Bigg Boss Telugu 7th Week Voting: కళ్యాణ్ వర్సెస్ తనూజ.. డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్..

Bigg Boss Telugu 7th Week Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ప్రతివారం కొత్త మలుపు తిరుగుతోంది. తొలుత కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా సాగిన గేమ్ షో.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో గేమ్ స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు ట్రయాంగిల్‌ లవ్ స్టోరీలా కామనర్స్, సెలబ్రిటీస్, వైల్డ్‌కార్డ్ మెంబర్ మధ్య గేమ్ కొనసాగుతోంది. ఇది చదరంగం కాదు రణరంగం అనేలా మారిపోయింది. ఈ రసవత్తరంగా సాగుతోన్న బిగ్ బాస్ 7 వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా జోరుగా సాగింది. ఎవరూ ఊహించిన విధంగా ఈ వారం 8 మంది నామినేషన్స్ లో నిలిచారు. తమకు నచ్చిన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా తెగ ఆరాటపడుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ షో 7 వారం ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఎవరు టాప్ లో నిలిచారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు? అనే వివరాల్లోకెళ్తే..

గత ఆరు వారాలుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో వివాదాలు, సంచలనాలు, షాకింగ్ సన్నివేశాలతో ముందుకు సాగింది. ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో శ్రష్టివర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశా సైనీ, శ్రీజ దమ్ము, భరణి శంకర్ ఉన్నారు. 5వ వారం డబుల్ ఎలిమినేషన్ జరగడం, అదే వారం వైల్డ్ కార్డు ఎంట్రీ జరగడంతో ఆట మరింత ఉత్కంఠతో సాగుతోంది. ప్రతి కంటెస్టెంట్ అస్సలు తగ్గేలేదే అన్నట్టు తమ గేమ్ ను కొనసాగిస్తున్నారు.

Bigg Boss Telugu 9 Week 7 Voting Results Kalyan Leads Thanuja Close Behind Who s in the Danger Zone This Week
భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ వాతావరణం ఎమోషనల్‌గా మారింది. పుల్ డ్రామాతో సాగుతోంది. దివ్య, తనూజల ఓదార్పు యాత్రలు కొనసాగుతున్నాయి. ఇది టెంపరరీ సిట్యూవేషన్ మాత్రమే, స్ట్రాంగ్‌గా ఉండంటూ ఇతర కంటెస్టెంట్లు ధైర్యం చెబుతున్నారు. ఇక తరువాత బిగ్‌బాస్ ఉదయం హౌస్‌ను వందల బెలూన్స్‌తో నింపి, నామినేషన్స్ టాస్క్‌కి సరికొత్త టర్న్ ఇచ్చాడు. సుమన్ శెట్టి, గౌరవ్ కెప్టెన్స్‌గా ఉన్నందున వారికి "రెడ్ పిల్", "బ్లూ పిల్" ఎంపిక చేసే అవకాశం ఇచ్చాడు. సుమన్ రెడ్ పిల్ ఎంచుకోవడంతో "సేవ్ యోర్ సెల్ఫ్" పవర్ వచ్చింది, దాంతో అతను నామినేషన్స్‌ నుంచి సేఫ్ అయ్యాడు. గౌరవ్‌కు "సేవ్ సమ్ వన్" పవర్ లభించింది.

తరువాత నామినేషన్ టాస్క్ ప్రారంభమైంది. ఇమ్మానుయేల్, అయేషా బెలూన్స్ పగలగొట్టే టాస్క్‌లో పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో అయేషాకు మూడు టికెట్స్‌, ఇమ్మానుయేల్‌కు ఐదు టికెట్స్ లభించాయి. ఇమ్మానుయేల్ తన టికెట్స్‌ను కళ్యాణ్, దివ్య, తనూజ, రీతూ, రమ్యకు ఇచ్చాడు. అయేషా మాత్రం సాయి, సంజనకు టికెట్స్ ఇచ్చి "డైరెక్ట్ నామినేట్" టికెట్ తన దగ్గర ఉంచుకుంది. దాంతో అయేషా రీతూని డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. "నువ్వు లవ్ కంటెంట్ కోసమే వచ్చావ్" అంటూ అయేషా పర్సనల్‌గా కామెంట్ చేయడంతో రీతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, తిట్లు, సవాళ్లు చోటు చేసుకున్నాయి. "నీ ఆటిట్యూడ్ మార్చుకో" అని రీతూ చెప్తే, "నోరు మూసుకో అని నువ్వు ఎవరు చెప్తావ్" అంటూ అయేషా ఎదురుదాడి చేసింది.

