For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అపరిచితుడిలా మారిన సంపూ.. బిగ్‌బాస్‌నుంచి బర్నింగ్ స్టార్ అవుట్.. సెలబ్రిటీల కుమ్ములాటలు..

  By Rajababu
  |

  బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌లో మంగళవారం అనూహ్య సంఘటన చోటుచేసుకొన్నది. బిగ్‌బాస్ ఇంటి నుంచి టాలీవుడ్ హీరో సంపూ ఊహించని విధంగా బయటకు వెళ్లడం వీక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్పనపై ఇంటి సభ్యుల అసమ్మతి అప్పుడే మొదలైంది. ఒక గ్రూపు మరో గ్రూపుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. ఓవరాల్‌గా తొమ్మిది రోజున నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి.

  సంపూపై ఇంటి సభ్యుల సానుభూతి

  సంపూపై ఇంటి సభ్యుల సానుభూతి

  మానసిక అశాంతికి గురైన సంపూపై ఇంటి సభ్యుల సానుభూతి పెద్ద మొత్తంలో వ్యక్తమవుతున్నది. సంపూను హౌస్‌ నుంచి బయటకు పంపించేదుకు నామినేట్ చేయాలని అందరు ఓ నిర్ణయానికి వస్తున్నారు. నేను బయటకు పోతా.. ఎవడీ మాట వినను అని సంపూ అనడంపై అందరిలో చర్చ ప్రారంభమైంది.

  Bigg Boss Telugu: Sampoornesh Babu Cries For Elimination
  గ్రూపులు గ్రూపులుగా..

  గ్రూపులు గ్రూపులుగా..

  హరితేజ, కత్తి మహేశ్, కత్తి కార్తీక, శివబాలాజీ ఓ గ్రూప్‌గా ఏర్పడి సంపూ వ్యవహారంపై చర్చించారు. క్లోజ్ వాతావరణం సంపూకు నచ్చడం లేదు అని శివబాలాజీ అన్నారు. అబ్బాయిల్లో సంపూది సెన్సిటివ్ మనస్తత్వం అని కత్తి కార్తీక చెప్పారు.

  ఇంటి సభ్యులపై కల్పన పెత్తనం

  ఇంటి సభ్యులపై కల్పన పెత్తనం

  ఇక తొమ్మిదో రోజున కెప్టెన్ కల్పన ఇంటి సభ్యులపై పెత్తనం సాగించడం మొదలుపెట్టింది. అందరి చేత పని చేయించడానికి నాకు ఎలాంటి మొహమాటం ఉండదు. బయటకు వెళ్లిన తర్వాత ఇంటి సభ్యులతో ఒరిగేదిమీ లేదు అని కల్పన అనడం గమనార్హం.

  కల్పన తీరుపై సమీర్ ఆశ్చర్యం

  కల్పన తీరుపై సమీర్ ఆశ్చర్యం

  ఇంటి పనులు విషయంలో కల్పన, ముమైత్ మధ్య వాదన చర్చకు దారి తీసింది. ఇంటిసభ్యులపై చెలాయిస్తున్న కల్పన ఆధిపత్యం సమీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కల్పనపై గురించి సమీర్, ముమైత్‌లు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంతనాలు సాగించారు. కల్పన తీరు ఆమె చేటు తెస్తున్నది అని సమీర్, ముమైత్ చెప్పుకోవడం గమనార్హం.

  కల్పన వ్యవహారంపై అర్చన అసంతృప్తి

  కల్పన వ్యవహారంపై అర్చన అసంతృప్తి

  కెప్టెన్‌ పదవి లభించిన వెంటనే కల్పన బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అందరి పట్ల మరో రకంగా ప్రవర్తించడం ప్రారంభించింది అని సమీర్ అన్నారు. చిన్న కెప్టెన్ పదవి కోసం అలా చేస్తారా అని అర్చన విమర్శించింది. కల్పన చెప్పే విధానమే నచ్చడం లేదు అని ఆమె అన్నారు. ముమైత్ తనకు మధ్య జరిగిన గొడవ విషయంపై హరితేజ, కల్పన మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. అసలేం జరిగిందో తెలియకుండా లేనిపోనివి ఊహించుకొంటున్నారు. అది సరికాదు కల్పన అభిప్రాయపడింది.

