For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss మెహబూబ్‌ దిల్‌సేకు తీవ్ర విషాదం.. ఒంటరివాడిని చేశావు.. నేను ఎలా బతకాలి అంటూ పోస్ట్

  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో ఎందరో మనసులు గెలుచుకొన్న మెహబూబ్ దిల్‌సే తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. తన తల్లి అకాల మరణంతో ఆయన కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకొన్నాయి. తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన మెహబూబ్ తీవ్ర ఆవేదనతో సుదీర్ఘమైన లేఖను రాయడం అందర్నీ కలిచి వేసింది. విషాదంలో మునిగిన మెహబూబ్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అషురెడ్డి, లాస్య, అఖిల్ సార్థక్, నోయల్ సీన్, విశ్వ, షన్ను తదితరులు అండగా నిలిచారు. మెహబూబ్ రాసిన లేఖ వివరాల్లోకి వెళితే..

  యూట్యూబర్ నుంచి బిగ్‌బాస్ తెలుగు షో

  యూట్యూబర్ నుంచి బిగ్‌బాస్ తెలుగు షో


  యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మెహబూబ్ దిల్ సే మంచి డ్యాన్సర్. ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలకు సోషల్ మీడియాలో విశేష స్పందనతోపాటు లక్షలాది వ్యూస్ రావడంతో సెలబ్రిటీగా మారిపోయారు. దాంతో ఆయనకు బిగ్‌బాస్ తెలుగులో అవకాశం లభించింది. ఆ షోలో తన కుటుంబంపై ప్రేమను ఎన్నోసార్లు వ్యక్తీకరించాడు. అలాగే స్నేహానికి మెహబూబ్ ప్రాణం ఇచ్చే వ్యక్తిగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకొన్నాడు. బిగ్‌బాస్ తర్వాత మెహబూబ్ మరింత పాపులారిటిని సంపాదించుకొన్నాడు.

   గుండెపోటుతో తల్లి మరణం

  గుండెపోటుతో తల్లి మరణం


  బిగ్‌బాస్ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్‌లపై ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెహబూబ్ దిల్ సే తల్లి మరణించడం విషాదంగా మారింది. ఆగస్టు 5వ తేదీన గుండెపోటుతో తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ సందర్భంగా తన తల్లి గురించి పోస్టు పెడుతూ.. అమ్మా.. నీవు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్లావు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలను నేను ఎలా తీసుకోవాలి. నేను ప్రతీ రోజు ఎవరితో మాట్లాడాలి. అమ్మా..నీవు లేకుండా నేను ఎలా జీవించాలి. నీవు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేదు అంటూ మెహబూబ్ దిల్ సే తన పోస్టులో ఆవేదన చెందాడు.

  నీ త్యాగాలను మరువలేం

  నీ త్యాగాలను మరువలేం


  తన తల్లి మరణంపై మరింత ఎమోషనల్ అవుతూ.. అమ్మా.. నీవు నన్ను ఎప్పుడు కంట్రోల్ చేయలేదు. నేను అంచెలంచెలుగా ఎదగడాన్ని చూసి ఆనందపడ్డావు. నా జీవితం ఒడిదుకుడులు చెందినప్పుడు నాకు అండగా ఉన్నావు. నీ మాటలతో నాకు స్పూర్తిని కలిగించావు. అన్ని వేళలా నాకు ప్రేరణగా కల్పించావు. మా కోసం నీవు ఎంత పోరాటం చేశావో నాకు తెలుసు. మా గురించి నీవు ఎంత తపన పడ్డావో మాకు తెలుసు. ఎవరూ చేయలేని త్యాగాలను మా కోసం నీవు చేశావు అంటూ మెహబూబ్ దిల్ సే పోస్టులో తెలిపాడు.

   అంతా సెకన్లలోనే జరిగిపోయిందంటూ

  అంతా సెకన్లలోనే జరిగిపోయిందంటూ


  అమ్మీ.. నీవు లేకుండా నా జీవితం ఎక్కడికిపోతుందో అర్ధం కావడం లేదు. ప్రతీ సెకన్ నీ గురించే ఆలోచిస్తున్నాను. ఏ లోకాన ఉన్నప్పటికీ నీవు నన్ను చూస్తు ఉంటావని నాకు తెలుసు. నీవు గర్వపడే విధంగా నేను చేస్తాను. సుభాన్, నాన్నను బాగా చూసుకొంటానని నీకు ప్రామిస్ చేస్తున్నా. అంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. నీవు లేవనే విషయంతో మేమంత కన్నీటి సంద్రంలో మునిగిపోయాం అని దిల్ సే కన్నీటి పర్యంతమయ్యారు.

  ప్రేమను పంచండి అంటూ

  ప్రేమను పంచండి అంటూ


  ఫ్రెండ్స్.. మా ఆత్మకు శాంతి చేకూరేలా భగవంతుడిని ప్రార్థించండి. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నీకు ఇష్టమైన వారికి మీ ప్రేమను తెలియజేయండి. నా జీవితం నీవు పంచిన మధురానుభూతలతో జీవిస్తాను. అమ్మ నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అమ్మా నీవు లేవనే విషయాన్ని ఊహించుకోవడం లేదు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను అని దిల్ సే తన పోస్టులో తెలిపారు

  English summary
  Bigg Boss Telugu fame Mehaboob Dil Se gets emotional on his mother's death. He wrote emotional post about Mother's love in instagram. He said, Ammi 😭 You left me all alone 💔Now how should I take decisions? To whom I can talk everyday? How should I live without you ammi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X