Bigg Boss Telugu 8th Week Elimination: మరోసారి షాకింగ్​ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్!

Bigg Boss Telugu 8th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రసవత్తరంగా సాగుతోంది. ఈ వారంలో గేషో పూర్తిగా కొత్త మూడ్‌లోకి అడుగుపెట్టింది. సీజన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో ట్విస్టులు, సస్పెన్స్‌లు చోటుచేసుకున్నాయి. కానీ, ఈ వారం జరిగిన సంఘటనలు మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఉత్కంఠను క్రియేట్ చేశాయి. బిగ్‌బాస్ టీం తీసుకున్న కొత్త నిర్ణయాలు, రీఎంట్రీ ట్విస్టులు, నామినేషన్ ఫార్మాట్ మార్పులు ఇవన్నీ కలిసి హౌస్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు?ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు డేంజర్‌జోన్ లో నిలిచారు? అనే విషయంలోకి వెళితే..

మాజీ కంటెస్టెంట్ల రీఎంట్రీ
ఈ వారం బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములను రీఎంట్రీ పేరుతో హౌస్‌లోకి పంపించారు. ఈ ఇద్దరి రీఎంట్రీ హౌస్‌లో తుఫాన్ క్రియేట్ అయింది. భరణి శంకర్ ఎంట్రీతో హౌస్‌లో పాజిటివ్ ఎనర్జీ కనిపించినా, శ్రీజ దమ్ము రావడంతో మాత్రం హౌస్ వాతావరణం ఒక్కసారిగా టెన్షన్‌గా మారింది. పాత గొడవలు, పాత విభేదాలు మళ్లీ బయటకు వచ్చాయి. కొందరిపై శ్రీజ చేసిన కామెంట్లు హౌస్‌లో హీట్ పెంచేశాయి. మరోవైపు భరణి మాత్రం తన సింపుల్ బిహేవియర్‌తో అందరి మనసు గెలుచుకునే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకుల దృష్టి అంతా ఇప్పుడు ఈ ఇద్దరి మీదే ఉంది.

Bigg Boss Telugu 9 Week 8 Voting Kalyan Padala Thanuja Lead Ramu Pawan Madhuri and Gourav in Danger Zone

నామినేషన్‌లో కొత్త ట్విస్ట్!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో 8 వారం నామినేషన్ ప్రక్రియ బిగ్‌బాస్ చరిత్రలోనే స్పెషల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేసుకునే రూల్ అమలులో ఉండేది. కానీ, ఈసారి మాత్రం బిగ్ బాస్ గేమ్ రూల్స్ పూర్తిగా మార్చేశారు. మాజీ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుత హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. ఈ అనూహ్య ట్విస్ట్‌తో హౌస్‌లో షాక్ వాతావరణం నెలకొంది. ఎవరెవరు నామినేట్ చేస్తారో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించింది. మాజీ కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలు బలంగా చెప్పడంతో ప్రస్తుత హౌస్‌మేట్స్ రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయారు. మాటల యుద్ధాలు, ప్రతివాదాలు, భావోద్వేగాలు ఒక్క ఎపిసోడ్‌లోనే అన్నీ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నామినేట్ అయిన కంటెస్టెంట్లు
ఇలా రసవత్తరంగా సాగిన నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇందులో దువ్వాడ మాధురి, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సంజనా గల్రానీ, తనుజ పుట్టస్వామి, డిమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ లు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఈ నామినేషన్ రౌండ్ తర్వాత షోలోని సంబంధాలు, బంధాలు అన్నీ కొత్త మలుపు తిప్పుకున్నాయి. కొందరు హౌస్‌మేట్స్ మళ్లీ జట్టుగా నిలవగా, కొందరు ఒంటరిగా మారిపోయారు.

ఓటింగ్ ట్రెండ్ హీట్‌లో!
బిగ్ బాస్ ఓటింగ్ విషయానికొస్తే.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఈ వారం కూడా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు మొదలుపెట్టారు. అనధికారిక సర్వేలు, పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల ఓట్ల పరంగా ముందంజలో ఉన్నారు. ఆయనకు 25.83% ఓట్లు లభించాయి. ఆ తరువాత తనుజ పుట్టస్వామి 20.86% ఓట్లు అందుకుని రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే టఫ్ ఫైట్ కొనసాగుతోంది. రీతూ చౌదరి 15.46% ఓట్లు పొంది మూడో స్థానంలో ఉండగా.. సంజన గల్రానీ 13.66% ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. వీరు నలుగురు సేఫ్ జోన్ లో నిలిచారు.

ఇక మిగిలిన కంటెస్టెంట్లలో డెమోన్ పవన్ 6.2 శాతం ఓట్లు పొందగా.. రాము రాథోడ్ 6.05 శాతం ఓట్లు, దువ్వాడ మాధురి 6 శాతం ఓట్లు, గౌరవ్ గుప్తా 5.93 శాతం ఓట్లు పొందారు. ఈ ఓటింగ్ ను చూస్తే.. రాము, పవన్, మాధురి, గౌరవ్ లు డేంజర్ జోన్‌లో ఉన్నారని, కానీ బిగ్ బాస్‌లో ఏదైనా క్షణాల్లో మారిపోవచ్చు. ఓటింగ్ చివరి నిమిషం వరకు ఫ్యాన్స్ తమ ఫేవరెట్స్‌ను గెలిపించేందుకు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే వారాల్లో ఇంకా ఎన్ని షాకింగ్ ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X