For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: సిరి హన్మంతు నుంచి యాంకర్ రవి వరకు 19 మంది.. బోల్ల్.. బూతు రాణి ఎవరో తెలుసా?

  |

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాగార్జున్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. వేదికపైకి వచ్చిన అక్కినేని నాగార్జునకు గ్రాండ్‌గా బిగ్‌బాస్ స్వాగతం పలికారు. నాగార్జునలోని ఉత్సాహాన్ని గమనించిన బిగ్‌బాస్ ప్రశంసలు గుప్పించారు. వేదికపైన నాగార్జున, బిగ్‌బాస్ మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందంటే..

  19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి..

  19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి..

  బిగ్‌బాస్ తెలుగు 5లోకి యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవి అసలు పేరు రవికిరణ్. మాస్టర్ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేసి రచ్చ చేశాడు. ఈ స్టార్ యాంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్ లాంటి షోలతో మరింత ఆకట్టుకొన్నారు. బుల్లితెరపై యాంకర్‌గా ఇప్పటికే ఎంతో మంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక బిగ్‌బాస్‌లో తన మార్కు టాలెంట్‌ను ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు. తెలుగు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అయితే యాంకర్ లాస్యతో పెళ్లి విషయం వివాదంగా మారింది. అలాగే శ్రీముఖితో అఫైర్ అంటూ రూమర్లు క్రియేట్ కావడం వల్ల వార్తల్లోకి ఎక్కారు. తాజాగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

  దేత్తడి పోచమ్మ గుడి అంటూ...

  దేత్తడి పోచమ్మ గుడి అంటూ...

  బిగ్‌బాస్ తెలుగు 5లోకి హీరోయిన్ శ్వేతా వర్మ 18వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. పనిలేని పులి రాజు, సైకిల్, పచ్చీస్, ముగ్గురు మొనగాళ్లు, ది రోజ్ విల్లా తెలుగు చిత్రంలోను, అలాగే బింది బజార్, లాల్క పాగ్ చిత్రాల్లో నటించారు. అయితే ఎవరైనా తనను రెచ్చగొడితే దేత్తడి పోచమ్మ గుడి చేసేస్తా.. నాతో మంచిగా ఉంటే ప్రేమను పంచుతాను అంటూ చెప్పారు. ఇంటిలోకి వెళ్లిన శ్వేతా వర్మ అందరితో కలిసి రచ్చ చేశారు.

  నాగ్‌తో ఐ లవ్ యూ చెప్పించుకొని

  నాగ్‌తో ఐ లవ్ యూ చెప్పించుకొని

  బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలోకి ఆర్జే కాజల్ 17వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినీ జర్నలిస్టుగా, యూట్యూబర్‌గా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు. ఆమె తొలి ఇంటర్వ్యూ డాన్ సినిమా కోసం నాగార్జునను ఇంటర్వ్యూ చేశారు.

  ఓ ఇంటర్వ్యూ సమయంలో నాగార్జున రేడియో ఐలవ్ చెబితే.. నాకే చెప్పారని అనుకొన్నారు. అయితే బిగ్‌బాస్ నుంచి వెళ్లేవరకు కంటెస్టెంట్లతోనే కాకుండా నాగార్జునతో ఐ లవ్ యూ చెప్పించుకొనేలా చేస్తాను అంటే.. వెంటనే నాగార్జున ఐ లవ్ యూ చెప్పించుకొన్నారు.

  పవన్ కల్యాణ్ పాటలతో మానస్ రచ్చ

  పవన్ కల్యాణ్ పాటలతో మానస్ రచ్చ

  మానస్ నాగులపల్లి బాలనటుడిగా, హీరోగా, విలన్‌గా తెలుగు సినిమాల్లోను, టెలివిజన్ రంగంలోను రాణిస్తున్నారు. బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రంలో బాలనటుడిగా నటించిన మానస్ 2001లో నంది అవార్డు గెలుచుకొన్నారు. ఝలక్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడా? గోలీసోడా చిత్రాల్లో నటించాడు. టెలివిజన్ రంగంలో పితృదేవో భవ, భలే ఛాన్సులే సీరియల్స్, షోలలో నటించాడు.

