Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss: మిడ్‌నైట్ రెచ్చిపోయిన ఆ కంటెస్టెంట్లు.. చుట్టూ కెమెరాలు ఉన్నా ముద్దులు పెట్టుకుంటూ!
సరికొత్త కాన్సెప్టుతో వచ్చినా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని మరీ ప్రసారం అవుతోన్న ఏకైక షో బిగ్ బాస్. బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ రకరకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ సాగిపోతోందీ షో. అందుకే తెలుగులో ఇది ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లు రెస్పాన్స్‌ను అందుకుంటూ సూపర్ హిట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని నిర్వహకులు ముందుగానే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే రకరకాల ఆసక్తికరమైన సన్నివేశాలను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ఏకంగా మిడ్‌నైట్ ముద్దులు పెట్టుకుని షాకిచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఆరంభంలోనే అదుర్స్ అనిపిస్తున్నారు
తెలుగులో ప్రసారం అయిన నాలుగు సీజన్లు రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో దాన్ని నిర్వహకులు వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో పాత వాటిని మరిపించేలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులు, గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ వంటి వాటితో మరింత మజాను పంచుతూ వెళ్తోంది. ఈ కారణంగానే ప్రారంభ ఎపిసోడ్‌కు ఏకంగా 18 రేటింగ్ వచ్చి మరో రికార్డు సొంతం అయింది.
నాగబాబుకు నెటిజన్ సూటి ప్రశ్న: నేను అవి చూస్తే సమాజం ఒప్పుకుంటుందా.. ఆమెను లాగుతూ ఊహించని రిప్లై!

లవ్ బర్డ్స్ ఎవరు అవుతారన్న ఆసక్తితో
బిగ్ బాస్ షో సక్సెస్ అవడానికి అందులో చూపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో ఎవరు జంటలుగా మారతారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ముందుకు వెళ్తున్నారు.

ఎక్కువగా అలాంటివే.. కొంటె చూపులు
చుట్టూ వందల కెమెరాలు ఉన్నా.. చాలా మంది తమలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటకు తీసి మరీ ప్రేమలను వ్యక్త పరచుకుంటూ ఉంటారు. ఇక, ఐదో సీజన్‌లో ఇప్పటికే పలువురిని జంటలుగా చూపించారు. అలాగే, రొమాంటిక్‌గా ఉండే టాస్కులు సైతం ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి హౌస్‌లో రెండు మూడు జంటలు ఉన్నట్లు హైలైట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్లు తరచూ హగ్గులిస్తూ, కొంటెగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. అయితే, ఉన్న జంటల్లో బిగ్ బాస్ షోకు కావాల్సిన కంటెంట్‌ను మాత్రం ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు.
మహేశ్ బాబు కోసం రాజమౌళి డేరింగ్ స్టెప్: స్టోరీ విషయంలో ప్లాన్ మార్చేసి.. స్వయంగా రంగంలోకి!

వాళ్లిద్దరినే ఫోకన్ చేసి... తగ్గట్లుగా చేస్తూ
ఐదో సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మేల్ కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ కుర్రాడు.. బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. అలాగే, ఇటీవలే ఈ జంట రొమాంటిక్ డ్యాన్స్‌తో అలరించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు అర్థమైంది.

లంచ్‌కు సిరి... డిన్నర్‌కు హమీదా అని
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో స్పెషల్ షో జరిగింది. ఇందులో వీజే సన్నీ యాంకర్‌గా వ్యవహరిస్తూ.. శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలోనే అతడిని హౌస్‌లోకి కంటెస్టెంట్లు వింత వింత ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలోనే కాజల్ మైక్ తీసుకుని సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికి శ్రీరామ్ ఎంతో తెలివిగా.. 'లంచ్‌కు సిరి, డిన్నర్‌కు హమీదాను ఎంచుకుంటా' అని సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సన్నీ 'మరి టిఫిన్స్‌కు ఎవరూ లేరా' అంటూ శ్రీరామ్‌కు అదిరిపోయే పంచ్ విసిరాడు.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

హమీదాతోనే డేటింగ్... ఎత్తుకుని మరీ
ఇదే ఇంటర్వ్యూలో గుండెల్లో ఏ అమ్మాయైనా ఉందా? అని ప్రియ ప్రశ్నించింది. దీనికి శ్రీరామ్ 'గుండెల నిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా' అంటూ ఆమె పేరు వచ్చేలానే 'ఓ ప్రియా.. ప్రియా' అనే పాటందుకున్నాడు. అలాగే, ఇక్కడున్న వారిలో ఎవరిని కోరుకుంటావు అంటే సిరి కమిటెడ్ కాకపోతే ఆమెనే అంటూ బదులిచ్చాడు. ఇక, చివర్లో 'ఇక్కడ డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తావు' అన్న ప్రశ్నకు టక్కున హమీదా పేరు చెప్పాడు శ్రీరామ్. అంతేకాదు, ఆ తర్వాత ఆమెను ఎత్తుకుని మరీ రొమాంటిక్ డ్యాన్స్ చేసేశాడు.

చుట్టూ కెమెరాలున్నా ముద్దులు పెట్టి
అంతకు ముందు అర్ధరాత్రి సమయంలో శ్రీరామ్ గిటార్ వాయించగా పక్కనే ఉండి హమీదా ఎంతో మురిసిపోయింది. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో రొమాంటిక్‌గా కనిపించారు. అదే సమయంలో ఇద్దరూ తమ మనసులోని భావాలను కళ్లతోనే వ్యక్త పరచుకున్నారు. ఆ తర్వాత పడుకోడానికి బెడ్‌ల దగ్గరకు వెళ్లారు. అప్పుడు శ్రీరామ్ ఆమెకు ఏవో సైగలు చేశాడు. అందుకు అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందించింది. ఆ తర్వాత ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చుకుని ఎవరి బెడ్‌లో వాళ్లు పడుకున్నారు. చుట్టూ కెమెరాలున్నా ఇలా చేయడంతో వీళ్ల మధ్య ప్రేమ ఉందని అంతా అనుకుంటున్నారు.