For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హోస్ట్ గా నాగార్జున వేస్ట్.. కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్, ఆమెకు నాగ్ వార్నింగ్

  |

  దేశవ్యాప్తంగా అత్యధికంగా పాపులర్ అయిన రియాలిటీ షోలలో ముందుంటుంది బిగ్ బాస్. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో అనేక సీజన్లతో దూసుకుపోతోంది బిగ్ బాస్. తెలుగులో అయితే ఇప్పటివరకు ఐదు టీవీ, ఒక ఓటీటీ సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం ఆరో సీజన్ తో దుమ్ములేపుతోంది. ఎప్పటిలానే అంచనాలు, విమర్శలతో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ప్రస్తుతం ఆరు వారాలు పూర్తి చేసుకుంది.

  మొదటి రెండు సీజన్లకు వరుసగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుంచి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హోస్టింగ్ వేస్ట్ అని షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ కంటెస్టెంట్.

  ఇతర భాషలతో పోల్చితే..

  ఇతర భాషలతో పోల్చితే..

  ఇతర భాషలతో పోల్చితే తెలుగు బిగ్ బాస్ షోకి ఇక్కడ మంచి ఆదరణే దక్కుతోంది. ఇది గమనించిన నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త సీజన్ తీసుకొస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే మొత్తంగా 5 టీవి, 1 ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ప్రారంభం సీజన్ ను ఎందరో మహానుభావులు అందరికీ మీ ఎన్టీఆర్ వందనాలు అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు.

  మూడో సీజన్ నుంచి..

  మూడో సీజన్ నుంచి..

  బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ను మీ.. నా.. ని టీవీ అంటూ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టాడు. ఇక మూడో సీజన్ నుంచి ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఆరో సీజన్ వరకు మన టీవీ అంటూ హోస్ట్ చేస్తున్నాడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ క్రమంలోనే ఓ కంటెస్టెంట్ హోస్ట్ గా నాగార్జున వేస్ట్ అని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

   కొంచెం హార్డ్ గానే..

  కొంచెం హార్డ్ గానే..

  అయితే అది ప్రస్తుతం ప్రసారమవుతున్న ఆరో సీజన్ లో కాదు. చిత్తూరు చిరుతగా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్ అంతకుముందు బిగ్ బాస్ పై రివ్యూలు చేసేదని తెలిసిందే. ఆమె రివ్యూలు కొంచెం హార్డ్ గానే ఉండేవి. ఎలా అంటే షణ్ముఖ్ జశ్వంత్, సిరిల రొమాన్స్ గురించి ఓ రేంజ్ లో ఏకిపారేసింది. ఆమె రివ్యూతో గీతూ రాయల్ కి షణ్ముఖ్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా నడిచింది.

  రివ్యూ చేయడంపై క్షమాపణ..

  రివ్యూ చేయడంపై క్షమాపణ..

  సిరిని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసింది. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ హౌజ్ లోకి వచ్చిన గీతూ రాయల్.. అలా రివ్యూ చేయడంపై క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా అన్ని సీజన్లకో సిరి బెస్ట్ కంటెస్టెంట్ అని స్టేట్ మెంట్ కూడా పాస్ చేసింది. సిరి అంత బెస్ట్ అయితే రివ్యూలో అలా ఎందుకు చెప్పింది అని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున హోస్టింగ్ పై గీతూ చేసిన రివ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  హోస్ట్ గా నాగార్జున వేస్ట్..

  హోస్ట్ గా నాగార్జున వేస్ట్..

  అందులో హోస్ట్ గా నాగార్జున వేస్ట్ అని చెప్పేసింది. బిగ్ బాస్ హోస్ట్ చేసిన వాళ్లలలో తనకు నాని బెస్ట్, నాని ఇరగదీశాడు అని చెప్పుకొచ్చింది. ''ఎన్టీఆర్ బాగా చేశారని అంటారు. అయితే నేను మొదటి సీజన్ చూడలేదు. కానీ నేను చూసినంతవరకు నాకు నాని బెస్ట్. నాగార్జున గారు అయితే చాలా సాఫ్ట్. వాళ్ల తప్పు చేసిన సరే అలా కాదమ్మా.. ఇలా కాదమ్మా అని అంటాడు. నాగార్జున అలా చేయడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ అంటేనే రోస్ట్. అది లేకపోతే వేస్ట్'' అని షాకింగ్ గా రివ్యూ ఇచ్చింది ఈ చిరుత.

  ఇనయా సుల్తానాకు స్వీట్ వార్నింగ్..

  ఇనయా సుల్తానాకు స్వీట్ వార్నింగ్..

  ఇక బిగ్ బాస్ తెలుగు 6 తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఆర్జే సూర్య మరదలు, అబ్దుల్ రెహమాన్ కూతురు ఇనయా సుల్తానాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఆర్జే సూర్యతో ఇనయా చేసే రొమాన్స్ అంతా ఇంతా కాదు. మనుషులపై కాన్సంట్రేషన్ తో గేమ్ వదిలేశావ్. గేమ్ పరంగా ఒకప్పుడు గుడ్.. ఇప్పుడు డెడ్.. అని చెప్పాడు నాగార్జున. అది మార్చుకుని మళ్లీ గేమ్ ఆడాలని సలహా ఇచ్చాడు. దీంతో కచ్చితంగా గేమ్ పైనే ఫోకస్ చేస్తానని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది.

  బిగ్ బాస్ వంటలక్క సుదీప ఎలిమినేట్..

  బిగ్ బాస్ వంటలక్క సుదీప ఎలిమినేట్..

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా వారిలో నుంచి ఇప్పటివరకు ఐదు వారాల్లో ఐదుగురు వెళ్లిపోయారు. అక్టోబర్ 16 ఆదివారం అంటే ఇవాళ మరొక కంటెస్టెంట్ వెళ్లనున్నారు. ఈ ఆరో వారం చైల్డ్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ వంటలక్క సుదీప పింకీ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.

  English summary
  Bigg Boss Telugu 6 Season Contestant Geetu Royal Shocking Comments On Host Nagarjuna In Her Review Videos And Nagarjuna Gives Warning To Inaya Sultana.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X