Bigg Boss 9 Telugu 7th Week Nominations: బిగ్‌బాస్ 7వ నామినేషన్స్‌లో 8మంది.. నామినేషన్‌లో ఎవరెవరంటే?
Bigg Boss 9 Telugu 7th Week Nominations: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ప్రతివారం కొత్త మలుపు తిరుగుతోంది. ఐదో వారం వరకు బిగ్‌బాస్ హౌస్ లో కామన్ మ్యాన్, సెలబ్రిటీ కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగేది. కానీ, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో షో స్వరూపమే మారిపోయింది. ట్రయాంగిల్ స్టోరీలాగా కామన్ మ్యాన్స్, సెలబ్రిటీస్, వైల్డ్‌కార్డ్ మధ్య గేమ్ నడుస్తోంది. ఇప్పటివరకు చదరంగంలా సాగిన షో ఇప్పుడు రణరంగంగా మారిపోయింది. ఈ వారం ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? హౌస్‌లో ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..
గత ఆరు వారాలుగా బిగ్ బాస్ 9 వివాదాలు, సంచలనాలు, షాకింగ్ సన్నివేశాలతో ముందుకు సాగింది. ఇప్పటివరకు 7 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు, వీరిలో శ్రష్టివర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశా సైనీ, శ్రీజ దమ్ము, భరణి శంకర్ ఉన్నారు. 5వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినప్పటి నుండి ఇంట్లో ఆట మరింత ఉత్కంఠతో సాగుతోంది.

వైల్డ్ కార్డు ఎంట్రీల ముందే కంటెస్టెంట్లు పద్దతి తగ్గదేలే అన్నట్లుగా ఉంటే.. వైల్డ్ కార్డు ఎంట్రీలతో ప్రతి కంటెస్టెంట్ అసలు తగ్గదేలే అలా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ముఖ్యంగా అయేషా, మాధురి, దివ్య నిఖిత, రీతు చౌదరి వంటి కంటెస్టెంట్లు ఇది చదరంగం కాకుండా రణరంగం కాదని నిరూపిస్తున్నారు.
నామినేషన్ ప్రక్రియ
7వ వారం నామినేషన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ వారం నామినేషన్ హక్కును కూడా పోరాడి గెలవాల్సిందిగా ప్రకటించారు బిగ్ బాస్ . నామినేషన్ ప్రక్రియలో ముఖ్యంగా అయేషా, ఇమాన్యుల్ కీలక పాత్ర పోషించారు. టాస్క్ రూపంలో అయేషా ఇమాన్యుల్‌కు నామినేషన్ పవర్స్ ఇచ్చారు. బిగ్ బాస్ హాల్‌లో వేలాది బెలూన్స్ ఉంచబడి, వాటిలో నామినేషన్ టికెట్స్ దాగి ఉన్నాయి. ఈ టికెట్లు పొందినవారు నామినేషన్ వివిధ పవర్స్ పొందగలరని ప్రకటించారు.
ఇక సైరన్ శబ్దంతో అయేషా, ఇమాన్యుల్ రెచ్చిపోయారు. వేలాది బెలూన్స్ పగలగొట్టి, వాటిలోని నామినేషన్ టికెట్లను సంపాదించుకున్నారు. అయేషాకు రెండు నామినేషన్ కార్డ్స్, ఒక డైరెక్ట్ నామినేషన్ కార్డ్ లభించగా, ఇమాన్యుల్‌కు కూడా 3 నామినేషన్ కార్డ్స్ దొరికింది. వీటిలోని పవర్ కార్డ్స్‌ను ఇతర సభ్యులతో పంచుకోవచ్చు అని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇమాన్యుల్ తన కార్డ్స్‌ను కళ్యాణ్, దివ్య నికిత, రీతు చౌదరి తో పంచుకున్నాడు. అదే విధంగా అయేషా తన కార్డ్స్‌ను సంజన, గౌరవ్, తనుజ తో పంచుకుంది. టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనంతరం, నామినేషన్ కంటెస్టెంట్లు సెలెక్ట్ చేయబడి వారి ముఖంపై ఫోమ్ రుద్ది, నామినేషన్ కారణాలను వెల్లడించారు.
అయేషా-రీతు ఘర్షణ
ఇలా నామినేషన్ ప్రక్రియలో అయేషా రీతును టార్గెట్ చేసింది. రీతు ముఖానికి ఫోమ్ రుద్దింది. అయేషా తన రిజన్స్ చెపుతుంటే.. ఆ ఫోమ్ తుడుచుకోవడానికి "ఒక నిమిషం ఆగు" అని అడ్డుకుంది రీతూ. తీస్తేనే చర్చ జరుగుతుందని చెప్పింది, రీతు కూడా తన అభిప్రాయాన్ని బలంగా తెలియజేసింది. అయేషా "నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు వచ్చింది లవ్ కార్డు వెతుక్కావడం కోసమే కాదా" అని ఇష్టవచ్చినట్టు ఆయేషా మాట్లాడింది. దీంతో రీతు కోపం కట్టలు తెంచుకుంది. "నీకు అనిపించింది తప్పు కాదు, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నువ్వు చూసినది కరెక్ట్ కాదు" అని చెప్పింది. అయేషా కాస్త ఓవర్ చేస్తూ.. 'రీతు ఎందుకు నీకు అంత ఆటిట్యూడ్?" అని ప్రశ్నించింది. ఇలా అయేషా-రీతు మధ్య నామినేషన్ రణరంగం హౌస్‌లో ఉత్కంఠను సృష్టించింది.
ఎలిమినేషన్ ఇదే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 7వ వారం నామినేషన్ ప్రక్రియలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో గోల్కొండ ఫేమ్ శీను, దివ్య నికిత, మోక్ష రమ్య, సంజన , తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సోల్జర్ కళ్యాణ్, రీతు చౌదరి నామినేట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో పూర్తి వివరాలపై క్లారిటీ రాలేదు. అధికారికంగా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ వారం నామినేషన్లకు సంబంధించిన వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











