For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాలిటిక్స్‌లోకి తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్.. యూపీలో చక్రం తిప్పునున్న మాజీ మిస్ ఏపీ

  By Manoj
  |

  తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌బాస్' ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో అయితే విజయవంతం అయింది కానీ, అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకు మాత్రం అంతగా ఆఫర్లు దక్కించలేకపోయింది. ఇదే షో కొందరిలో నిరుత్సాహాన్ని మిగల్చగా, మరికొందరిని మాత్రం ప్రేక్షకుల ముందు హీరోలను చేసింది. ఇప్పటికే జరిగిన మూడు సీజన్లలో విజయం సాధించకున్నా.. ప్రేక్షకుల మనసు గెలుచుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హైదరాబాద్‌కు చెందిన టాలీవుడ్ హీరోయిన్ నందినీ రాయ్ ఒకరు. ఆమె తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏ పార్టీలో చేరారు.? అనే కదా మీ సందేహం. పూర్తి వివరాల్లోకి వెళితే..

  మన హైదరాబాదీ అమ్మాయే

  మన హైదరాబాదీ అమ్మాయే

  నందినీ రాయ్ హైదరాబాదులోని సింధీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం కూడా నగరంలోనే పూర్తి చేసింది. అయితే, ఎంబీఏ మాత్రం లండన్‌లో కంప్లీట్ చేసింది. హైదరాబాద్‌లో సాదాసీదా అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంటోంది.

  మిస్ ఏపీ పోటీల్లో విజయం

  మిస్ ఏపీ పోటీల్లో విజయం

  చదువు పూర్తయిన తర్వాత నందినీ.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి అవార్డులు దక్కించుకుంది. ఆ తర్వాత దాదాపు వంద వరకు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించింది.

  ఫస్ట్ టాలీవుడ్‌లోకి రాలేదు

  ఫస్ట్ టాలీవుడ్‌లోకి రాలేదు

  నందినీ రాయ్ మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో, ఆమె బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. దీని తర్వాత తెలుగులో అవకాశం దక్కించుకుంది. మొదట్లో ఆమె పలు చిత్రాల్లో నటించినా.. ‘మాయ', ‘మోసగాళ్లకు మోసగాడు' మంచి పేరును తీసుకొచ్చాయి.

  నాటకీయంగా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

  నాటకీయంగా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

  నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్' సీజన్ -2లో నందనీ రాయ్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, ఆమె ఎంట్రీ మాత్రం నాటకీయంగా జరిగింది. వాస్తవానికి ఆమె అందరితో పాటే హౌస్‌లోకి వెళ్లాల్సి ఉన్నా యాక్సిడెంట్ అవడంతో ఓ వారం తర్వాత ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మెతక వైఖరితో చాలా మందికి నచ్చింది. అయితే, చివరి వరకూ అక్కడ ఉండే ఛాన్స్ మాత్రం రాలేదు.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  రాజకీయాల్లోకి నందినీ రాయ్

  రాజకీయాల్లోకి నందినీ రాయ్

  ‘బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఈమెకు ఆఫర్లు వస్తాయని చాలా మంది అనుకున్నారు. కానీ, తెలుగులో ‘సిల్లీ ఫెలోస్', ‘శివరంజని' మినహా మరే సినిమాలోనూ నటించలేదు. అయితే, తాజాగా ఆమె బాలీవుడ్ ఆఫర్ పట్టేసింది. కొత్త దర్శకుడు హుస్సేన్ తెరకెక్కిస్తున్న ‘నందీ' అనే సినిమా ద్వారా ఆమె బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపించనుందని సమాచారం.

  English summary
  Nandini Rai, formerly known as Neelam Gouhrani, is a Tollywood film actress, model and the winner of the Miss Andhra Pradesh title of 2010. After modelling, she went to pursue a career in acting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X