Bigg Boss Telugu 9: ఆ లేడీ కంటెస్టెంట్‌ని పడేసిన సుమన్ శెట్టి.. ఆమెతో పీక్స్‌లో రొమాన్స్!
బిగ్‌బాస్ హౌస్ అంటేనే విచిత్రమైన వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడు ఎవరు గొడవ పడతారో? ఎందుకు కలిసిపోతారో ఎవరికీ తెలియదు. అప్పుడే గొడవలు అంతలోనే నవ్వుతూ మాట్లాడుకోవడాలు జరుగుతూ ప్రేక్షకులకు మెంటలెక్కిస్తూ ఉంటాయి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9లో అదే పరిస్ధితి కనిపిస్తోంది. సోమవారం కావడంతో హౌస్ మొత్తం మారుమోగిపోయింది. తెల్లారి మళ్లీ అందరూ నవ్వుతూ కలిసిపోయారు. ఈ క్రమంలో సుమన్ శెట్టి ఓ లేడీ కంటెస్టెంట్‌లోని లైన్‌లో పెట్టేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..
సుమన్ శెట్టి హవా
బిగ్‌బాస్ తెలుగు 9లో ఏమాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టారు సుమన్ శెట్టి. తొలుత ఈ కుర్రాళ్లు, ఆడబ్యాచ్ దెబ్బకి సుమన్ నిలబడతాడా అన్న అనుమానాలు కలిగాయి. బిగ్‌బాస్‌లో పెద్ద వయసు వారిని త్వరగా ఎలిమినేట్ చేస్తారు. దీనిని బట్టి సుమన్ శెట్టి కూడా ఎక్కువ రోజులు ఉండరని అంతా అనుకున్నారు. తొలుత తడబడినట్లు కనిపించిన సుమన్ శెట్టి.. తర్వాత నెమ్మదిగా తన గేమ్ ప్లాన్‌ను అమలు చేస్తూ వచ్చాడు. డిస్కషన్స్, టాస్క్‌లలో తన హవాను చూపిస్తున్నాడు.

సుమన్‌కు మిస్ అయిన అవకాశం
ఇక ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా సుమన్ శెట్టి టాప్‌లో ఉంటున్నాడు. టాప్ సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు హౌస్‌లో ఉన్నప్పటికీ కూడా సుమన్ ముందు నిలబడలేకపోతున్నారు.ఇక గత వారం తన దమ్ము, స్ట్రాటజీని చూపించాడు సుమన్ శెట్టి. సెలబ్రెటీలకు ఓనర్స్ అయ్యే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఓనర్స్ విసిరిన వస్తువులను పట్టుకుని ఎండ్ బజర్ మోగేలోపు టెనెంట్స్ వాటిని తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టి నుంచి సంజన, ఫ్లోరా షైనీలు వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నించారు. కొడితే ఎలిమినేట్ అని సంచాలక్‌గా ఉన్న ప్రియా శెట్టి చెప్పింది. ఈ క్రమంలో సంజనను సుమన్ కొట్టినట్లుగా ఉండటంతో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసేసింది.
సుమన్‌ను మెచ్చుకున్న నాగార్జున
వీకెండ్‌లో నాగార్జున ఈ ఇష్యూ మీద అనాలిసిస్ చేస్తూ వీడియోను బయటపెట్టారు. సుమన్ టీ షర్ట్‌ని కొడితే నువ్వు సంజనను కొట్టినట్లుగా నువ్వు ఊహించుకుని సుమన్‌ను ఎలిమినేట్ చేశారని నాగ్ ఫైర్ అయ్యారు. రెండు సార్లు నీ మూలన సుమన్ నష్టపోయాడన్నది ప్రియాశెట్టికి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. దీంతో నేను చూసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని సుమన్‌కు ప్రియ సారీ చెప్పింది. ఆ వెంటనే సుమన్ శెట్టి స్పందిస్తూ.. ఓనర్ మిస్ అయిపోయింది కదమ్మా.. సారీ చెప్పేస్తే నాకేం వస్తుంది, ఓనర్ ఇచ్చేస్తానంటే నీ సారీ తీసుకుంటానని సుమన్ చెప్పడంతో అందరూ నవ్వేశారు. నాగార్జున సైతం అతని ఆటతీరుని మెచ్చుకున్నారు.
ఆమె ప్రేమను గెలిచిన సుమన్ శెట్టి
తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9లో మూడో వారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. హౌస్ మొత్తం హీటెక్కిపోగా.. మంగళవారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి సంబందించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టిలు తమ కామెడీతో నవ్వించారు. సుమన్‌ని ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌లు బయటికి తీసుకెళ్లి.. కాలేజీలో నీకు అమ్మాయిల్లో ఫాలోయింగ్ మామూలుగా లేదని, మాకు కూడా టిప్ చెప్పాలని అడుగుతారు. ఇంతలో తనూజ పుట్టస్వామి వచ్చి పెళ్లి చేసుకోవాలంటే పేరెంట్స్ ఎందుకు సుమ్ము.. ప్రేమ ఉంటే సరిపోదు అని అంటుంది. పర్సనల్‌గా మాట్లాడాలని పక్కకి తీసుకెళ్లగా.. మా అమ్మ ఒప్పుకోదు అంటాడు సుమన్. నేను ఒప్పిస్తానని తనూజ చెబుతూ లవ్ సింబల్ చూపిస్తుంది. దాంతో వెంటనే ఆమెను పట్టుకుని రొమాంటిక్‌గా డ్యాన్స్‌లు చేస్తూ ఎత్తుకుని తిప్పడంతో హౌస్‌మేట్స్ షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











