For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

  |

  తెలుగులో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అయితే, ప్రేక్షకులకు అసలే మాత్రం పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా.. అప్పటి వరకూ ఉన్న రికార్డులను చెరిపేసిన ఏకైక షో బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ షో.. తెలుగులో మాత్రం ఐదేళ్ల క్రితమే వచ్చింది. ఆరంభం నుంచి ఇక్కడ అదిరిపోయే స్పందనను అందుకుంది. ఫలితంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఒకదానికి మించి ఒకటి ప్రేక్షకాదరణను అందుకుంది. తద్వారా జాతీయ స్థాయిలో టెలివిజన్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వగా.. వాళ్లలో ఒక ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ కూడా ఉన్నారు. తాజాగా ఆమె ఓ కంటెస్టెంట్‌పై రొమాంటిక్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   లవ్ ట్రాకులకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ

  లవ్ ట్రాకులకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ

  అన్ని భాషల్లో బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ అవడానికి అందులో జరిగే వ్యవహారాలే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ షోలో తరచూ ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో పలువురు కంటెస్టెంట్ల మధ్య ట్రాకులు కూడా నడుస్తుంటాయి. బయట అస్సలు పరిచయం లేని కంటెస్టెంట్లు హౌస్‌లో మాత్రం లవ్ ట్రాకులు నడుపుతున్నట్లు కనిపిస్తారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో షో నిర్వహకులు సైతం లవ్ ట్రాకులనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. తద్వారా వీటిని హైలైట్ చేసి మరీ చూపిస్తుంటారు.

  సర్‌ప్రైజ్ చేసిన సుడిగాలి సుధీర్ కవల సోదరుడు: అచ్చం ఇద్దరూ ఒకేలా ఉండడంతో అంతా షాక్!

   ఇప్పటికే ఎంతో మంది జంటలుగా మారి

  ఇప్పటికే ఎంతో మంది జంటలుగా మారి

  తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. వీటన్నింటిలోనూ లవ్ ట్రాకులు కనిపించాయి. కంటెస్టెంట్లు కొంచెం క్లోజ్‌గా మాట్లాడుకుంటే వాటిని షో నిర్వహకులు హైలైట్ చేసి చూపిస్తుంటారు. దీంతో వాళ్లపైనే అందరి దృష్టి పడిపోతోంది. ఇలా మొదటి సీజన్‌లో ప్రిన్స్.. దీక్షా పంత్, రెండో సీజన్‌లో తేజస్వీ మదివాడ.. సామ్రాట్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్.. పునర్నవి భూపాలం, నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ సహా ఎంతో మంది ప్రేమికులుగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇప్పటికీ ఆయా జంటలను ప్రేక్షకులు అదే కోణంలో చూస్తున్నారు ప్రేక్షకులు.

  అంగరంగ వైభవంగా మొదలైన 5 సీజన్

  అంగరంగ వైభవంగా మొదలైన 5 సీజన్

  సూపర్ డూపర్ హిట్ అయిన షో కాబట్టి.. బిగ్ బాస్ అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అందులోనూ నాలుగు సీజన్లను నేషనల్ రేంజ్‌లో సక్సెస్‌గా మార్చుకున్న దీనికి అభిమానులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఐదో సీజన్ గత ఆదివారం (సెప్టెంబర్ 5) అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సారథ్యంలో ఎంతో సందడిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.

  Bigg Boss Telugu 5: హౌస్‌లో రెచ్చిపోయిన యాంకర్ రవి.. అతడి మాటలకు బోరున ఏడ్చేసిన కంటెస్టెంట్

  జబర్దస్త్ ప్రియాంక.. స్పెషల్ అట్రాక్షన్‌గా

  జబర్దస్త్ ప్రియాంక.. స్పెషల్ అట్రాక్షన్‌గా

  బిగ్ బాస్ షోలో రెండేళ్ల నుంచి ప్రతి సీజన్‌లోనూ ఓ స్పెషల్ కంటెస్టెంట్‌ను తీసుకుని వస్తున్నారు. మూడో సీజన్‌లో ట్రాన్స్‌జెండర్ తమన్నా.. నాలుగో సీజన్‌లో వృద్ధురాలు గంగవ్వలు ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు ఐదో సీజన్‌లో మరో ట్రాన్స్‌జెండర్ జబర్ధస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్‌ను తీసుకుని వచ్చారు. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఆడవాళ్లు 9 మంది, మగవాళ్లు 9 మంది ఉన్నారు. తద్వారా తమ దృష్టిలో అందరూ సమానమే అని చాటి చెప్పారు. ఇక, ఈ సీజన్‌లో ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

  అందంతో పాటు ఆదర్శంగా మాట్లాడుతూ

  అందంతో పాటు ఆదర్శంగా మాట్లాడుతూ

  జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్నాడు సాయితేజ. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సమయంలోనే ఎంతో ఆదర్శవంతంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారామె. అంతేకాదు, ఆట విషయంలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక, నామినేషన్స్ సమయంలో ప్రియాంక ఎంతో క్లారిటీగా మాట్లాడింది.

  షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!

  ప్రియాంక కామెంట్స్.. షోలో వింత ట్రాక్

  ప్రియాంక కామెంట్స్.. షోలో వింత ట్రాక్

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్‌ మొదటి రోజు నుంచే హైలైట్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మేల్ కంటెస్టెంట్లను అన్నయ్య అనో, తమ్ముడు అనో పిలిస్తోన్న ఆమె.. ఒకరిని మాత్రం పేరు పెట్టే పిలుస్తోంది. దీని గురించి చర్చ జరగడంతో వింత ట్రాక్ పుట్టిందంటూ ప్రచారం మొదలైంది.

  Recommended Video

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
  అందరి ముందే ఆ మాటను చెప్పడంతో

  అందరి ముందే ఆ మాటను చెప్పడంతో

  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అందరూ ప్రియాంక సింగ్‌ను చుట్టుముట్టి పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే యాంకర్ రవి 'నువ్వు నన్ను అన్నయ్య అంటున్నావు. మిగతా వాళ్లను కూడా బ్రదర్ అనే పిలుస్తున్నావు. మరి మానస్‌ను మాత్రం ఎందుకు అలా పిలవట్లేదు' అని ప్రశ్నించాడు. దీనికి ప్రియాంక 'నేను ఆయనను అలా పిలవను. తను నాకు బ్రదర్ లాంటోడు కాదు' అని సమాధానం ఇచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇద్దరూ సిగ్గు పడిపోయారు. ఆ సమయంలో 'ఎటో వెళ్లిపోయింది మానసు' అంటూ పాట పాడి కాసేపు ఇద్దరినీ ఏడిపించారు. దీంతో ఇదంతా సరదాగా సాగింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Priyanka Singh Did Shocking Comments on Maanas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X