తరువాత దివ్య తన నామినేషన్స్‌లో అయేషా, సాయిల పేర్లు ప్రకటించింది. రీతూ కూడా తన రెండో నామినేషన్‌గా రాముని సెలెక్ట్ చేసింది. చివరికి కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతూ, తనూజ, రమ్య, సాయి, అయేషా మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. అయితే చివర్లో కెప్టెన్ గౌరవ్ తన "సేవ్ సమ్ వన్" పవర్‌ను ఉపయోగించి అయేషాను నామినేషన్స్‌ నుంచి రక్షించాడు. అయేషా వెంటనే గౌరవ్‌కి ధన్యవాదాలు చెబుతూ హగ్గు ఇచ్చింది. ఇలా బెలూన్స్ టాస్క్‌ వల్ల హౌస్‌లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. రీతూ-అయేషా మధ్య తగాదా అభిమానులను ఆకట్టుకుంది.

ఇక ఓటింగ్ విషయాన్నివస్తే.. బిగ్ బాస్ 7 వ వారం ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉండగా, తమ అభిమాన కంటస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఓటింగ్ గుద్దేస్తున్నారు. సోషల్ మీడియా షేకయ్యేలా తమ అభిమాన కంటెస్టెంట్ల పోస్టులు చేస్తున్నారు. వారికి సపోర్టుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో పోల్స్, అనధికారిక సర్వేల ప్రకారం.. ఈసారి ఓటింగ్‌లో కల్యాణ్ టాప్ లో నిలిచారు తాజా పోలింగ్ గణాంకాల ప్రకారం, కల్యాణ్ 27.91% ఓట్లు కైవసం చేసుకున్నారు. అతని స్ట్రైట్‌ఫార్వర్డ్, గేమ్‌లో పర్ఫెక్ట్ స్ట్రాటజీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తనుజా రెండో స్థానంలో నెలకొంది. ఈ బుట్టబొమ్మ 21.48 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమె ఆడిన స్మార్ట్ గేమ్, మాట్లాడే తీరు, బిగ్‌బాస్ టాస్క్‌లలో చురుకుతనం ఆమెకు బలమైన సపోర్ట్‌గా మారాయి. అయితే ఆమెకు కల్యాణ్‌తో క్లోజ్ కాంపిటిషన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సంజన 14.8 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల టాస్క్‌లలో ఆగ్రహం, తన క్యూట్ నెస్ ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే కొందరు ఆమెను "కంట్రోవర్సీ క్వీన్" అని కూడా పేర్కొంటున్నారు.

రీతూ 13.77 శాతం ఓటింగ్ తో నాలుగో స్థానంలో ఉంది. ఏ విషయాన్ని అయినా.. స్ట్రాంగ్ గా చెప్పడం, కంటెస్టెంట్లు ఎవరైనా సరే తగ్గేదేలే అన్నట్టుగా పోటీపడటం ఈ అమ్మడు స్టైల్.. ఇలా తన ఆటతీరుతో రితు ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటుంది. అయితే ఆమెకు మరింత స్క్రీన్ టైమ్ రావాల్సిన అవసరం ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక రమ్యా 11.53 % ఓట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. తన పాజిటివ్ వైబ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కానీ, గేమ్‌ప్లేలో కొంచెం యాక్టివ్‌గా లేకపోవడం ఆమె ర్యాంక్‌పై ప్రభావం పడింది.

ఇక దివ్య 5.67% ఓటింగ్ పొందగా, రాము 3.75 శాతం ఓట్లు, సాయి శ్రీనువాస్ 1.89 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు. దీంతో ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో నిలిచారు. వీరిలో ముఖ్యంగా సాయి గేమ్‌లో అంతగా కనపడకపోవడం, టాస్క్‌లలో వెనకబడిపోవడం వల్ల ఓట్లు తక్కువగా వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రేక్షకుల మధ్య ఓటింగ్‌పై భారీ చర్చ నడుస్తోంది. కల్యాణ్, తనుజా మధ్య హాట్ రేస్ సాగుతుండగా, ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు హౌస్‌కి గుడ్‌బై చెప్పబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Read more about: bigg boss telugu priya pawan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X