For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: లహరిపై పింకీ సంచలన వ్యాఖ్యలు.. షోలో అతడితో అలాంటి పనులు.. ఇద్దరి బండారం బట్టబయలు

  |

  తెలుగు టెలివిజన్‌పై అప్పటి వరకూ ఉన్న బౌండరీలను చెరిపేస్తూ.. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చిన షోనే బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన సన్నివేశాలు, గొడవలు, టాస్కులు, కొట్లాటలు, ప్రేమకథలు, రొమాన్స్‌ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో సాగే ఈ షోకు తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

  ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో ప్రియాంక సింగ్ స్పెషల్ అట్రాక్షన్ అవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మానస్, లహరి షారి మధ్య జరిగిన ఓ సంఘటనను బయట పెట్టింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  చాలా అంచనాలు.. భారీ రెస్పాన్స్‌తో

  చాలా అంచనాలు.. భారీ రెస్పాన్స్‌తో

  బిగ్ బాస్ షో చాలా భాషల్లో ప్రసారం అయినా తెలుగులో వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఐదో సీజన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి కారణం ఇందులో గతంలో కంటే కొత్త కంటెంట్ ఉండడంతో పాటు ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తుడడమే. ఇక, ఆరంభంలోనే 18 రేటింగ్ అందుకున్న ఈ సీజన్.. వీక్ ఎపిసోడ్స్‌కు కూడా మంచి స్పందనే అందుకుంటోంది.

  రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!

  అందరిలో స్పెషల్ కంటెస్టెంట్ తనే

  అందరిలో స్పెషల్ కంటెస్టెంట్ తనే

  ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దీంతో స్పెషల్ కంటెస్టెంట్‌గా నిలిచింది.

  అందరికీ ఆదర్శంగా నిలిస్తోన్న భామ

  అందరికీ ఆదర్శంగా నిలిస్తోన్న భామ

  బిగ్ బాస్ తాజా సీజన్‌లోకి ప్రియాంక సింగ్ మాత్రం ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, ప్రియాంక మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

  చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో సపోర్టు కూడా లభిస్తోంది. దీంతో ఈమె పలుమార్లు సేఫ్ కూడా అయింది.

  టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  ప్రియాంక వింత లవ్ ట్రాక్ హైలైట్‌గా

  ప్రియాంక వింత లవ్ ట్రాక్ హైలైట్‌గా

  బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్‌ పలు రకాలుగా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ కూడా హైలైట్ అవుతూ ఉంది. దీన్ని బిగ్ బాస్ నిర్వహకులు మరింత ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. ఫలితంగా ఈ విషయం ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. దీంతో ప్రియాంక సింగ్‌పై విమర్శలు వస్తున్నాయి.

  ఆట పట్టిస్తూ.. మానస్ మాత్రం అలా

  ఆట పట్టిస్తూ.. మానస్ మాత్రం అలా

  బిగ్ బాస్ హౌస్‌లో కనిపించే లవ్ ట్రాకులపై ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్లకు ప్రత్యేకమైన శ్రద్ద ఉంటుంది. ఐదో సీజన్‌లో కూడా పలువురు జంటలుగా మారతారని అంతా అనుకున్నారు. కానీ, ప్రియాంక సింగ్ వ్యవహారాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆమె మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించడంతో కంటెస్టెంట్లు ఆట పట్టిస్తున్నారు. అదే సమయంలో తెగ అల్లరి చేస్తున్నారు. ఇక, ఈ విషయంలో మానస్ మాత్రం ఎంతో సెటిల్డ్‌గా ఉంటున్నాడు. ప్రియాంకకు వీలైనంత స్పేష్ మాత్రమే ఇస్తున్నాడు. కానీ, ఈమె మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.

  హాట్ షోలో హద్దు దాటిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అందాలు మొత్తం చూపిస్తూ.. వామ్మో ఇంత అరాచకంగానా!

  అలిగిన ప్రియాంక... మానస్ ఆ పని

  అలిగిన ప్రియాంక... మానస్ ఆ పని

  నామినేషన్స్ టాస్కులో తన రీజన్ తీసుకుని కాజల్‌ను నామినేట్ చేయకపోవడంతో సన్నీపై ప్రియాంక సీరియస్‌గా ఉంది. మంగళవారం ఎపిసోడ్‌లో దీన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఏడుస్తూనే ఉంది. అంతేకాదు, మానస్ కూడా అర్ధం చేసుకోవడం లేదంటూ ఆనీ మాస్టర్ ముందు బాధ పడింది. సరిగ్గా అప్పుడే అక్కడకు మానస్ వచ్చాడు. దీంతో ఆనీ వెళ్లిపోయింది. అప్పుడతడిని ప్రశ్నిస్తూ మరింత ఏడ్చేసింది. ఆ సమయంలో మానస్ 'అన్న తినిపించనా? ఆఫర్ ఒక్కసారి మాత్రమే ఇస్తాను' అంటాడు. దీంతో పింకీ అతడికి దగ్గరగా జరిగి కాసేపు ఉండమని అడిగింది.

  లహరిపై పింకీ సంచలన వ్యాఖ్యలు

  లహరిపై పింకీ సంచలన వ్యాఖ్యలు

  కొద్దిసేపు మానస్ పక్కన కూర్చుని మధురానుభూతులను ఆస్వాదించిన ప్రియాంక.. ఆ తర్వాత అతడు గోరుముద్దలు తినిపిస్తుంటే తెగ మురిసిపోయింది. ఆ సమయంలోనే 'లహరికి కూడా ఇలాగే తినిపించావ్ కదా.. తనైతే నీ వేళ్లు కూడా వదిలిపెట్టేది కాదు.. మీ ఇద్దరూ ఎలా బిహేవ్ చేశారో నాకు తెలుసు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మానస్ 'హో అవన్నీ నువ్వు చూసేశావా' అని అడిగాడు. దీనికి పింకీ 'నువ్వు ఎక్కడున్నా నేను గమనిస్తూనే ఉంటా.. ఒక్క వాష్‌రూంలో తప్ప. నువ్వు నాతో ఉంటే హ్యాపీగా ఉంటుంది' అంటూ ఏదేదో చెప్పుకొచ్చింది.

  English summary
  Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. Priyanka Singh Shocking Comments on Lahari Shari.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X