Bigg Telugu 5th Week Voting: ఓటింగ్‌లో తనూజ హవా.. డేంజర్ జోన్‌లో నలుగురు టాప్ కంటెస్టెంట్స్?
బిగ్‌బాస్ తెలుగు 9 చూస్తుండగానే 5వ వారంలో అడుగుపెట్టింది. ఇప్పటికే 4 వారాలు పూర్తి చేసుకోగా.. నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. త్వరలో బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని వార్తలు వస్తుండటంతో ఈ వారం ఉత్కంఠ నెలకొంది. సోమవారం నామినేషన్స్ పూర్తి కాగా, ఐదో వారం ఓటింగ్‌లో ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఎవరు టాప్‌లో ఉన్నారు పరిశీలిస్తే..
5వ వారం నామినేషన్స్‌లో ట్విస్ట్
సోమవారం నాటి నామినేషన్స్ ఎప్పుడూ జరిగే విధంగా కాకుండా వెరైటీగా జరిగాయి. కంటెస్టెంట్స్ నేరుగా ఇద్దరినీ నామినేట్ చేయకుండా బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఏ ఒక్కరికీ నామినేట్ చేసే అవకాశం లేకుండా చేశాడు. 5వ ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలు నామినేషన్స్‌లో ఉన్నట్లు చెప్పారు. కెప్టెన్ రాము రాథోడ్ తప్పించి బిగ్‌బాస్ తెలుగు 9లో 5వ వారం మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

నామినేషన్స్ తప్పించుకున్న ఇమ్మాన్యుయేల్
ఆ వెంటనే ఇమ్యూనిటీ సాధించిన వాళ్లని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తామని బిగ్‌బాస్ రెండు టాస్క్‌లు ఇచ్చాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలని ప్రతి ఒక్కరూ ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. అయితే ఈ రెండు టాస్క్‌లలో అద్భుతంగా ఆడి ఇమ్మాన్యుయేల్ ఇమ్యూనిటీ పొందాడు. దాంతో బిగ్‌బాస్ తెలుగు 9లో 5వ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇమ్మూ, కెప్టెన్ రాము రాథోడ్‌లు తప్పించి మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్స్‌లో నిలిచారు.
ఓటింగ్‌లో తనూజ హవా
నామినేషన్ తంతు పూర్తి కావడంతో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే.. ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా దుమ్మురేపే సుమన్ శెట్టి ఈ వారం స్టార్టింగ్‌లోనే కాస్త వెనుకబడినట్లుగా కనిపిస్తున్నాడు. కన్నడ పిల్ల తనూజ పుట్టస్వామి దాదాపు 19.44 శాతం ఓటింగ్‌తో ఈ వారం టాప్‌లో నిలిచింది. గత వారం రీతూ చౌదరి వెన్నుపోటుతో కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయిన పడాల పవన్ కళ్యాణ్‌కు కూడా మెరుగైన ఓటింగ్ లభిస్తోంది. నాగార్జున క్లాస్ తీసుకోవడంతో పవన్ ఆటతీరులో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. టాస్క్‌లలో మన సైనికుడు అరివీర భయంకరంగా రెచ్చిపోతున్నాడు. తాజా ఓటింగ్‌లో 15.82 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
డేంజర్ జోన్‌లో నలుగురు కంటెస్టెంట్స్
ఇక టాప్ కంటెస్టెంట్స్‌గా పేరు తెచ్చుకున్న సుమన్ శెట్టి 12.9 శాతం, భరణి 9.91 శాతం ఓటింగ్, సంజన గల్రానీ 9.66 శాతం, దమ్ము శ్రీజ 7.78 శాతం, దివ్య నిఖిత 7.34 శాతం, ఫ్లోరా షైనీ 6.74 శాతం, డిమోన్ పవన్ 5.29 శాతం, రీతూ చౌదరికి 5.13 శాతం ఓటింగ్ సాధించారు. దీని ప్రకారం చూస్తే.. దివ్య నిఖిత, ఫ్లోరా షైనీ, డిమోన్ పవన్, రీతూ చౌదరిలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే వారంలో కంటెస్టెంట్స్ ప్రదర్శనను బట్టి ఓటింగ్ మారే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?


Click it and Unblock the Notifications











