Bigg Telugu 5th Week Voting:ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?

Bigg Boss Telugu 9 Week 5 Voting Results: బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ఉత్కంఠభరితం సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌ నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, మరో ఎలిమినేషన్ కోసం ఐదో వారం నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగింది. ఎన్నాడు ఊహించిన విధంగా నామినేషన్లలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. అలాగే.. త్వరలో బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని వార్తలు వస్తుండటంతో ఈ వారం ఉత్కంఠ నెలకొంది. సోమవారం నామినేషన్స్ పూర్తి కాగా, ఓటింగ్ ఫలితాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఐదో వారం ఓటింగ్‌లో ఎవరు డేంజర్‌ జోన్‌లో ఉన్నారు? ఎవరు టాప్‌లో ఉన్నారు పరిశీలిస్తే..

వేరుగా జరిగిన నామినేషన్స్
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్ తంతు ఎప్పటిలాగే జరగలేదు. కంటెస్టెంట్స్ ఎవరినీ నేరుగా నామినేట్ చేయలేని పరిస్థితి సృష్టిస్తూ బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఫలితంగా కెప్టెన్ రాము రాథోడ్‌ను మినహాయించి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో నిలిచారు. పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖిత - వీరందరినీ నామినేట్ చేసినట్లు ప్రకటించడంతో ఇంటి వాతావరణం కాస్త ఉద్రిక్తమైంది.

Bigg Boss Telugu 9 Week 5 Voting Results Tanuzha Leads While Ritu Demon Pawan in Danger Zone

ఇమ్మాన్యుయేల్‌కు ఇమ్యూనిటీ బూస్ట్
నామినేషన్స్ తర్వాత బిగ్‌బాస్ ఇమ్యూనిటీ టాస్క్‌లు ఇచ్చి, ఆ టాస్క్‌లలో గెలిచిన వారికి రక్షణ కల్పిస్తానని ప్రకటించాడు. కఠినమైన రెండు టాస్క్‌లలో ఇమ్మాన్యుయేల్ అద్భుతంగా ప్రదర్శించి ఇమ్యూనిటీ సాధించాడు. దాంతో అతను, కెప్టెన్ రాము రాథోడ్ మాత్రమే నామినేషన్ల నుంచి బయటపడ్డారు. మిగిలిన పది మంది కంటెస్టెంట్లు ఈ వారం ఎలిమినేషన్ భయంతో పోటీ పడుతున్నారు.

ఓటింగ్ టాప్‌లో తనూజ
సోషల్ మీడియాలో అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. ఈ వారం తనూజ పుట్టస్వామి హవా కొనసాగుతోంది. 19.44 శాతం ఓటింగ్‌తో ఆమె టాప్ పొజిషన్‌లో నిలిచారు. ప్రేక్షకులను ఆకట్టుకునే తన నిరాడంబర నడవడి, టాస్క్‌లలో చూపించిన డెడికేషన్‌ ఆమెపై పాజిటివ్ ఇమేజ్‌ క్రియేట్ అయ్యింది. ఆ తరువాత పడాల పవన్ కళ్యాణ్ కూడా తన ఆటతీరుతో ఈ వారం ప్రేక్షకుల మద్దతు పొందాడు. నాగార్జున సలహాల తర్వాత పవన్ ఆటలో చాలా మార్పులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన 15.82 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు.

టాప్‌ కంటెస్టెంట్ల జాబితా
తనూజ, పవన్‌ల తర్వాత సుమన్ శెట్టి 12.9 శాతం, భరణి 9.91 శాతం, సంజన గల్రానీ 9.66 శాతం ఓటింగ్‌తో టాప్ ఫైవ్‌లో నిలిచారు. ఇక వీరంతా తమ స్వభావం, గేమ్ మైండ్, ప్రేక్షకులను ఆట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న ఓటింగ్ ఫలితాలను చూస్తే.. వీరందరూ సేఫ్ జోన్ ఉన్నట్లు తెలుస్తోంది.

డేంజర్ జోన్ లో

ఇక మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం.. దివ్య నిఖిత 7.34 శాతం, ఫ్లోరా షైనీ 6.74 శాతం, డిమోన్ పవన్ 5.29 శాతం, రీతూ చౌదరి 5.13 శాతంతో వీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఓటింగ్ మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో ఓటింగ్ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఈ వారం టాస్క్‌లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీల ఊసుతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. రాబోయే ఎపిసోడ్‌లలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఇంటి బయటకు వెళ్తారు అనేది సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X