  కే రాఘవేంద్రరావు రూపొందించిన కోకిలమ్మ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. ఆ తర్వాత ప్రభాకర్, ప్రియాంక నాయుడు నటించిన దీపారాధన సీరియల్ మరింత పేరు తెచ్చిపెట్టింది. పవన్ కల్యాణ్ పాటలతో బిగ్‌బాస్ వేదికపై రచ్చ చేసి ఇంటిలోకి అడుగుపెట్టాడు.

  13వ కంటెస్టెంట్‌గా బోల్డ్ అండ్ బూతుల బ్యూటీ..

  13వ కంటెస్టెంట్‌గా బోల్డ్ అండ్ బూతుల బ్యూటీ..

  బిగ్‌బాస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా సరయు రాయ్ ప్రవేశించారు. తొలి పరిచయం, కార్పోల్, గ్యాంగస్టర్, ఎక్ట్ర్‌టా చిత్రాల్లో నటించారు. నోరు తెరిస్తే బూతులతో రఫాడిస్తుంది. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. హెల్త్ పరమైన సమస్యలకు పరిష్కారం ఇస్తారు. ఇక బూతులతో బిగ్‌బాస్ షోను ఎలా రక్తికట్టిస్తుందో వేచి చూడాల్సిందే.

  14వ కంటెస్టెంట్ యాక్టర్ విశ్వ..

  14వ కంటెస్టెంట్ యాక్టర్ విశ్వ..

  టెలివిజన్ నటుడిగా విశ్వ అందరికి సుపరిచితులు. నాగార్జున నిర్మాతగా రూపొందించిన యువ సీరియల్, గంగతో రాంబాబు, గంగ మంగ సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందారు. డ్యాన్స్ జోడి డ్యాన్స్, ఇతర షోలతో తన ప్రతిభను చాటుకొన్నారు. నటుడే కాకుండా ఫిట్‌నెస్‌ అంటే చాలా ఇష్టపడుతాడు. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టే అందాన్ని సొంతం చేసుకొన్నాడు.

  సినిమా పరిశ్రమలో పలువురు హీరోలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. యువ సినిమా, అఖిల్ మొదటి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బిగ్‌బాస్‌తో మీతో ప్రయాణం చేస్తున్నాను. మీ వల్లనే నేను ఇంత అయ్యాను అంటూ విశ్వ ఎమోషనల్ అయ్యాడు.

  11వ కంటెస్టెంట్‌గా హమీదా..

  11వ కంటెస్టెంట్‌గా హమీదా..

  2015లో హమీదా నటిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. సాహసం చేయరా డింభకా చిత్రంతో హీరోయిన్‌గా కనిపించారు. వేదికపైకి వచ్చిన నాగార్జునకు మగవాడిలో మీకు ఏది ఇష్టం అంటే.. పురుషుల్లో వాళ్ల కళ్లను ఎక్కువగా ఇష్టపడుతాను అంటూ చెప్పారు. దాంతో ఆమెకు ఓ బోర్డుపై కళ్లను చూపిస్తూ ఎవరి కళ్లు ఇష్టమంటే.. ఓ బొమ్మను చూపించింది. అయితే ఆ కళ్లు ఉన్న వ్యక్తి షోలోకు వస్తాడు.. అతడిని మీరు ఇష్టపడుతారా? అంటూ నాగార్జున ఇంటిలోకి పంపించారు.

  ట్రాన్స్ జెండర్‌‌ ప్రియాంక షోలోకి

  ట్రాన్స్ జెండర్‌‌ ప్రియాంక షోలోకి

  బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలోకి జబర్దస్త్ ప్రియాంక తొమ్మిదొ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. నాగ్‌తో మాట్లాడుతూ.. నేను గ్రీక్ వీరుడు సినిమా షూటింగ్ సమయంలో అబ్బాయిగా కలిశాను. ఇప్పుడు అమ్మాయిగా మారి మీ ముందు ఉన్నాను. అబ్బాయిగా అద్దంలో చూసుకొంటే అబద్దం అనిపించేది.

  అందుకే అమ్మాయిగా మారిపోయాను అని ప్రియాంక చెప్పారు. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం. పోరాడుతాను అని ప్రియాంక చెప్పారు. అబ్బాయిగా సాయి తేజ నుంచి అమ్మాయిగా ప్రియాంకగా మారిన విషయం తన తండ్రికి తెలియదు. అంధుడైన తన తండ్రి బీబీ సింగ్‌కు తన జెండర్ మార్పు విషయం బిగ్‌బాస్ షో ద్వారా తెలియజేస్తున్నాను అని ప్రియాంక చెప్పారు.

