For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ ఫైనల్ వీక్ డే 1: తీన్ మార్ డాన్సులు, సిల్లీ గొడవలు, ఏడిపించడాలు...

  By Bojja Kumar
  |
  Bigg Boss Telugu Final Week : Archana irritating housemates నస ఆపని అర్చన

  తెలుగు టెలివిజన్ రంగంలో సంచలన రేటింగ్ సాధిస్తూ సూపర్ సక్సెస్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకున్న 'బిగ్ బాస్' చివరి దశకు చేరుకుంది. సోమవారంతో బిగ్ బాస్ రియాల్టీ షో చివరి వారంలోకి ఎంటరైంది. వచ్చే ఆదివారంతో షో ముగియనున్న సంగతి తెలిసిందే.

  9 వారాల పాటు పోటా పోటీగా జరిగిన షోలో..... ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటూ హరితేజ, శివ బాలాజీ, ఆదర్శ్, అర్చన, నవదీప్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో బిగ్ బాస్ తొలి సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

  తీన్ మార్ బ్యాండ్ తో నిద్రలేపి....

  తీన్ మార్ బ్యాండ్ తో నిద్రలేపి....

  బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ వరకు చేరుకున్న ఇంటి సభ్యులను బిగ్ బాస్ అభినందించారు. ఇంట్లోకి ప్రత్యేకంగా ఓ బ్యాండ్ ట్రూప్‌ను పంపి తీన్ మార్ చప్పుళ్లతో ఇంటి సభ్యులను నిద్రలేపారు. ఈ చివరి వారంలో ఇంటి సభ్యులకు ఎన్నో మధురానుభూతులు దక్కాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులను విష్ చేశారు.

  తీన్ మార్ డాన్సులు వేసిన నవదీప్, హరితేజ

  తీన్ మార్ డాన్సులు వేసిన నవదీప్, హరితేజ

  చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ ఇంట్లో బ్యాండ్ ట్రూప్ రాకతో ఇంటి సభ్యులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు. వారు వాయిస్తుంటే హరితేజ, నవదీప్ కొంతసేపు తీన్ మార్ స్టెప్పులు వేశారు.

  నస ఆపని అర్చన

  నస ఆపని అర్చన

  ముందు నుండీ నస పెట్టేరకం అని పేరు తెచ్చుకున్న అర్చన.... ఇప్పటికీ నస ఆపలేదు. దీక్ష ఎలిమినేట్ అయ్యే సమయంలో తనపై చేసిన డిస్‌గస్టింగ్ ఆరోపణలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఇంటి సభ్యులకు నస పెట్టింది.

  విసుగు తెప్పించిన అర్చన

  విసుగు తెప్పించిన అర్చన

  బయటకు వెళ్లిన వారి గురించి అనవసర చర్చ.... వాళ్లతో బిగ్ బాస్ కావాలనే అలా చేయిస్తారు అంటూ ఇంటి సభ్యులు ఎంత వారించినా అర్చన వాగుడు ఆగలేదు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి విసుగు తెప్పించింది.

  టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్న హరితేజ, శివ బాలాజీ

  టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్న హరితేజ, శివ బాలాజీ

  సోమవారం అంతా ఎలాంటి టాస్కులు లేకుండా గడిపిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు.... ఏమీ తోచక తమలో తామే సిల్లీ సిల్లీగా గొడవలు పడ్డారు. హరితేజ, శివ బాలాజీ టామ్ అండ్ జెర్రీల్లా సరదాగా ఫైట్ చేసుకున్నారు.

  ఇలా బండలా ఎలా ఉన్నావ్ శివ..

  ఇలా బండలా ఎలా ఉన్నావ్ శివ..

  శివ బాలాజీ లాంటి బండ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాడికి .... మధు లాంటి సన్నిత మనస్కురాలు ఎలా దొరికింది అంటూ అర్చన ఫన్నీ కామెంట్ చేసింది. ఇలా సరదా సరదాగా ఫైనల్ వీక్ తొలి రోజు సాగింది.

  ఎలిమినేషన్ నామినేషన్లు ఉండవు, ఓటింగ్

  ఎలిమినేషన్ నామినేషన్లు ఉండవు, ఓటింగ్

  ఈ వారం నిష్క్రమణ కోసం నామినేసన్ ప్రక్రియ ఉండదు అని ప్రకటించిన బిగ్ బాస్ అభిమానులకు, ప్రేక్షకులకు ఓట్ అప్పీల్ చేసుకోవాల్సిందిగా సూచించారు. వినూత్నంగా, వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఓటు అప్పీల్ చేసుకోవాలని కోరారు. ఎవరికి నచ్చినట్లు వారు ప్రేక్షకులకు ఓట్ అప్పీల్ చేశారు.

  ఐస్ క్రీమ్ కావాలంటూ ఫన్నీ రిక్వెస్ట్

  ఐస్ క్రీమ్ కావాలంటూ ఫన్నీ రిక్వెస్ట్

  ఫైనల్ వీక్ లో కెప్టెన్ అయిన అర్చనను ఇంటి సభ్యులు ఐస్ క్రీమ్ తెప్పించాలని కోరారు. ఆమె కెమెరా ముందుకెళ్లి బిగ్ బాస్ కు ఐస్ క్రీమ్ కావాలంటూ సింపుల్ గా కోరింది. అలా అడిగితే బిగ్ బాస్ ఐస్ క్రీమ్ ఇవ్వడు అంటూ.... నవదీప్, హరితేజ, ఆదర్శ్ కలిసి ఫన్నీగా రిక్వెస్ట్ చేశారు.

  వల్గర్ ఫెల్లో

  వల్గర్ ఫెల్లో

  అర్చనను సరదాగా ఏడిపించే క్రమంలో నవదీప్ ఓ డబుల్ మీనింగ్ కామెంట్ చేశాడు. దీంతో అతన్ని అర్చన వల్గర్ ఫెల్లో, వల్గర్ మౌత్ అంటూ సరదాగా తిట్టింది.

  జాంబీ దెయ్యల్లా ... అర్చనను ఏడిపించారు

  జాంబీ దెయ్యల్లా ... అర్చనను ఏడిపించారు

  ఫైనల్ వీక్ తొలి రోజు అంతా పెద్దగా సీరియస్ గొడవల్లాంటివేమీ లేకుండా సింపుల్ గా సాగింది. ఇంటి సభ్యులు తమ ఫోకస్ అంతా అర్చనను ఏడిపించడంపైనే పెట్టారు. రాత్రి లైట్లు ఆర్పాక శివ, ఆదర్వ్ జాంబీ దెయ్యాల్లా అర్చనను సరదాగా ఏడిపించే ప్రయత్నం చేశారు.

  English summary
  Bigg boss Telugu show enter into Last Week. As the housemates enter the final week of the season, Bigg Boss asks them to request the audience to vote for them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X