప ఒకరూ సేఫ్ కాలేరని, లేకపోతే.. ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశముందని బిగ్‌బాస్ అభిమానులు భావించారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో బిగ్ బాస్ సీజన్ 9 ఆరోవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ లో భరణి శంకర్ షాకింగ్ గా అవుట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో కంటెస్టెంట్లు అందరూ షాక్ లో పడ్డారు. వాస్తవానికి భరణి శంకర్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అందరితో మంచి బాండింగ్స్ క్రియేట్ చేసున్నారు. ఎక్కువగా హ్యూమానిటీ ప్రదర్శించడం గేమ్‌లో ప్రభావం చూపించింది. తాను ఇతర కంటెస్టెంట్లను టార్గెట్ చేయకుండా బంధాలను ప్రాధాన్యం ఇచ్చిన కారణంగానే, ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది.
ఎప్పుడూ తన ఎమోషన్లను బయటకు పెట్టకుండా జాగ్రత్తగా గేమ్ ఆడిన భరణి, బిగ్ బాస్ టైటిల్ విషయాన్ని పక్కన పెట్టినా, టాప్ ఫైవ్‌లో ఉండే క్వాలిటీని కలిగినట్లు భావించబడుతున్నాడు. వేరే వైపు.. వైల్ కార్డు ద్వారా వచ్చిన దివ్యతో భరణి మధ్య బంధం పెరిగింది. దివ్య ర్యాంకింగ్స్ ప్రకారం ముందు నిలిచినవారిని టార్గెట్ చేయడం ప్రారంభించగా, భరణి తన ఫ్రెండ్స్‌తో ఉండే ఆలోచనలో.. మిగిలిన ఆటగాళ్లను సరిగా టార్గెట్ చేయలేదు. దీనివల్ల ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే తనూజతో మొదట్లో మంచి బాండింగ్ చూపిన భరణి, దివ్య రాకతో తాను "టాప్"గా ఫీల్ అవడం, హౌస్‌లో అయోమయ పరిస్థితులు క్రియేట్ అయ్యాయి.
వాస్తవానికి ఈ వారం భరణి గేమ్ ప్లే పై ఇతర కంటెస్టెంట్ ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా దివ్యను రక్షించడానికి భరణి గేమ్ ఆడటం మానేశారు. పైగా ఆమెకు సహాయం చేసే ప్రయత్నంలో ఉండటం. ప్రేక్షకులు ఆ బాండింగ్ నచ్చినట్లు లేదు. దీంతో అతని ఓట్స్ తగ్గించారని చెప్పవచ్చు. అలాగే.. భరణి గేమ్ పద్ధతిలో పెద్దగా మార్పులు లేకపోవడం, ఇతరులపై ఎక్కువ ఆధిపత్యం చూపకపోవడం, బంధాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన భరణి ప్రేక్షకుల ఓట్లలో తక్కువ పొందారు. ఫలితంగా భరణి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇలా ఈ వారం బిగ్ బాస్ ఫాదర్ భరణి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