  కార్తీకదీపం ఫేమ్ ఉమా.. అర్ధపావు భాగ్యం..

  కార్తీకదీపం ఫేమ్ ఉమా.. అర్ధపావు భాగ్యం..

  బిగ్‌బాస్ తెలుగు 5లోకి కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి 15వ కంటెస్టెంట్‌గా ప్రవేశించారు. కార్తీకదీపంలో అర్దపావు భాగ్యంగా అందరికి తెలుసు. జీవితంలో భార్తతో సపరేట్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఈమె అసలు పేరు అప్పాల మారియా. తాను ఓపెన్‌గా మాట్లాడుతాను. సీరియల్స్‌లోనే నేను విలన్.. నిజ జీవితంలో నేను చాలా కూల్.. నాకు నా ఇద్దరు పిల్లలంటే చాలా ప్రాణం అని ఉమాదేవి చెప్పారు. ఉమాదేవిని నాగార్జున సాదరంగా షోలోకి పంపించారు.

  ఎనిమిదో కంటెస్టెంట్‌గా జస్వంత్ పడాల..

  ఎనిమిదో కంటెస్టెంట్‌గా జస్వంత్ పడాల..

  జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల ఓ మోడల్‌గా రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేవ్‌లోని విజయవాడకు చెందిన వాడు. బెంగళూరులో ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాకర్, మోడలింగ్ కెరీర్‌ను ఆరంభించారు. 30 గంటలకుపైగా ర్యాంప్ వాక్ షో చేసి రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ మిలింద్ సోమన్‌గా పేరు ఉంది. సప్త మాత్రిక అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఎంత మంచి వాడవురా సినిమాలో కల్యాణ్ రామ్ నందమూరితో కలిసి నటించాడు.

  10వ కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్..

  10వ కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్..

  సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్‌గా షణ్ముఖ్ అందరికి సుపరిచితులు. ఇటీవల మద్యం సేవించి వాహనం డ్రైవింగ్‌ చేస్తూ మరో కారుకు యాక్సిడెంట్ చేయడంతో వివాదంలో చిక్కుకొన్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీప్తీ సునయనకు బాయ్‌ఫ్రెండ్‌గా మరింత పాపులర్. అయితే కొద్ది రోజుల క్రితం తెచ్చుకొన్న చెడ్డపేరును తుడిచిపడేస్తాను అంటూ చెప్పారు. షణ్ముఖ్ అంటే ఆరు ముఖాలు.. బ్రహ్మకు కూడా మూడే ముఖాలు ఉంటాయి. నీ ఆరు ముఖాలతో నీ నిజస్వరూపం చూపిస్తావా? అంటే.. కొన్ని యాంగిల్స్‌లో ప్రయత్నిస్తాను అంటూ చెప్పారు.

  శైలజ ప్రియ

  శైలజ ప్రియ

  నటిగా ప్రియగా అందరికి సుపరిచితులైన తెలుగు టెలివిజన్, సీరియల్స్‌లో తన నటనతో మెప్పిస్తూ ఆకట్టుకొంటున్నారు. ప్రియ అసలు పేరు శైలజ ప్రియ. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రియ సఖి సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. నెంబర్ 1 కోడలు సీరియల్‌తోపాటు మరికొన్ని సీరియల్స్ నటించారు. చాలా ఎమోషనల్ స్టోరీతో బిగ్‌బాస్ ఎంట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

  5వ సెలబ్రిటీగా అనీ మాస్టర్

  5వ సెలబ్రిటీగా అనీ మాస్టర్

  బిగ్‌బాస్ ఇంటిలోకి అనీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చింది. మాస్ లుక్‌తో క్రేజీగా వేదికపైకి వచ్చింది. అనీ మాస్టర్ తన గురించి చెబుతూ.. పక్కా తెలుగు అమ్మాయిని. సికింద్రాబాద్ మిలట్రీ హాస్పిటల్‌లో జన్మించాను. ధిల్లక్ ధిల్లక్ పాటతో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించాను. ఇంటిలోకి వచ్చిన తర్వాత తాను తన కుమారుడిని చాలా మిస్ అవుతున్నానని ఎమోషనల్ అయ్యారు.

