అనారోగ్యంతో ఆయేషా? టాస్క్ మధ్యలో కుప్పకూలిన మరో టాప్ కంటెస్టెంట్.. షాక్‌లో బిగ్‌బాస్ టీమ్
బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే. 6 వారాలు పూర్తి చేసుకున్ ఈ సీజన్ మరో రెండ్రోజుల్లో 8వ వారంలోకి అడుగుపెట్టనుంది. పాత కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల్లో లేడీ సింగంగా, ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా జీనత్.. రెండు వారాలకే ఇంటిముఖం పట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఆమె హౌస్‌ను వీడనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోని కొందరు కంటెస్టెంట్స్‌కి అనారోగ్యం ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
ఆయేషా దూకుడు
తమిళ బిగ్‌బాస్‌లో దాదాపు 9 వారాలకు పైగా గడిపి, హోస్ట్ కమల్ హాసన్‌నే వణికించింది ఆయేషా జీనత్. ఆమె తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు రాగానే.. ఖచ్చితంగా గట్టిపోటీ ఇస్తుందని భావించారు. అందుకు తగినట్లుగానే తొలివారం నామినేషన్స్‌లో చెడుగుడు ఆడుకుంది. తనూజను టార్గెట్ చేసి ఆమెను నామినేట్ చేసింది. ఆ తర్వాత రీతూ చౌదరిని కూడా వదల్లేదు.. కేవలం లవ్ ట్రాక్ కోసమే కంటెస్టెంట్‌గా వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది. ఈమె దెబ్బకు పాత కంటెస్టెంట్స్ వణికిపోతున్నారు.

ఆయేషాకు అనారోగ్యం
అయితే గత కొద్దిరోజులుగా ఆయేషా డల్‌గా కనిపిస్తోంది. డీ హైడ్రేషన్, డెంగీ కారణంతో ఆయేషా.. బిగ్‌బాస్ మధ్యలోనే వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని ఆమె టీమ్ కూడా ధ్రువీకరించేలా పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఆరోగ్యం, డాక్టర్ల నివేదిక అనంతరం ఆయేషా తిరిగి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాస్క్ మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలడం, నీళ్లు కొట్టి లేపినా లేవకపోవడంతో కంటెస్టెంట్స్ అంతా కంగారుపడ్డారు. స్టార్ మా వదిలిన ప్రోమోను బట్టి అసలేం జరిగిందో చూస్తే..
మరోసారి కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ తెలుగు 9లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందుకోసం బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం సర్కిల్‌లో టోపీ పెట్టి.. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి కెప్టెన్సీ రేసులో లేని వ్యక్తికి దానిని అందజేసి.. ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న వారిలో కెప్టెన్‌గా ఎవరొద్దు అనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి.. గేమ్ మొదలయ్యాక కళ్యాణ్, దివ్య, నిఖిల్‌లు ఎలిమినేట్ అవ్వగా.. చివరికి ఇమ్యాన్యుయేల్, తనూజ మాత్రమే మిగిలారు. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో గెలిచి ఇమ్మాన్యుయేల్ మరోసారి ఈ సీజన్‌లో రెండోసారి కెప్టెన్‌గా నిలిచినట్లుగా తెలుస్తోంది.
కుప్పకూలిన టాప్ కంటెస్టెంట్
అయితే ఇదే ప్రోమో చివరిలో తనూజ పుట్టస్వామి కళ్లు తిరిగి పడిపోవడంతో కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. దాంతో మిగిలినవారు నీళ్లు కొట్టి లేపేందుకు ప్రయత్నించినా ఆమె కళ్లు తెరవకపోవడంతో అంతా కంగారుపడ్డారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. తనూజ ఆరోగ్యం కూడా పాడైందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే టాస్క్ సందర్భంగా అలిసిపోవడం వల్లే తనూజ కళ్లు తిరిగి పడిపోయిందని తర్వాత అంతా బాగానే గేమ్‌లో పాల్గొందని నెటిజన్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్ అనారోగ్యాల బారినపడటంతో ప్రేక్షకులు ఆందోళనకు గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











