Bigg Boss Telugu 6th Week Voting: ఓటింగ్‌తో తుక్కురేగ్గొడుతున్న తనూజ.. డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ?

Bigg Boss Telugu 6th Week Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. ప్రతి వారం ఎవ్వరూ ఊహించని కొత్త మలుపులు, కొత్త ట్విస్టులతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరోవారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, ఐదో వారంలో ఎవరూ ఊహించని విధంగా దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీలు ఎలిమినేట్ అయ్యారు. ఇలా 5 వారాల్లో ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షో నుండి వైదొలిగారు. ఇప్పుడు షో ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎవరికి హౌస్ గుడ్‌బై చెప్పాలనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో నయా జోష్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. రీలాంచ్ అయింది. ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకోవచ్చారు బిగ్‌బాస్ మేకర్స్. ఆరుగురు దుమ్మురేపే కొత్త కంటెస్టెంట్స్ రంగంలోకి దిచ్చారు. అందులో ఆయేషా జీనత్, దివ్వెల మాధురి, రమ్య మోక్ష కంచర్ల, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఉన్నారు. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. మొదటి రోజే వీరు సత్తా చాటడంతో, పాత హౌస్‌మెంబర్స్‌కి కూడా టెన్షన్ మొదలైంది. ఏ విషయంలోనైనా సరే తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దుమ్మురేపుతున్నారు.

Bigg Boss Telugu 9 Week 6 Voting Results thanuja Top Ramu Rathod Divya in Danger

బిగ్‌బాస్ ఇచ్చిన బాల్ ఆన్ ఫైర్ టాస్క్
బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త కొత్తగా జరిగింది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా "బాల్ ఆన్ ఫైర్" టాస్క్ ఆడించారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో పై నుంచి బాల్ పడుతుంటే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ దానిని పట్టుకుని పాత హౌస్‌మెంబర్స్‌లో ఒకరికి ఇవ్వాలి. ఆ వ్యక్తి ఇద్దరిని నామినేట్ చేయాలి - ఒకరిని సేవ్ చేయవచ్చు, మరొకరిని డేంజర్ జోన్‌లోకి పంపవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు ఈ వారం నామినేషన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చినప్పటికీ, నామినేట్ చేసే పవర్ మాత్రం వారికే ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో నామినేషన్స్ పర్వం హై వోల్టేజ్ లెవెల్‌లో సాగింది.

6వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే..
బాల్ ఆన్ ఫైర్ టాస్క్‌లో తొలుత నిఖిల్ నాయర్ బాల్ పట్టుకుని తనూజ గౌడకు ఇచ్చాడు. ఆమె సుమన్ శెట్టి, రాము రాథోడ్‌లను నామినేట్ చేసింది. ఆ తరువాత రమ్య మోక్ష బాల్ అందుకుని రాముకి ఇచ్చింది. దీంతో అతను డిమోన్ పవన్, రీతూ చౌదరిలను నామినేట్ చేశాడు. ఆ తరువాత గౌరవ్ గుప్తా బాల్ పట్టుకుని సంజనకు ఇచ్చారు. దీంతో ఆమె భరణి, రామును నామినేట్ చేసింది. తర్వాత సుమన్ శెట్టి కూడా తనూజ, సంజనలను నామినేట్ చేశాడు. చివరగా దివ్వెల మాధురి బాల్ పట్టుకుని రీతూ చౌదరికి ఇచ్చింది. ఆమె రాము రాథోడ్, దివ్య నిఖితలను నామినేట్ చేసింది. ఇలా రసవత్తరంగా సాగిన ఈ నామినేషన్స్ పర్వంలో డిమోన్ పవన్, తనూజ గౌడ, సుమన్ శెట్టి , దివ్య నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. ఫైనల్ గా ఆరుగురు నామినేషన్స్ అయ్యారు.

ఓటింగ్ ట్రెండ్స్ - ఎవరు టాప్‌లో?
బిగ్ బాస్ ఓటింగ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవాడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఆరోవారం పోల్స్ ప్రారంభమయ్యే లేదో.. ఓట్లు గుద్దేస్తున్నారు. సోషల్ మీడియాలో, అనధికారిక ఓటింగ్ సైట్లలో వస్తున్న అంచనాల ప్రకారం.. ఈ వారం కూడా తనుజా పుట్టస్వామి దుమ్మురేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా 34 శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు దగ్గరగా సుమన్ శెట్టి ఉన్నారు. నవ్వుల రాజు సుమన్ కూడా ఈ వారం ఓటింగ్ లో దుమ్మురేపుతున్నారు. ఇతడు 21 % ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఇక తరువాత మూడో స్థానంలో డిమోన్ పవన్ నిలిచారు. ఈ లవర్స్ కూడా ఓటింగ్ లో దుసుకపోతున్నారు. 14 శాతం ఓటింగ్ తో టాప్ 3లో నిలిచి, దాదాపు సేఫ్ జోన్ లో నిలిచారు.

ఎవరు డేంజర్‌లో?

ఇక బిగ్ బాస్ ఫాదర్ భరణి శంకర్ ఓటింగ్ దారుణంగా పడిపోయింది. కేవలం 11 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తరువాత రాము రాథోడ్ 10 శాతం ఓటింగ్, దివ్య నిఖిత 10 శాతం ఓటింగ్ పొందారు. ఇలా ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ రివ్యూయర్స్ చెబుతున్నారు. ఈ వారం నామినేషన్స్ హౌస్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమయ్యాయి. #SaveRamuRathod, #VoteForDivyaNikitha, #SupportTanuja హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరినీ నామినేట్ చేయకపోయినా, గేమ్‌ను రివర్స్ గేర్‌లోకి తీసుకెళ్లారు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X