  4వ సెలబ్రిటీగా శ్రీ రామచంద్ర

  4వ సెలబ్రిటీగా శ్రీ రామచంద్ర

  ఇండియన్ ఐడల్ 5 విజేతగా, సింగర్‌గా సుపరిచితుడైన శ్రీ రామచంద్ర తన పాటలతో అలరించాడు. నాగార్జునతో కలిసి చలాకీగా మాట్లాడుతూ ఆకట్టుకొన్నాడు. జీవితంలో కూడా శ్రీరామచంద్రుడివేనా అంటూ అవును అంటూ సమాధానం ఇచ్చాడు. నాగార్జునకు ఓ పాట డెడికెట్ చేసి ఇంట్లోకి అడుగుపెట్టాడు.

  3వ సెలబ్రిటీగా లహరి షారీ

  3వ సెలబ్రిటీగా లహరి షారీ

  అర్జున్ రెడ్డి ఫేమ్ హీరోయిన్ లహరీ షారీ చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చింది. బ్లూ కలర్ రేర్ రోజ్‌ను తీసుకొచ్చింది. ఇది అరుదైన గులాబీ పువ్వు. ఏడాది పాటు ఉంటుంది. మీ కోసం తీసుకొచ్చానని చెప్పింది. ఆ తర్వాత పింక్ కలర్ గులాబీని ఇచ్చింది. అయితే రెండు రోజాలను తీసుకొని.. మీరు ఇంటిలో ఎవరైనా నచ్చితే ఇవ్వండి అంటే.. నిరాకరించింది. అవి మీ కోసమే అంటూ.. చెప్పింది. అయితే బ్లూ రోజ్‌ను తీసుకొని.. రెడ్ రోజ్‌ను నాగార్జున తిరిగి ఇచ్చేశాడు. అలా ఇంటిలోకి లహరీ షారీ ఇంటిలోకి ఎంట్రీ ఇచచింది.

  2వ సెలబ్రిటీగా వీజే సన్ని ఎంట్రీ

  2వ సెలబ్రిటీగా వీజే సన్ని ఎంట్రీ

  కల్యాణ వైభోగం సీరియల్ ద్వారా జయసూర్యగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న వీజే సన్నీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. సరైనోడు పాటలకు డ్యాన్స్ చేశాడు. వీజే సన్నీ జస్ట్ ఫర్ మెన్ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. నాగార్జున మాట్లాడుతూ.. పక్కింటి కుర్రాడుగా వీజే సన్నీ పేరుంది. పక్కింటి అబ్బాయికి పక్కింటి అమ్మాయి అంటేనే ఇష్టం. వాస్తవానికి తెలుగు అమ్మాయిలంటే ఇష్టం అని చెప్పారు.

  12వ కంటెస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్..

  12వ కంటెస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్..

  కోరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ కృష్ణా జిల్లాకు చెందిన వాడు. టాలీవుడ్‌లో డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్‌బాస్‌లోకి వెళ్లాల్సిన సమయంలో భార్య గర్బవతిగా ఉండటంతో కొంత ఎమోషనల్ అయ్యారు. బిడ్డ పుట్టే సమయానికి పక్కన ఉండాలని అనుకొన్నాను. కానీ బిగ్‌బాస్ ఆఫర్‌ను వదులుకోలేకపోతున్నాను అనే మీమాంసలో పడిపోతే.. భార్య ధైర్యం చెప్పి షోలోకి పంపించింది. వేదిక మీద అల్లు అర్జున్ పుష్పలోని సాంగ్‌పై డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడు.