  ఇంటి సభ్యులపై బిగ్‌బాస్‌కు కల్పన ఫిర్యాదు

  ఇంటి సభ్యులపై బిగ్‌బాస్‌కు కల్పన ఫిర్యాదు

  ఇంటిలో వస్తువులను అడ్డదిడ్డంగా పడేయడంపై బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేసింది. బెడ్లపై బట్టలు పెట్టడం, అండర్ వేర్, బ్రాలు పడేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కెప్టెన్‌గా ఇలాంటివి చెప్పడం నాకు కష్టంగా మారింది. సంపూ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి రూల్స్ పెట్టి మమల్ని ఇబ్బంది పెట్టకండి.

  పిచ్చెక్కినట్టు ప్రవర్తించిన సంపూ

  పిచ్చెక్కినట్టు ప్రవర్తించిన సంపూ

  తొమ్మిదో రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా నాలుగు గోడల ప్రపంచంలో తాను బతుకలేననంటూ మానసిక వేదనకు గురైన సంపూ పిచ్చెక్కినట్టు ప్రవర్తించారు. బిగ్‌బాస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నాకు ఇష్టం లేని జీవితాన్ని ఎందుకు నాపై రుద్దుతారు. తలుపులు తెరవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  బిగ్‌బాస్‌ను నిలదీసిన ధన్‌రాజ్

  బిగ్‌బాస్‌ను నిలదీసిన ధన్‌రాజ్

  బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని మినహాయింపులు ఇచ్చానని చెప్పిన వెంటనే ధన్ రాజ్ మేమేమన్న 15 ఏళ్ల పిల్లలమా అని నిలదీశాడు. అంతలోనే తీవ్రమైన పదజలాన్ని ఉపయోగించాడు. నా జీవితంతో ఆడకొంటున్నారు. బిగ్‌బాస్‌పై చిందులు తొక్కాడు. అంతలోనే సంపూను ఇంటి సభ్యులు నచ్చజెప్పారు.

  కన్ఫెషన్ రూమ్‌కు సంపూ

  కన్ఫెషన్ రూమ్‌కు సంపూ

  దాంతో కన్ఫెషన్ రూంకు పిలిచి నచ్చచెప్పే విధంగా చూశారు. కానీ సంపూ అందుకు ససేమిరా అనడంతో బిగ్‌బాస్‌ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మాట్లాడాడు. దాంతో ఈ నాలుగు గోడల మధ్య జీవించలేకపోతున్నాను. ఎప్పుడూ ఉండలేదు. మా వూరును, ఇంటివారిని విడిచి ఉండలేదు. నిద్ర పట్టడం లేదు. ప్లీజ్ నేను ఉండలేను అని సంపూ చెప్పారు.

  ఇంటి రూల్స్‌ను మార్చలేం

  ఇంటి రూల్స్‌ను మార్చలేం

  సంపూ నీ ఇష్టప్రకారం కార్యక్రమానికి వచ్చావు. సంపూ నీ ఒక్కరి కోసం ఇంటి నియమాలను మార్చలేం. ఇంట్లో ఉండే వరకు రూల్స్ పాటించాల్సిందే. బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించడానికి ఇష్టపడలేదు అని స్పష్టం చేశారు.

  ఉండలేకపోతున్నాను. క్షమించండి..

  ఉండలేకపోతున్నాను. క్షమించండి..

  అందుకు నేను ఇక్కడ ఉండలేక పోతున్నాను. మీరు పంపిస్తే ఇంటి నుంచి వెళ్లిపోతాను. క్షమించండి నేను వెళ్లిపోతాను సంపూ బదులు ఇచ్చాడు. దాంతో నీవు వెళ్లడానికి బిగ్ బాస్ అనుమతి ఇచ్చాడు. ఎడమవైపు ఉన్న తలుపు తీసుకొని బయటకు వెళ్లవచ్చు అని ప్రొగ్రాం కోఆర్డినేటర్ చెప్పాడు. దాంతో తలుపులు తీసుకొని సంపూ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు సంపూ బయటకు వెళ్లిన విషయాన్ని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు.

  English summary
  Telugu Version of Bigboss started with High Energy. Young Tiger Entry into show makes worthy. His entry makes audience get thrilled. In 10 th day of 9th Episode surprising events happend in Biggboss house. According to Biggboss permission Sampoo went out from the house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X