Bigg Boss Telugu 9: నాకు కోపం వస్తే కొట్టేస్తా.. నవదీప్, శ్రీముఖి, బిందు మాధవికి కంటెస్టెంట్ వార్నింగ్

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు వీరాభిమానులు ఉన్నారు. సెపరేట్ వ్యూయర్షిప్ ఉండటం విశేషం. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 8 షోలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాంతో నెక్ట్స్ సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఎట్టకేళలకు ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వాహకులు ప్రారంభించడం విశేషం. అయితే ఈ సారి సరికొత్తగా కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియను కూడా టెలికాస్ట్ చేయబోతుండటం విశేషం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ల ఎంపిక చాలా ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేసే పద్ధతి అగ్నిపరీక్ష ద్వారా ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కాగా, తాజాగా ఇంటర్వ్యూ రౌండ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో మొదటి కంటెంట్ కు పరీక్షలు నిర్వహించారు. ఇందులో మాజీ బిగ్ బాస్ విన్నర్, మాజీ కంటెస్టెంట్లు పాల్గొనడం విశేషం.

Bigg Boss Telugu Season 9 Agnipariksha Episode 1

బిగ్ బాస్ సీజన్ 1 ఫైనలిస్ట్ నవదీప్, బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 విన్నర్ బిందుమాధవి, బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ శ్రీముఖి హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్ని పరీక్ష ఎపిసోడ్ ను ప్రారంభించారు. ఈ ఎపిసోడ్ ఆగస్టు 22 జియో హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది. కాగా తొలి కంటెస్టెంట్ ఎంపిక చేసే ప్రయత్నం చేస్తారు. ఇక జడ్జెస్ గా అభిజీత్, నవదీప్, బిందు మాధవిలు వ్యవహరించారు. కాగా మొదటగా అగ్ని పరీక్షలో పాల్గొన్న వ్యక్తి తన మాటలతో అందరికీ షాక్ ఇచ్చారు.

ప్రోమో ప్రకారం.. అభిజీత్ మాట్లాడుతూ.. నాలాంటి కంటెస్టెంట్ రాడు రాలేడని ఇక నేను నాలాంటి వాడిని వెతికి పంపిస్తానని ఇక్కడికి జడ్జీగా వచ్చానని అంటాడు. ఆ తర్వాత కంటెస్టెంట్ పోటీదారుడు మాస్క్ వేసుకొని వస్తాడు. నీ పేరు ఎంటనీ అభిజీత్ అడుతాడు. దాంతో అతను స్కిన్ నేమ్ హరీశ్, సోల్ నేమ్ హృదయ్ మానవ్ అని బదులిస్తాడు. ఇక హృదయ్ మానవ్ అంటే ఏమిటనీ బిందుమాధవి ప్రశ్నిస్తుంది. అందుకు ఆయన హృదయం ఉన్న మానవుడు అని బదులిస్తాడు.

అందుకు నవదీప్ ఏం మాకే హృదయాలు లేవనా? అని కౌంటర్ ఇస్తాడు. మీరు ఇంకా ఆ జాబితాలో లేకపోతే చేరిపోండి అని తిరిగి కౌంటర్ ఇస్తాడు. చిన్నప్పటి నుంచి చాలా కోపిష్టి మనిషిని నేను అని చెబుతాడు. అసలు కోపం వస్తే మీరు ఏం చేస్తారని శ్రీముఖి ప్రశ్నిస్తుంది. ఆ కోపాన్ని నేను వెంటనే బయట పెట్టేస్తానని అంటాడు. అందుకు బిందుమాధవి ఏ కొడుతావా? అని అంటుంది. అవును కోపం వస్తే కొట్టేస్తానని అంటాడు. బిగ్ బాస్ లోకి వెళ్లేది మనం ఫ్రెండ్స్ చేసుకోవడం కోసమేనా అని అతను అడుగుతాడు. ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకోకూడదని అభిజీత్ అడిగితే.. ట్రోఫీలు ఇచ్చేది ఫ్రెండ్స్ కు కాదుకదా అని అడ్డదిడ్డంగా బదులిస్తాడు. ఇక విసుగెత్తిపోయిన జడ్జీస్ రెడ్ కార్డ్ చూపిస్తారు. ఇక బింధు మాధవి పలు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందనేది ఫుల్ ఎపిసోడ్ లో రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X