  తొలి కంటెస్టెంట్‌గా సిరి హన్మంతు

  తొలి కంటెస్టెంట్‌గా సిరి హన్మంతు

  తొలి కంటెస్టెంట్‌గా సిరి హన్మంతు ఎంట్రీ ఇచ్చింది. టెలివిజన్, య్యూట్యూబ్ వెబ్ సిరీస్‌లో నటించిన సిరి హన్మంతు.. భూమ్ బదల్ పాటపై క్రేజీగా, హాట్‌గా డ్యాన్స్ స్టెప్పులు వేసింది. క్రాక్ చిత్రంలో మంగ్లీ పాడిన చీమ కుట్టిన కన్నులు తెరిచా అంటూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. వేదిక మీద డ్యాన్స్ చేస్తున్న నాగార్జున పలకరించారు. నీ కళ్లు చాలా బాగున్నాయి. నీవు ఇంటిలోకి వెళ్తున్న తొలి కంటెస్టెంట్ అని చెప్పగానే షాక్ తిన్నది. అలా సిరి హన్మంతు ఇంటిలోకి అడిగిపెట్టింది.

  మస్త్ ఎనర్జీతో వచ్చిన నాగ్

  మస్త్ ఎనర్జీతో వచ్చిన నాగ్

  బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన నాగార్జున మాట్లాడుతూ.. ఈసారి ఐదు రెట్లు వినోదం ఉంటుంది. ఐదు రెట్ల జోష్ ఉంటుంది అంటూ షో ఎలా ఉండబోతుందో చెప్పారు. అయితే బిగ్‌బాస్ ఏంటి చాలా ఎనర్జీతో కనిపిస్తున్నావు అని అడిగితే.. కరోనా లాక్‌డౌన్‌లో నేను చాలా రెస్ట్ తీసుకున్నా. మంచి ఎనర్జీతో వచ్చాను అంటూ నాగార్జున చెప్పారు.

  అక్కినేని నాగేశ్వరావు గురించి

  అక్కినేని నాగేశ్వరావు గురించి

  సినీ పరిశ్రమలో ఏదైనా ఉత్సాహం కల్పించాలంటే.. అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే అంటూ బిగ్‌బాస్ అన్నారు. దానికి నాగ్ నిజమే అంటూ చెప్పాడు. అలాంటి నాగేశ్వరరావుకు వారసులుగా ఉండటం గొప్పగా ఉంది అంటూ నాగార్జున చెప్పాడు. అక్కినేని పాటకు చైతన్య డ్యాన్స్ వేశాడు. ఇప్పుడు నేను కూడా డ్యాన్స్ చేస్తాను అంటూ ఒక లైలా కోసం అంటూ డ్యాన్సర్లతో స్టెప్పులు వేశారు.

  70 కెమెరాలతో గుట్టురట్టు

  70 కెమెరాలతో గుట్టురట్టు

  ఆ తర్వాత ఇంటి, వేదిక గురించిన విషయాలు చెప్పారు. మొత్తం 70 కెమెరాలు ఉన్నాయి. బిగ్‌బాస్ అక్కడి నుంచే చూస్తారు అంటూ వేదికపైన కెమెరా వ్యవస్థను చూపించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇంటిలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి బిగ్‌బాస్ సెట్ డిజైన్ గురించి చెబుతూ.. ఈ సారి గ్రీన్ హౌస్.. కొందరికి డ్రీమ్ హౌస్‌గా మారబోతున్నది అంటూ నాగార్జున చెప్పారు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  నిన్నే పెళ్లాడుతా సాంగ్‌తో స్మిమ్మింగ్ పూల్ వద్ద

  నిన్నే పెళ్లాడుతా సాంగ్‌తో స్మిమ్మింగ్ పూల్ వద్ద

  ఇంటిలో మోజ్ హౌస్, మెయిన్ హాల్, కిచెన్‌, సిమ్మింగ్ పూల్‌లో చూపిస్తూ వాటి ప్రాధాన్యత చెప్పారు. స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చొని నిన్నే పెళ్లాడుతా పాటను విన్నాడు. అలాగే కిచెన్‌లోకి వెళ్లగానే శివ సినిమాలోని సరసాలు చాలు పాట వినిపించగానే.. ఈ పాటను ఎందుకు వినిపించావు.

  నాకు ఇంటికి వెళ్లాలని అనిపిస్తున్నది అంటూ ఇంటి మొత్తం తిరిగాడు. ఇక మొత్తం 5 రెట్లు ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఒక బోర్‌డమ్ జీవితంలో ఉండదు అంటూ కామెంట్ చేశారు.

  English summary
  Bigg Boss Telugu Season 5 Live Updates: Bigg Boss Telugu 5 season is strating on September 5th. This time 19 members are entering into house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X