Don't Miss!
- News
తిరుమలలో అనూహ్య ఘటనపై విచారణకు ఆదేశించిన టీటీడీ..!!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్?.. మొదలు పెట్టిన షమీ.. వణికిపోయిన కివీస్!
- Finance
IT Companies: ఐటీలో సత్తా చాటుతున్న భారత కంపెనీలు.. టాప్ 10లో మనవే 4 సంస్థలు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Lifestyle
ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకుంటే శ్రేయస్కరం.. వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
సన్ ఆఫ్ ఇండియా దర్శకుడితో బిగ్ బాస్ విన్నర్ మూవీ.. షాకింగ్ కాంబినేషన్!
రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ అందుకున్న వారు సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటూ వుంటారు. అయితే మిగతా భాషల్లో మాదిరిగా తెలుగులో టైటిల్ విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్స్ మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు కూడా గెలవబోయే వారికి అభిమానులు అయితే ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే త్వరలోనే సన్ ఆఫ్ ఇండియా దర్శకుడితో ఒక బిగ్ బాస్ విన్నర్ త్వరలోనే సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగులో మాత్రం ఇలా..
బిగ్ బాస్ షోలో క్రేజ్ అందుకన్న తర్వాత చిత్ర పరిశ్రమలో కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలి అని కొంత మంది ఆర్టిస్టులు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మిగతా భాషల్లో మాత్రం టైటిల్ విన్నర్ గా నిలిచిన వారు చాలా తొందరగానే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. కానీ తెలుగులో మాత్రం ఇంతవరకు ఏ ఒక్కరు కూడా వారి కెరీర్ నుంచి మరో స్థాయికి అయితే ఎదగలేకపోయారు.

టాప్ విన్నర్స్ అలా..
మొదటినుంచి చూసుకుంటే కూడా శివ బాలాజీ, కౌశల్ మండా ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఇలా అత్యధిక స్థాయిలో ఓట్లు అందుకున్న వారు కూడా వారి సినిమా కెరీర్ లో మాత్రం సరైన గుర్తింపు అందుకోలేకపోయారు. ముఖ్యంగా కౌశల్ మండా అయితే దారుణంగా ఫెడౌట్ అయ్యాడు.
అంతకు ముందు అతను బిగ్ బాస్ షోలో క్రియేట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తప్పకుండా అతను హీరోగా కూడా క్లిక్ అవుతాడు అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

హీరో పరిస్థితి అంతే..
నలుగవ సీజన్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ కూడా ఏమాత్రం క్లిక్కవ్వలేదు. అతను అంతకుముందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో హీరోగా నటించే ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ 4 లో ఉన్నన్ని రోజులు కూడా అతనికి ఆడియన్స్ సపోర్ట్ బాగానే ఉంది. కానీ అభిజిత్ బయటకు వచ్చిన తర్వాత సరైన ప్రాజెక్టులను అందుకోలేకపోయాడు.

సన్నీ కొత్త సినిమా?
ఇక 5వ సీజన్లో సక్సెస్ అయిన సన్నీ పేరు కూడా చాలామంది మర్చిపోయారు. కానీ ఇప్పుడు అతను ఒక ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సన్ ఆఫ్ ఇండియా దర్శకుడితో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న డైమండ్ రత్నబాబు ఇంతకుముందు రచయితగా అయితే కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

పర్ఫెక్ట్ కథతో..
మొత్తానికి రత్నబాబు VJ సన్నీ కాంబినేషన్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పై వివిధ రకాల మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా సన్నీ అయితే బిగ్ బాస్ ద్వారా పాజిటివ్ రియాక్షన్స్ అందుకున్నాడు. ఇక అదే తరహాలో కొత్త సినిమాతో కూడా మంచి గుర్తింపు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. డైమండ్ రత్నబాబు అతనికి కరెక్ట్ గా సెట్ అయ్యే కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి ఈ ప్రాజెక్టుతో సన్నీ ఎంతవరకు క్లిక్ అవుతాడో చూడాలి.