Bigg Boss 9: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో 40 మంది కంటెస్టెంట్స్.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ పండుగ ప్రారంభం అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం అయ్యింది. కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్వయహరించిన ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సంబంధించిన ఫైనల్ కంటెస్టెంట్స్ ను హౌజ్ లోకి పంపించారు. అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్షకు 40 మంది కంటెస్టెంట్స్ ను ఎంపిక చేశారు. అందులో నుంచి ఫైనల్‌గా 6 గురు కంటెస్టెంట్స్‌ను హౌజ్‌లోకి పంపించారు. ఇక మిగిలిన తిరిగి ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి కామనర్ కంటెస్టెంట్ గా మనీశ్ మర్యాద హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మనీశ్ హౌజ్‌లోకి వెళ్లడాని కంటే ముందు పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన బిగ్ బాస్ అగ్నిపరీక్షలోని టాస్కులు, తదితర అంశాలపై వివరించారు. ఇదే సమయంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్ంట్స్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ అగ్నిపరీక్షకు ఎంపికైన పోటీదారులకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని చెప్పారు. కేవలం ఫైనల్ లిస్ట్ కు చేరుకున్న వారికి, అది కూడా హౌజ్ లోకి వెళ్లిన వారికి పేమెంట్ ఇస్తారని వివరించారు.

Bigg Boss Telugu Agnipariksha Contestants Remunertion

ఇక లక్షల్లో అగ్ని పరీక్షకు దరఖాస్తులు వచ్చిన సమయంలో కేవలం వేలల్లో ఎంపిక చేశామని, అందులోంచి కేవలం 40 మంది అగ్నిపరీక్షకు ఎంపికయ్యారని అక్కినేని నాగార్జున చెప్పారు. ఇక అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి 6గురు కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసి హౌజ్ లోకి పంపించారు. వాస్తవానికి బిగ్ బాస్ 5 గురు కామనర్స్ ను మాత్రమే ఎంపిక చేశారు. ఇక లాస్ట్ లో శ్రీముఖి మనీశ్ మర్యాదను ఎంపిక చేసి పంపించడం విశేషం.

ప్రస్తుతం హౌజ్ లో మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, జవాన్ కళ్యాణ్ పడాలా, శ్రీజ దమ్ము, డాక్టర్ ప్రియా శెట్టి, మనీశ్ మర్యాద ఆరుగురు కామనర్స్ గా హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీరికి ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని హోస్ట్ అక్కినేని నాగార్జున చెప్పడం విశేషం.

ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండు హౌజ్ లు ఉండటం విశేషం. అయితే ఒక హౌజ్ లో ఓనర్స్, మరొక హౌజ్ లో టెనెంట్స్ ఉంటారని నాగార్జున చెప్పారు. ఇక ఓరన్స్ గా కామనర్స్ గా ఎంపికైన ఆరుగురు కంటెస్టెంట్స్ కు పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు టెనెంట్ హౌజ్ లో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ ను పంపించారు. ఓనర్స్ ఉండే హౌజ్ లో అన్ని వసతులు ఉంటాయి. ఇక టెనెంట్ ఉండే హౌజ్ లో ఏమీ ఉండవని నాగార్జున చెప్పారు. ఈ క్రమంలో గేమ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X