నేను ఆడ నవదీప్.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో హీరో నవదీప్‌కు అవమానం
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు 8 సీజన్లను విజయవంతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో షో ఎప్పుడు ప్రారంభం అవుతుందని ప్రేక్షకులు, బిగ్ బాస్ లవర్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్ష ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ ను నిర్వహించారు.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 9 అగ్ని పరీక్ష ద్వారా కొందరు కంటెస్ట్ లను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష స్పెషల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్, మాజీ కంటెస్టెంట్ హీరో నవదీప్, బిందుమాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేదెవరినే దానిపై తమ వివరాలు, కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ జడ్జీలపైనే కౌంటర్లు, కామెంట్స్ చేస్తుండటం షాకింగ్ గా మారింది. ఇప్పుడే వారు ఇలా ఉన్నారంటే ఇంక హౌజ్ లోకి వెళ్లాక ఏం చేస్తారోనని ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

ఇక తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష ఫుల్ ఎపిసోడ్ లో ఒక కంటెస్టెంట్ హీరో నవదీప్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని బింధుమాదవి లేడీ కంటెస్టెంట్ ను ప్రశ్నిస్తుంది. దాంతో ఆమె 'నేను ఆడ నవదీప్ ను' అంటూ షాకింగ్ గా సమాధానం ఇచ్చింది. దీంతో జడ్జెస్ అందరూ షాక్ అయ్యారు. ఇక నవదీప్ కూడా షాక్ లో ఉంటాడు. 'నేను సింగిల్ అని ఎక్కడా చెప్పలేదు కదా' అని ప్రశ్నిస్తాడు. ఇక ఆమె 'నేను కూడా సింగిల్ కాదు జస్ట్ బయటికే చెబుతున్నానని అంటుంది'. ఇలా జడ్జెస్ కే షాక్ ఇచ్చిన ఈమె హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఇక ఇప్పటికే ఈ అగ్రి పరీక్ష ఎపిసోడ్ కు ఒక యాగ్రిమెన్ ఎంట్రీ ఇచ్చి నవదీప్ పైనే కామెంట్స్ చేశాడు. శ్రీముఖి, బింధుమాదవి అడిగిన ప్రశ్నలకు నాకు కోపం వస్తే ఆపుకోలేనని, బయటి చూపిస్తానని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. ఇక మరో ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ చాలా సున్నితంగా, కామెడీగా కనిపించారు. వారి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక త్వరలో ఫైనల్ లిస్ట్ ను ప్రకటించబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం కంటెస్టెంట్స్ లిస్ట్ ను మేనేజ్ మెంట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సారి హౌజ్ లోకి ఇద్దరు కామన్ మెన్స్ కు ఎంట్రీ ఉండటంతో వారి సెలెక్షన్ కోసమే అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఇక గత సీజన్ లో నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఈసారి కంటెస్టెంట్స్ కు ఎవరెవరు రాబోతున్నారననేది త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











