ఫ్యామిలీ జోలికి రావొద్దు.. బిగ్ బాస్ రివ్యూయర్ పై సంజన టీం వార్నింగ్

బుల్లి తెర ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ అందిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నడూ చూడని, ఎప్పుడు ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దిమ్మతిరిగే షాక్ లతో షో రసవత్తరంగా సాగుతోంది. అయితే.. షోలో ఎవరు ఊహించిన విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ డ్రామా చోటు చేసుకుంది. సడెన్ గా సంజనను హౌస్ నుండి బయటికి పంపించారు. ఆమె సీక్రెట్ రూమ్ లో పెట్టి, శనివారం ఎపిసోడ్ లో స్టేజి పైకి తీసుకురావడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ కంటెస్టెంట్ల త్యాగాలతో మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. సంజన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వార్నింగ్ లెటర్ కనిపించింది. ఇంతకీ ఆ లెటర్ ఏంటీ? అసలేం జరిగింది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై మరింత క్యూరియసిటీ పెరిగింది. ఎవరూ ఊహించిన విధంగా అర్థరాత్రి మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. కంటెస్టెంట్ల నిర్ణయం ప్రకారం సంజనా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ షో నుంచి వెళ్లిపోతుందని అందరూ భావించారు. కానీ, శనివారం షోలో బిగ్ బాస్ ఊహించని సర్రైజ్ ఇచ్చారు. సంజన హౌస్ లో ఉండాలంటే.. త్యాగాలు చేయాలని కోరారు. దీంతో నలుగురు కంటెస్టెంట్లు అసాధారణ త్యాగాలతో మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేలా చేశారు. సంజన కోసం కెప్టెన్సీని త్యాగం చేయాలని కోరగా.. మరో మారు ఆలోచించకుండా ఇమ్మాన్యుయెల్ తన కెప్టెన్సీని త్యాగం చేశారు. "తనకు సంజనా మా అమ్మలా అనిపించింది" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Bigg Boss telugu Sanjana PR Team Slams Adi Reddy Over Inappropriate Remarks

సంజనా కోసం తనూజ తనకు ఇష్టమైన కాఫీని త్యాగం చేసింది. దీంతో 50% బ్యాటరీ ఫిల్ అయ్యింది. శ్రీజ డ్రెస్‌లను త్యాగం చేయమని నాగ్ సార్ అడిగగా నో చెప్పింది. తరువాత రీతూ చౌదరీ ఎవరూ ఊహించని త్యాగం చేసింది. తన ఫ్రెండ్ సంజన కోసం ఏకంగా జుట్టు కత్తిరించుకుంటుంది. దీంతో 75% బ్యాటరీ ఫిల్ అయ్యింది. సంజనా హౌస్‌లోకి రావాలంటే.. ఇంకా 25 శాతం బ్యాటరీ కావాలి. ఈ క్రమంలో ఇక సుమన్ శెట్టి సిగరెట్ మానేయమని చెప్పగా, ఆయన నో చెప్పాడు. కానీ, ఎవరూ ఊహించిన విధంగా భరణి తనకు ఇష్టమైన లాకెట్‌ను త్యాగం చేశారు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలో ఆ లాకెట్ కోసం షో వదులుకోవడానికి సిద్ధమయ్యానని, ఇప్పుడు సంజనా కోసం త్యాగం చేయడం ఆయన ప్రత్యేకమైన ప్రేమాభిమానాన్ని చూపిస్తుంది. ఇలా నలుగురు కంటెస్టెంట్ల త్యాగాల ద్వారా సంజనా మళ్లీ బిగ్ బాస్ 9 హౌస్‌లోకి చేర్చబడింది. దీంతో హౌస్‌లో ఎమోషనల్ బ్లాస్ట్ జరిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా సంజన ఇస్టా గ్రామ్ లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి పై సంజన టీమ్ ఫైర్ అయింది. అసలేం జరిగిందంటే... ? బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా పాపులారిటీ సాధించిన కామన్ మ్యాన్ ఆది రెడ్డి, తన ఆట, మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు. ఫైనల్ వరకు పోటీ చేసి ప్రేక్షకులందన్నీ ఆశ్చర్యపరిచాడు. షో తర్వాత కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుతూ పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతానికి, టీవీ షోల్లో, సినిమాలపై తన అభిప్రాయాలను పంచుతూ సందడి చేస్తున్నారు.

తాజా బిగ్ బాస్ సీజన్ పై కూడా ఆది రెడ్డి తనదైన స్టైల్ రివ్యూలు ఇస్తున్నారు. ఆ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు చేసినట్టు ఆమె పీఆర్ టీం ఓ బహిరంగ ప్రకటన వెల్లడించింది. ప్రతి కంటెస్టెంట్ తన ప్రత్యేక శైలి లో గేమ్ ఆడే హక్కును కలిగి ఉందనీ, అయితే, యూట్యూబర్ ఆది రెడ్డి తన వీడియోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన అభిమానులు, కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపించింది.

సంజన పీఆర్ టీం ప్రకారం.. సంజన, ఆమె కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అది వారి హక్కులను ఉల్లంఘించడం అని పేర్కొన్నారు. షోలో సంజన ఇతరుల పట్ల సానుభూతి, సహనాన్ని చూపిస్తూ, ఇతర కంటెస్టెంట్లతో ప్రేమ పూర్వకంగా ఉంటుందనీ తెలిపారు. ప్రత్యేకంగా షోలో క్యాప్టెన్సీ సమయంలో చూపిన ఆత్మవిశ్వాసం, సహనంతో ఆమె మరింత గుర్తింపు సంపాదించుకుందని పేర్కొన్నారు. అలాంటి కంటెస్టెంట్ పై వ్యక్తిగతంగా, ఆమె ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని వార్నింగ్ ఇచ్చింది సంజన టీం. ఎలాంటి పరిస్థితిలోనైనా సంజన గల్రాణి లేదా ఆమె కుటుంబాన్ని కలపడం, అవమానించేలా వ్యాఖ్యలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో సంజనకు ఫ్యాన్స్ సపోర్టుగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg bos sanjana adireddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X