For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: తొలిరోజు షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఇదే కంటిన్యూ అయితే అతడే విన్నర్

  |

  అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అయినా.. అస్సలు ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఏకైక షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఎన్నో మలుపులతో రసవత్తరంగా సాగిన ఈ సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. వచ్చే ఆదివారం ఫినాలే జరగబోతుంది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక, ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు ఎవరికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి? ప్రస్తుతానికి ఏ కంటెస్టెంట్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు? ఎవరి పొజిషన్స్ ఏంటి? అన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  13 వారాలు.. 13 మంది ఎలిమినేట్

  13 వారాలు.. 13 మంది ఎలిమినేట్

  ఎన్నో అంచనాల నడుమ ప్రారంమైన ఐదో సీజన్‌కు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 13 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారం ప్రియాంక సింగ్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారం అనారోగ్యంతో వెళ్లిపోయాడు.

  Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

  ఫినాలేకు ముందు ఆమె బయటకు

  ఫినాలేకు ముందు ఆమె బయటకు


  ఆరంభం నుంచీ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చిన బిగ్ బాస్ ఐదో సీజన్.. ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. గత వారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఉండగా.. అంతకు ముందే టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్న శ్రీరామ చంద్ర తప్ప మిగిలిన వాళ్లందరినీ నామినేట్ చేశారు. అలా గత వారంలో మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు నామినేట్ అయ్యారు. ఇందులో మొదట సన్నీ, తర్వాత సిరి, అనంతరం షణ్ముఖ్ ఫినాలేకు చేరుకున్నారు. ఇక, చివర్లో మానస్, కాజల్ మిగలగా.. వీళ్లలో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది.

  ఐదుగురి మధ్య ఆసక్తికరమైన పోరు

  ఐదుగురి మధ్య ఆసక్తికరమైన పోరు

  ఎన్నో అంచనాలతో ప్రారంభం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 19 అంటే వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీంతో ఇప్పుడు ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీళ్ల ఐదుగురి మధ్య పోరు ఆసక్తికరంగా సాగబోతుంది. దీంతో ఈ వారం మొత్తం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చిన వాళ్లను గెలిపించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ వీక్ ఆసక్తికరంగా సాగబోతుంది.

  Bigg Boss: షణ్ముఖ్‌కు మరో దెబ్బ.. శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు.. మరింత పడిపోయిన ర్యాంక్

  వాళ్లిద్దరి మధ్య పోటీ ఉంటుందని

  వాళ్లిద్దరి మధ్య పోటీ ఉంటుందని

  ఐదో సీజన్‌కు సంబంధించి చాలా మంది టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అయితే, అందులో ఎందరో మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఇప్పుడున్న ఐదుగురూ తమ తమ స్టామినాను నిరూపించుకుని ఇక్కడి వరకూ చేరుకున్నారు. ఇక, ఫినాలేకు చేరుకున్న ఐదుగురిలో టైటిల్ పోటీ మాత్రం వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్యనే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరికీ ఆరంభం నుంచే ఎక్కువ ఆదరణ దక్కుతూ వస్తోంది. మరి ఈ వారం వీళ్లకు ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి మరి.

  మొదలైన ఓటింగ్... చివర్లో ఎవరు

  మొదలైన ఓటింగ్... చివర్లో ఎవరు

  బిగ్ బాస్ ఫినాలలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఆసక్తికరంగా సాగబోతుంది. ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో బుల్లితెర ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ పోలైన ఓట్లలో అతి తక్కువ వచ్చింది సిరి హన్మంత్‌కే అని తెలిసింది. ఆమె కంటే ముందు బలమైన కంటెస్టెంట్లు ఉండడం వల్లే సిరికి తక్కువ ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఆమె చివరి స్థానానికే పరిమితం అవుతుంది.

  బ్రా కూడా లేకుండా కనిపించిన ఈషా: మరీ దారుణమైన ఫోజులతో.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  వాళ్లిద్దరూ మూడు నాలుగు ప్లేస్‌లో

  వాళ్లిద్దరూ మూడు నాలుగు ప్లేస్‌లో


  బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభం నుంచి చక్కని ఆటను కనబరచడంతో పాటు అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించిన వారిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని అందరి కంటే ముందే ఫైనల్స్‌లో అడుగు పెట్టాడతను. ఇక, మొదటి రోజు ఓటింగ్‌లో శ్రీరామ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు, వివాదరహితుడిగా ఉంటూ ప్రతి టాస్కులో వందకు వంద శాతం ఇచ్చిన మానస్‌ మాత్రం నాలుగో స్థానంలో ఉన్నాడట. తొలిరోజే కావడంతో రాను రాను వీళ్ల స్థానాలు పైకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : Reasons Behind RJ Kajal Elimination | Filmibeat Telugu
  టాప్ అతడే.. గెలిచే కంటెంస్టెంట్

  టాప్ అతడే.. గెలిచే కంటెంస్టెంట్


  బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ఓటింగ్‌లో ప్రస్తుతానికి వీజే సన్నీనే టాప్ ప్లేస్‌లో ఉన్నాడట. అతడి తర్వాత స్థానంలో షణ్ముఖ్ జస్వంత్ కొనసాగుతున్నాడని తెలిసింది. ఈ ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఓట్ల అంతరం తక్కువగానే ఉందని అంటున్నారు. అయితే, ఇదే కొనసాగితే మాత్రం వీజే సన్నీనే ఈ సీజన్ విజేతగా నిలుస్తాడు. ఒకవేళ ఈరోజు నుంచి మారితే షణ్ముఖ్ విన్నర్ అవుతాడు. వీళ్లిద్దరి మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి కాబట్టి.. రాను రానూ పరిస్థితి మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Sunny and Shanmukh Got Huge Votes in Finale Week. Maanas and Siri Got Very Less Votes In FIrst Day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X