Bigg Boss Telugu 8th Week Elimination: బిగ్‌బాస్‌లో టాప్ కంటెస్టెంట్‌కు ముడిందా? డేంజర్ జోన్‌లో ఆ నలుగురు?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో 8వ వారం ముగించుకొని 9వ వారంలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియను వినూత్నంగా ముగించింది. ఈ వారం నామినేషన్లలో మొత్తం 8 మంది నామినేషన్‌లోకి వచ్చారు. అయితే ఈ వారం అందరూ టాప్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముప్పులో ఇరుక్కొన్నారు. అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారికి ఎలాంటి ఓటింగ్ జరిగింది? ఎవరెవరూ డేంజర్ జోన్‌లో ఉన్నారనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటి వరకు 7 వారాల్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద రామన్న, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఇంటిలోకి 8 వారంలో శ్రీజ, భరణి శంకర్ ఇంటిలోకి రీ ఎంట్రీ ద్వారా వచ్చారు.

అయితే 8వ వారం నామినేషన్ల ప్రక్రియ రంజుగా విభిన్నమైన పద్దతిలో సాగింది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారందరినీ ఇంటిలోకి మళ్లీ ఆహ్వానించి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేలా చేశారు. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ హాట్‌గా వివాదాస్పదంగా గొడవలతో దద్దరిల్లింది. అలా ఈ వారం నామినేషన్లలో సంజనా గల్రానీ, మాధురి దువ్వాడ, తనుజా గౌడ, రీతూ చౌదరీ, రాము యాదవ్, డీమాన్ పవన్, గౌరవ్, కల్యాణ్ పడాల నామినేట్ అయి ఎలిమినేషన్ ముప్పులో ఇరుక్కుపోయారు.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్‌లో ఉన్న వారిలో తనూజా గౌడ అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆమెకు సుమారుగా పోలైన ఓట్లలో 34 శాతం ఓట్లు లభించాయి. ఆ తర్వాత అత్యధికంగా సంజన గల్రానీ 20 శాతం ఓట్లు, అనంతరం రాము రాథోడ్ 9 శాతం ఓట్లు, గౌరవ్ గుప్తా 7.5 ఓట్లు, మాధురి దువ్వాడ 7 శాతం, డీమాన్ పవన్ 7 శాతం, రీతూ చౌదరీ 7 శాతం ఓట్లు సాధించారు.
అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ ప్రకారం రీతూ చౌదరీ, డీమాన్ పవన్, మాధురి దువ్వాడ, గౌరవ్ గుప్తా తక్కువగా ఓట్లు లభ్యమయ్యాయి. దాంతో ఈ ముగ్గురిలో ఒకరు ఇంటి దారి పట్టే అవకాశం ఉంది. ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో ఎవరైనా మెరుగైన ఓటింగ్ సాధిస్తే.. బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గౌరవ్ గుప్తాకు ఎలిమినేషన్ ముప్పు అధికంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











