Elimination: బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్.. నాగార్జునకు షాకిచ్చిన కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభోత్సవ వేడుకకు సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే షో ప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఇక హౌస్ లోకి కంటెస్టెంట్స్ ను పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఇందులో ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్ళక ముందే సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడం షాకింగ్ గా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సరికొత్త మార్పులతో, ఊహించని షరతులతో, రసవతరమైన టాస్కులతో ప్రారంభిస్తామని, అంచనాలను మించి షో కొనసాగుతుందని హోస్ట్ అక్కినేని నాగార్జున ఇప్పటికే బుల్లితెర ఆడియన్స్ కు, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో లవర్స్ కు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే షో ప్రారంభంలోనే ఒక కంటెస్టెంట్ తనించి తానే ఎలిమినేట్ అవుతానని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది.

తాజా ప్రోమో లో బిగ్ బాస్ తెలుగు 9కు సంబంధించిన అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక చేసిన కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిస్తూ ఉంటారు నాగార్జున. అయితే ఒక మేల్ కంటెంట్ మాత్రం ఫైనల్ వరకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్లడం షాకింగ్ గా ఉంది. అంతకు ముందు ఫీమేల్ కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించిన తర్వాత, మరొక మేల్ కంటెస్టెంట్ ని పరిచయం చేసి హౌస్ లోకి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కంటెస్టెంట్ చేతిలో ఒక బాక్స్ ఉండింది. అది ఏంటి అని నాగార్జున ప్రశ్నించారు. దాంతో ఆ కంటెస్టెంట్ బాక్స్ గురించి చెప్పడానికి ఇష్టపడలేదు.
తను హౌస్ లోకి వెళ్లడానికి బిగ్ బాస్ ఆ బాక్స్ ని కూడా తన వెంటనే తీసుకువచుకునేందుకు అనుమతించాలని కోరాడు. ఆ బాక్స్ లో ఏముందని అడిగితే, ఈ బాక్స్ నా బాడీ లో సగం అని చెప్పాడు. బిగ్ బాస్ కు స్పష్టంగా చెప్పకపోవడంతో బిగ్ బాస్ తిరస్కరించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతి ఒక్కరూ తమ సొంత వస్తువులను తీసుకువచుకునేందుకు అనుమతి లేదని చెప్పాడు. అలాగైతే నేను తిరిగి ఇంటికి వెళ్లి పోతానని ఆ కంటెస్టెంట్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరనేది ప్రోమోలో చూపించలేదు.
దాంతో సెల్ఫ్ ఎలిమినేషన్ కి ఒప్పుకుంది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీ కంటెస్టెంట్ నా, లేక కామనర్ అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. కానీ ఆయన కామనర్ పవన్ కళ్యాణ్ అయి ఉంటారని బిగ్ బాస్ రియాలిటీ షో లవర్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. హౌస్ లోకి వెళ్లేవారు తమ వస్తువులేవి తీసుకు వెళ్లడానికి వీల్లేదని తెచ్చి చెప్పాడు. ఈసారి బిగ్ బాస్ నుంచి చాలా మార్పులు చూస్తారని, ముందుంది ముసళ్ళ పండుగ అంటూ షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు.


Click it and Unblock the Notifications











