Bigg Boss Telugu 8th Week Voting: మరోసారి ఓటింగ్‌లో దూసుకుపోతోన్న తనూజ.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu Season 9 Week 8 Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో (Bigg Boss Telugu Season 9) రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకూ గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు, టర్న్స్ ఈ సీజన్ లో చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో? బిగ్ బాస్ ఎవర్ని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో ? అనే ఉత్కంఠతో ఈ గేమ్ షో రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా రీఎంట్రీ పేరుతో మాజీ కంటెస్టెంట్లు అయినా భరణి శంకర్, శ్రీజ దమ్మూ లను హౌజ్ లోకి పంపించారు. దీంతో షోలో మరోసారి అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? అనే విషయంలోకి వెళితే..
రీఎంట్రీలతో హీటెక్కిన హౌస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలిమినేషన్లు వరుసగా సాగుతున్న ఈ షోలో కొత్త మలుపులు తెచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 9 మంది కంటెస్టెంట్లు గేమ్ నుండి బయటికెళ్లారు. వీరిలో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైనీ, భరణి శంకర్, రమ్య మోక్ష, ఆయేషా ఉన్నారు. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయేషా, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గేమ్‌కి గుడ్‌బై చెప్పింది.

అయితే టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కొంత తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆడియన్స్ డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీ-ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి రావడం హౌస్ వాతావరణాన్నే మార్చేసింది. ముఖ్యంగా శ్రీజ ఎంట్రీతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం, మాటల తూటాలు, పాత విభేదాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే రీఎంట్రీ డ్రామా హౌస్‌లో కొత్త హంగామా తెర తీసింది.
ఉత్కంఠగా సాగిన నామినేషన్ల పర్వం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 8వ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్టుగా జరిగింది. ఈసారి బిగ్ బాస్ టీం తీసుకున్న నిర్ణయం హౌస్‌లోని కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చింది. సాధారణంగా హౌస్‌లో సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేస్తారు, కానీ ఈసారి మాత్రం ఆటను మలుపుతిప్పే విధంగా మాజీ కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి రప్పించారు. ఎలిమినేట్ అయిన ఆ మాజీలు హౌస్‌లోకి వచ్చి ప్రస్తుత కంటెస్టెంట్ల తలరాతను నిర్ణయించడం హౌస్‌లో వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ కొత్త నామినేషన్ ఫార్మాట్ చూసి ప్రేక్షకులే కాకుండా కంటెస్టెంట్లు కూడా షాక్ అయ్యారు.
ఇలా ఉత్కంఠభరితంగా సాగిన నామినేషన్ ప్రక్రియలో దువ్వాడ మాధురి, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సంజనా గల్రాని, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా ఇలా మొత్తం 8 మంది ఈ వారం ఎలిమినేషన్ రేస్‌లో నిలిచారు. మాజీ కంటెస్టెంట్లతో ఎదురుపడటం, వారి కామెంట్లు, జడ్జ్‌మెంట్లు అన్నీ హౌస్‌లో హై వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేశాయి. బిగ్ బాస్ తీసుకున్న ఈ ట్విస్ట్ ప్రేక్షకులను కూడా ఉత్కంఠలో ముంచెత్తింది.
ఇక ఓటింగ్ విషయానికొస్తే.. ఎనిమిదోవారం బిగ్‌బాస్ ఓటింగ్ లోనూ అసాధారణ పరిణామాలు, అన్యూహ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా పోస్టులు చేస్తూ.. ఓటింగ్ లో పాల్గొంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ 9 ను ట్రెండింగ్ టాపిక్‌గా మార్చేశారు. సోషల్ మీడియా, అనధికారిక సర్వేల ప్రకారం.. ఈ వారం ఓటింగ్‌లో మరోసారి తనూజ పుట్టస్వామి మొదటి స్థానంలో నిలిచిరు. ఈ ముద్ద మందారం ఫేమ్ 33 శాతం ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. బిగ్‌బాస్ హౌస్‌లో తనుజా ఆడిన గేమ్‌లో స్మార్ట్ మూవ్స్, మాట్లాడే తీరు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్‌ని ఏర్పరిచింది. ఈ సీజన్‌లో "స్ట్రాంగ్ కంటెస్టెంట్"గా పేరు తెచ్చుకున్నాడు.
ఆ తరువాత స్థానంలో కళ్యాణ్ పడాల నిలిచారు. ఈ లవర్ బాయ్ 19.7శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఓటింగ్ చూస్తే.. తనుజా వర్సెస్ కళ్యాణ్ లాగా.. వీరిద్దరి మధ్య టాఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక మూడో స్థానంలో సంజన గల్రానీ నిలిచింది. ఆమె10.42 శాతం ఓట్లు సాధించింది. ఆ అమ్మడు ఫన్నీ టాస్క్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ కొందరు ఆమెను కంట్రోవర్సీ క్వీన్, గొడవలకు కారణం ఆమెనే అంటున్నారు. ప్రస్తుత ఓటింగ్ ప్రకారం.. పై ముగ్గురు మంచి ఓటింగ్ తో సేఫ్ జోన్ లో నిలిచారనే చెప్పాలి.
మిగిలిన కంటెస్టెంట్లలో గౌరవ్ గుప్తా 7.59 శాతం, రాము రాథోడ్ 7.35 శాతం, డెమోన్ పవన్ 7.33 శాతం, రీతు చౌదరి 7.32 శాతం, బిగ్ బాస్ లేడీ డాన్ మధురి దువ్వాడ 7. 3 శాతం ఓట్లు పొందారు. ఇలా ఓటింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం గౌరవ్ గుప్తా, రాము రాథోడ్, డెమోన్ పవన్, రీతూ చౌదరి, మధురి దువ్వాడ లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రీతూ, దివ్వెల మాధురి మధ్య నామినేషన్స్ వార్ పోటాపోటీగా సాగింది. దీంతో వీరిద్దరి పై నెగిటివ్ ఈమేజ్ క్రియేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరికి తక్కువ ఓటింగ్ పడినట్టు తెలుస్తోంది. అయితే.. ఓటింగ్ తొలిరోజు కాబట్టి.. పోలింగ్ చివరి రోజు వరకు ఫలితాలు మారే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా ఎన్నో మలుపులు చోటుచేసుకుంటాయో.. వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











