అలా అన్యాయంగా కేసులో ఇరికించారు.. బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్ ఆవేదన

నటి, హీరోయిన్ సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ చూడలేకపోయినా, సపోర్టింగ్ రూల్స్ తో మాత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకోగలిగింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది. అయితే సంజనా గల్రానీ కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కోవిడ్ సమయంలో పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఆమె సినిమాల జోరును తగ్గించారు. తన ప్రాతకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ ప్రస్తుతం సంజనా గల్రానీ తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షోకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ షోకు నటి సంజనా గల్రానీ సెలబ్రెటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. చీరకట్టులో హిందూ సంప్రదాయాన్ని తెలియజేసేలా మెరిసింది. అయితే ఆమెకు బిగ్ బాస్ షోకు ఎందుకు రావాలని అనుకుందో తాజాగా వివరించింది. గతంలో తను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక సమయంలో తనపై కేసు నమోదైందని, ఇంక్వైరి అని తీసుకెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో తనకు చావు ఎందుకు రాలేదా? అని కూడా బాధ పడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది.

Bigg Boss Telugu Season 9 Celebrity Contestant Sanjjanaa Galrani

అయితే, సంజనా గల్రానీపై కేసు నమోదైంది కరోనా సమయంలోనే కావడం గమనార్హం. 2020 సెప్టెంబర్ 8న సంజానాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అందులో డైరెక్ట్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ జ్యోక్యం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఇష్యూ గురించి తెలిసింది. అయితే ఆ డ్రగ్ రాకెట్ కేసులో సంజనా గల్రానీని 2వ వ్యక్తిగా అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా హాజరు పరిచారు. ఆమెకు బెయిల్ కూడా రాలేదు. చాలాసార్లు కోర్టు ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు తిర్కసరించింది. ఇక 3 నెలలు ఆమెను జైలులో ఖైదీలా ఉంచిన తర్వాత బెయిల్ ను మంజూరు చేశారు.

కాగా, అదే విషయాన్ని సంజనా గల్రానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వేదికన గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నా తప్పేమీ లేకున్నా నిందలు మోసానని, దాని వల్ల నా కెరీయర్ ఎఫెక్ట్ అయ్యిందని సంజనా చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన అవకాశంతో తన ప్రవర్తన ఎంత మధురంగా ఉంటుందో రుజువు చేసుకుంటానని చెప్పింది. నామీద చాలా ఆరోపణలు ఉన్నాయని వాటన్నింటికీ బిగ్ బాస్ వేదికగా సమాధానం చెబుతానని అనింది. ఇక ఆకేసు తర్వాతనే 2021లో అజీజ్ పాషాను పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లి వార్త కూడా బయటకి రానివ్వలేదని చెప్పింది.

తన భర్త తనకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారని చెప్పారు. నాపై ఉన్న ఆరోపణలకు బిగ్ బాస్ ద్వారా సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుందని తానే స్వయంగా పంపించారని చెప్పింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో తను కిచెన్ హెడ్ గా బాధ్యతలు తీసుకుంది. హౌజ్ మేట్స్ కు తన చేతులతో రుచికరమైన వంటల వండిపెట్టడానికి సిద్ధమని చెప్పింది. ఇక సంజనా గల్రానీ సోగ్గాడు, బుజ్జిగాడు, సత్యమేవ జయతే, దుస్సాసన, ముగ్గురు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X