నాతో నా కొడుకు 14 నెలలుగా మాట్లాడట్లేదు.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ పవన్ తండ్రి కంటతడి
పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణను పొందిందో ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. ఈషోకు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విశేషమైన ఆదరన దక్కుతోంది. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 21 రోజులు అనగా 3 వారాలు పూర్తైంది.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కామనర్, ఆర్మీ ఉద్యోగి పవన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పడాల హౌజ్‌లో టాస్క్‌లు మంచిగా ఆడుతూ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ఆయన ఏపీలోని విజయనగరంలో పుట్టి పెరిగాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. ఆర్మీలో జవాన్ గా ఎంపికైన పవన్ కు మొదటి నుంచి ఎంటర్ టైన్ మెంట్ రంగంపై ఆసక్తి ఎక్కువ.

ఆ ఆసక్తితోనే ఉద్యోగం మానుకుని మరీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కామనర్ గా ఎంట్రీ ఇచ్చాడు. 40 వేల అప్లికేషన్ రాగా అందులో ఒకడిగా పవన్ బిగ్ బాస్ కామనర్ కంటెస్టెంట్ గా ఎంపికవ్వడం గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ పడాల ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో అలరిస్తుండగా.. ఆయన తండ్రి పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి, కొడుకు పవన్ పడాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుకొచ్చాడు.
'నా కొడుకు పవన్ ను పుట్టినప్పటి నుంచి ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. వాడికి బాత్ రూమ్ లో వేడి నీళ్లు కూడా నేను పెడుతాను. చిన్నప్పుడు 4 ఏళ్లు మా చెల్లి వాళ్ల ఇంట్లోనే పెరిగాడు. తర్వాత నా దగ్గరి వచ్చాడు. పవన్ ను నేను ఎప్పుడు చదువుకోవాలని చెబుతూ ఉంటాను. బాగా చదువుకొని ఉద్యోగం చేయాల్సిందే అని పట్టుబట్టాను. మా కుటుంబం చాలా వరకు అందరూ పోలీస్ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ఇక నా కొడుకు పవన్ ను కూడా అదే ఉద్యోగంలోకి పంపించాలని అనుకున్నాను. పవన్ కు అది ఇష్టం లేదు. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి ఆపై నీ జీవితం నీ ఇష్టమని చెప్పారు. ఇక నాపై కోపంతోనే అయిష్టంగానే ఆర్మీలో జాయిన్ అయ్యాడు.
ఉద్యోగంలో చేరిన తర్వాత 14 నెలల వరకు నాతో ఒక్క మాట మాట్లాడలేదు. ఫోన్ చేసినా కట్ చేసేవాడు. ఆ కోపం ఇంకా పోలేదు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లాడు. వాడి మాటతీరు బాగానే ఉంటోంది. మనస్సులో ఏదనిపిస్తే అలానే ఉంటున్నాడు. ఇక వాడు ఎక్కువగా మనుషులను ఈజీగా నమ్మేస్తాడు. ఆ నమ్మకమే వాడిని ఏం చేస్తుందోనని నాకు భయం. బిగ్ బాస్ హౌజ్‌లో ఆడే టాస్క్ లు బిగ్ బాస్ ఇచ్చేవేనా, లేక ఎవరైనా మాటలతో పొంగిపోయి ఆడుతున్నాడా అనేది భయంగా ఉంది. వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మున్ముందు వాడికి భగవంతుడే మంచిగా చూడాలి.' అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











