బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండు హౌజ్ లు.. ఏ ఇంట్లో ఎవరుంటారు? ట్విస్ట్ ఇదే!
బిగ్ బాగ్ తెలుగు సీజన్ 9 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తుండగా సెప్టెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ గా ఈ రియాలిటీ షో ప్రారంభం అవుతుంది.ఈ సారి హౌజ్ లోకి మొత్తం 18 కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ మరియు కామనర్స్ కూడా ఉండటం విశేషం. అయితే వీరిలో ఎంత మంది సెలబ్రెటీలు, ఎంత మంది కామనర్స్ ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు అట్టహాసంగా జరిగాయి. సకల సౌకర్యాలతో సెటప్ మొత్తం రెడీ అయ్యి ఉంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌజ్ లోకి ఆహ్వానించడమే మిగిలి ఉంది.
ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఉదయం కంటెస్టెంట్స్ తో నాగార్జును చేసిన సందడిని తెలియజే ఓ ప్రొమోను విడుదల చేశారు. అందులో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఎలాంటి షరతులు విధిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా అందిన ప్రొమో ప్రకారం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు భయంకరమైన టాస్క్ లు, మరింతగా వారి నైపుణ్యాలను బయటికి తీసేలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రారంభంలోనే ఒక కంటెస్టెంట్ నేను వెళ్లిపోతా అని సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే, ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు నిర్వాహకులు. సెలెబ్రెటీ, కామనర్స్ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా సిద్ధం అయిపోయింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌజ్ ను మరింత ఆకట్టుకునేలా ఉంది. ప్రతి సీజన్ లో ఒకే హౌజ్ ను నిర్మించి అందులోకి కంటెస్టెంట్స్ ను పంపించి రసవత్తరమైన టాస్క్ లతో గేమ్ నిర్వహించే వారు. అయితే ఈసారి 2 హౌజ్ లు ఉండటం నిజంగా ప్రేక్షకులకు, అటు కంటెస్టెంట్స్ కు గేమ్ పై ఆసక్తిని పెంచేలా ఉంది. అయితే ఇప్పటికే ఆ రెండింటిలో 2వ హౌజ్ అద్భుతంగా ఉందని హోస్ట్ అక్కినేని నాగార్జున చెప్పడం విశేషం.
ఇక కంటెస్టెంట్లను హౌజ్ లోకి పంపించే విధానం ఎలా జరుగుతుందని, మొదటి ఇంట్లో ఎవరు ఉంటారు? 2వ ఇంట్లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజాగా మరో అప్డేట్ అందించారు బిగ్ బాస్ టీమ్. 'ఓనర్ ఎవరు? టెనెంట్ ఎవరు?' అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. దాన్ని బట్టి చూస్తే సెలబ్రెటీ కంటెస్టెంట్స్, కామనర్స్ ను రెండు విభాగాలుగా విభజించినట్టు తెలుస్తోంది. అందులో ఒక గ్రూప్ ను యజమానులుగా, మరో గ్రూప్ ను టెనెంట్ గా గుర్తించి ఆయా ఇంటిలోకి పంపించబోతున్నట్టు అభిప్రాయలు వెల్లడవుతున్నాయి.
కాగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందని ప్రచారం. కింద టెనెంట్స్, మీద ఓనర్లు ఉంటూ పలు టాస్క్ ల ద్వారా తారుమారు అవుతారని అంటున్నారు. మరోవైపు సెలబ్రెటీలను ఓనర్లుగా, టెనెంట్స్ గా కామనర్స్ ను ఉంచుతారా? లేక మిక్డ్స్ గా ఉంచుతారా? అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది.


Click it and Unblock the Notifications











