For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్లో దొరికేసిన బిగ్‌బాస్ దేవి నాగవల్లి.. ఆ మాత్రం తెలియకుండానే ఇలానా... దారుణమైన ట్రోలింగ్!

  |

  టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు, న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనతికాలంలోనే బుల్లితెర మీద పాపులారిటీ సంపాదించింది. ఆ పాపులారిటీ తోనే ఆమె బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఆమె ఎంటరై ఇతర కంటెస్టెంట్ లకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.. అయితే ఇప్పుడు ఆమె పెద్ద ఎత్తున ట్రోల్స్ కు టార్గెట్ గా మారింది. ఆమెను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఎందుకు ఏమైంది అనే వివరాల్లోకి వెళితే

  Hamida Khatoon in Bigg Boss Telugu 5: సడెన్‌గా బిగ్‌బాస్‌లో మెరిసిన బెంగాళీ భామ.. ఈమెను ఎందుకు సెలెక్ట్ చేశారంటే?

  బిగ్ బాస్ ఎంట్రీ

  బిగ్ బాస్ ఎంట్రీ

  బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే సమయంలో తాను గత మూడు సీజన్ అలా కాకుండా బిగ్ బాస్ కి లేడీ బిగ్ బాస్ గా మారుతానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది దేవి నాగవల్లి.. అయితే హౌస్ లో ఉన్న మూడు వారాలు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ముద్ర వేసుకుంది. బయట టీవీలో కనిపించే టీవీ నైన్ దేవి వేరు బిగ్ బాస్ దేవి నాగవల్లి వేరు అన్నట్లుగా ఆమె ప్రవర్తన కూడా కనిపించింది. సింగర్ గా డాన్సర్ గా తనలో ఉన్న ఇతర అన్ని కళలను బయట పెట్టే ప్రయత్నం కూడా చేసినా ఆమె మూడో వారంలో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

  Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...

  షాకింగ్ ఎలిమినేషన్

  షాకింగ్ ఎలిమినేషన్

  అయితే దేవి ఎలిమినేషన్ గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు కూడా నడిచాయి. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగలేదని వేరేవాళ్లు ఎలిమినేట్ కావాల్సి ఉన్నా కావాలని దేవి నాగవల్లి ని బయటకు పంపించారని ఇలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేవి నాగవల్లి కూడా బయటకు వచ్చాక ఇలాంటి కామెంట్స్ చేసింది, తాను బయటకు రావడానికి కారణం ఓటింగ్ తక్కువ కావడమేనని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారు. కానీ బయటకు వచ్చాక నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అందరూ చెబుతున్నారని కానీ ఎందుకు వాళ్ళను ఎలిమినేట్ చేయకుండా తనను ఎలిమినేట్ చేయడం బాధించిందని పేర్కొంది.

  Bigg Boss Telugu 5 Sarayu: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ సరయు హాట్ ఫొటోలు.. బూతులే కాదు ఘాటుగానూ!

  నెటిజన్ల ట్రోలింగ్

  నెటిజన్ల ట్రోలింగ్

  అయితే అలా బిగ్ బాస్ తో ఆమె జర్నీ ముగిసిన ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవడమే కాక ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆమె జనానికి టార్గెట్ కావడానికి ముఖ్యమైన కారణం హైదరాబాద్ లో వర్షాలే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

  ఈ వర్షానికి సంబంధించిన న్యూస్ ని రిపోర్ట్ చేస్తున్న సమయంలో దేవి నాగవల్లి ఎక్సైట్ మెంట్ తో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆమె కొంపముంచాయి. అసలు ఆమె చేసిన కామెంట్స్ కి అర్థం ఏమిటో కూడా తెలియకుండానే ఆ మాటలు మాట్లాడింది అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. తెలుగు అర్థాలు కూడా తెలియని వారిని తెలుగు న్యూస్ ఛానల్ లో ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు అన్ని ప్రశ్నలు ఇస్తున్నారు.

  రుధిరం ఏమైనా ఊడిపడుతుందా

  రుధిరం ఏమైనా ఊడిపడుతుందా

  వర్షం పాతం గురించి మాట్లాడుతూ ''రుధిరం ఏమైనా ఊడిపడుతుందా..? రుధిరం మనపైన పగబట్టిందా..? రుధిరం చేస్తున్న రాణాన్ని మనం ఎదుర్కోగలమా అనిపించింది'', కొన్ని చోట్ల వాహానాలు కొట్టుకు పోవడం, కొన్ని చోట్ల అంబులెన్సులు కొట్టుకు పోవడం, కొన్ని చోట్ల మనుషులు కొట్టుకు పోవడం అంటూ ఆమె ఫ్లోలో ఆమె ఉంటూ చెప్పుకొచ్చింది.

  Bigg Boss Telugu 5 కు నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ? || Filmibeat Telugu
  ఆమె చేసింది

  ఆమె చేసింది

  అయితే అసలు రుధిరం అంటే రక్తం, రక్తంతో రణం ఏంటి ? వానకు వాన వల్ల వచ్చిన వరదకు రుధిరానికి, రణానికి సంబంధం ఏంటో? ఆ కంటెంట్ రాసిన వాళ్ళు ఎవరో గాని, నీకు పులిట్జర్ ప్రైజ్ తో పాటు, ఆస్కార్, భాస్కర్ అవార్డు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇది లైవ్ షో అనేది కూడా స్పష్టంగా ఉంది, దీంతో ఆమె కాపీ ఎడిటర్ రాసిన స్క్రిప్ట్ చదవలేదు, ఆమె స్వయంగా చెప్పిందని చెబుతూ ఆమెను ట్రోల్ చేసి మరీ టార్గెట్ చేస్తున్నారు.

  English summary
  Devi Nagavalli, the TV9 anchor and Bigg Boss 4 contestant, is getting heavily trolled over her words on the live show, while Reporting heavy rains in Hyderabad, Devi used ‘rudhiram’ (blood) to describe the rains.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X